మెదక్

పంచాయతీలు పరిపుష్టం అయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 26: గ్రామ పాలనను సుపరిపాలన చేయాలన్న దృక్ఫతంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కొత్త విధానాలను ప్రవేశ పెట్టనుండటంతో గ్రామాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలు, మండల పరిషత్తులకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల మాదిరాగానే సర్పంచ్‌ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారుతుందా అన్న సందేహాలు ఆశావహులను వెంటాడుతున్నాయి. సర్పంచ్‌లను మెజార్టీ వార్డు సభ్యులు ఎన్నుకునే విధంగా కొత్త మార్గదర్శకాలు రూపొందనుండటంతో ఎన్నికయ్యే సర్పంచ్ లకు ఎప్పుడు వెన్నుపోటుకు గురవుతారో తెలియని పరిస్థితులు నెలకొంటాయని నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వార్డు సభ్యుల వేధింపులు ఒక ఎత్తు అయితే అదనంగా నియమించే కమిటీ సిఫార్సులు మరింత భారం అవుతుందన్న అభిప్రాయాన్ని నాయకులు వ్యక్త పరుస్తున్నారు. అయితే కొత్త విధానాల ద్వారా గ్రామాల రూపురేఖలు మారుతాయా లేదా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు గ్రామాలకు చేకూర్చే నిధులు పక్కదారి పట్టకుండా, పనుల్లో నాణ్యత లేకుండా పటిష్టవంతంగా నిర్వహించేందుకు కమిటీల పని తీరు బాగుంటుందన్న వాదనలు లేవనెత్తుతున్నాయి. మరో ఆరు నెలల్లో ప్రస్తుత పంచాయతీల పాలక వర్గం పదవి కాలం ముగియవస్తుండగా గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతున్న క్రమంలో పంచాయతీలకు కొత్త విధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటంతో చర్చకు తెరలేచింది. ఇప్పటి వరకు సర్పంచులను ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకోగా ఓటర్లను ఆకర్షించడానికి లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. పంచాయతీల ఎన్నికల్లో గ్రామాల్లో మద్యం ఏరులై పారేది. కాగా కొత్త విధానాల ద్వారా రిజర్వేషన్ల ప్రకారంగా వార్డు మెంబరుకు పోటీ చేసి గెలుపొందే సభ్యుల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. సర్పంచ్ పదవిని ఆశించి బరిలోకి దిగే అభ్యర్థి వార్డు సభ్యునిగా గెలుపొందకపోతే ఆశ అందని ద్రాక్షగా మారుతోంది. గతంలో సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థి తన ఫ్యానెల్ పక్షాన పోటీ చేసే వార్డు సభ్యుల ఖర్చులు కూడా భరించుకునే వారు. కొత్త విధానాల ద్వారా వార్డు సభ్యులుగా బరిలోకి దిగే అభ్యర్థులు ఎవరికి వారే ఓటర్లను ప్రలోబపర్చుకునే పరిస్థితులు రానున్నాయన్న చర్చ జోరుగా కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న కొత్త విధానాలపై గ్రామాల్లో పార్టీలకు అతీతంగా ఏ నాయకుడు కూడా స్వాగతించడం లేదు. ఈ విధానం వల్ల గ్రామాల్లో ఎప్పుడు రాజకీయ పరమైన అంతర్గత యుద్దానికి దారి తీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జూలై నెలాఖరుతో సర్పంచుల పదవి కాలం ముగియనుండగా ఆలోగా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టి నిర్ణీత సమయానికి పంచాయతీల ఎన్నికలను నిర్వహిస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త విధానాలపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే అంతే సంగతులవుతుందని, మళ్లీ ప్రత్యేక అధికారుల ద్వారా గ్రామ పంచాయతీల పాలనకు దారి తీయవచ్చన్న అభిప్రాయాన్ని నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద గ్రామ పంచాయతీలకు సర్పంచులను ఎన్నుకునే కొత్త విధానాన్ని నాయకులు ఎంత మాత్రం జీర్ణించుకోవడం లేదని చెప్పవచ్చు.

డివైడ్‌కు ఢీ కొన్న బస్సు
* తొమ్మిది మందికి గాయాలు
జహీరాబాద్, డిసెంబర్ 26: మండలంలోని హుగ్గెల్లి శివారులో మంగళవారం జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌కు బస్సు ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారానికి చెందిన 9 మంది గాయాల పాలయ్యారు. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం స్వస్థలాలకు పంపించినట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం లక్ష్మణ్ అనే కార్మికుడితోపాటు మరి కొందరు బుదేర వద్ద మినీ మహీంద్రా బస్సుఎక్కి డ్యూటీ నిమిత్తం బయలుదేరారు. డ్రైవర్ అజరుద్దీన్ అతివేగం, అజాగ్రత్తగా బస్సును నడిపడంతో హుగ్గెల్లి శివారులో డివైడర్‌ను బలంగా ఢీ కొట్టాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న కార్మికులు సురేష్, ప్రభాకర్, మొగుయ్య సహా 9 మందికి గాయాలయ్యాయన్నారు.