అంతర్జాతీయం

5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 26: బ్రిటన్, ఫ్రాన్స్‌లను వెనక్కి నెట్టేసి 2018 నాటికి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది. ఈ విషయాన్ని సీఈబీఆర్ (సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చి) విడుదల చేసిన ‘2018- ప్రపంచ ఆర్థిక సంఘం’ నివేదికలో పేర్కొన్నారు. ఆసియా ఆర్థికవ్యవస్థ ఎదుగుదలను గమనిస్తే భారత్ దూసుకుపోతోందన్న విషయం తేటతెల్లమవుతుందని, రాబోయే 15 ఏళ్లలో ప్రపంచంలోనే మొదటి 10 అతిపెద్ద ఆర్థికవ్యవస్థలు ఆసియాలోనే ఉం టాయని నిపుణులు చెబుతున్నారు. తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులున్నా భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ 2018 నాటికి బ్రిటన్, ఫ్రాన్స్‌లను మించిపోతుందని, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందుతుందని సీఈబీఆర్ డిప్యూటీ చైర్మన్ డగ్లస్ మెక్‌విలియమ్స్ చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు, వస్తుసేవా పన్ను (జీఎస్టీ) నేపథ్యంలో భారత్‌లో వృద్ధి కాస్త మందగించినా, ఈ పరిస్థితుల్లో ఆశాజనకమైన మార్పులుంటాయన్నా రు. 2032 నాటికి అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా చైనా అవతరిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల ప్రభావంతో వాణిజ్యరంగానికి తక్కువ నష్టం జరిగిందని, మరో ఏడాది పాటు వాణిజ్యరంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ‘బ్రెగ్జిట్’ ప్రభావంతో బ్రిట న్ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికన్నా తక్కు వ స్థాయిలోనే దెబ్బతిన్నదని, కానీ- 2020 నాటికి బ్రిటన్ స్థానాన్ని ఫ్రాన్స్ కైవసం చేసుకుంటుందన్నారు. చమురు ధరలు, ఇంధన రంగం సమస్యల వల్ల 2032 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో రష్యా 17వ స్థానానికి దిగజారుతుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 2018లో 3.6 శాతానికి (ప్రస్తుతం 3.5శా తం) చేరుకుంటుందని ‘రాయిటర్స్’ వార్తా సంస్థ జరిపిన అభిప్రాయ సేకరణలో ఆర్థికవేత్తలు తెలిపారు.