జాతీయ వార్తలు

నాలుగు రోజులు ఆగండి! రాజకీయ ఎంట్రీపై రజనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 27: తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. తన రాజకీయ ప్రవేశంపై మరో నాలుగు రోజులు వేచిచూడండని ఆయన సూచించారు. ఈ విషయమై ఈ నెల 31న తన నిర్ణయం వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. రజనీ తాజా ప్రకటనతో తమిళనాట ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు దారులు సుగమమైనట్టు తెలుస్తోంది. రజనీ రాజకీయ ప్రవేశంపై బుధవారం పలువురు మీడియా ప్రతినిధులు అతనిపై ప్రశ్నల వర్షం గుప్పించినపుడు మరో నాలుగు రోజులు వేచిచూడండి అంటూ సమాధానమిచ్చారు.
తమిళనాడు అభివృద్ధికి ప్రణాళికలేమైనా ఉన్నాయా అని మీడియా ప్రశ్నించినపుడు ఆయన తనదైన స్టైల్‌లో నవ్వుతూ ఒక కల్యాణ మండపంలో తన అభిమానులతో సమావేశం కానున్నట్టు తెలిపారు. ఈ యేడాది ద్వితీయార్థంలో రజనీ ఆరుసార్లు తన అభిమానులతో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మేలో ఆయన తన అభిమానులను కలుసుకుని వారితో ఫొటోలు దిగారు. అదేవిధంగా బుధవారం రజనీ కుర్తాపైజమాతో తన అభిమానులను కలుసుకుని రెండోసారి ఫొటోలు దిగారు.