తెలంగాణ

పార్లమెంటులో బీసీ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: పార్లమెంటులో బిసి బిల్లు పెట్టించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య రాష్టప్రతి రాంనాథ్ కోవింద్‌ను కోరారు. మంగళవారం ఆర్. కృష్ణయ్య, గుజ్జ కృష్ణ నాయకత్వంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు పలువురు రాష్టప్రతి కోవింద్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. దేశానికి స్వాతంత్య్రం లభించి 70 ఏళ్ళు దాటినా, మెజారిటీ ప్రజలు, 56 శాతం జనాభా ఉన్న బిసిలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో కనీస ప్రాతినిధ్యం లభించలేదని కృష్ణయ్య రాష్టప్రతికి వివరించారు. రాజ్యాంగ రచన సమయంలో బిసిలకు అన్యాయం జరిగిందన్నారు. బిసి జాబితాలోని అనేక కులాలు నేటికీ అత్యంత పేదరికంలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి పార్లమెంటులో రాజ్యాంగంలోని 340వ ఆర్థికల్ ప్రకారం తమరు జోక్యం చేసుకుని బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన రాష్టప్రతిని కోరారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం తరహాలో బిసిలకూ సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బిసి చట్టం తేవాలని కోరారు.

చిత్రం..పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టించాలని రాష్టప్రతి రాంనాథ్
కోవింద్‌కు విజ్ఞప్తి చేస్తున్న సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య