జాతీయ వార్తలు

మేమే కొలుచుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: రెండేళ్ల క్రితం సంభవించిన తీవ్ర భూకంపం నేపథ్యంలో ఎవరెస్టు శిఖరం ఎత్తును సమష్టిగా మళ్లీ కొలుద్దామంటూ భారత్ చేసిన ప్రతిపాదనను నేపాల్ తిరస్కరించింది. ఈ విషయంలో ఎవరితోనూ చేతులు కలిపేది లేదని, తామే ఎవరెస్టు శిఖరం ఎత్తును మళ్లీ అంచనా వేస్తామని వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని సేకరించే విషయంలో భారత్, చైనా సహకారాన్ని తీసుకుంటామని నేపాల్ సర్వే విభాగం డైరెక్టర్ జనరల్ గణేష్ బక్తా తెలిపారు. ఎవరెస్టు శిఖరం చైనా-నేపాల్ సరిహద్దులో ఉందని, అందుకే దీని ఎత్తును మళ్లీ కొలిచే విషయంలో భారత్ చేసిన ప్రతిపాదనను నేపాల్ తిరస్కరించడం వెనుక చైనా పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2015లో సంభవించిన అత్యంత భయానక భూకంపంతో నేపాల్ మొత్తం కదిలిపోయింది. అప్పుడే ఎవరెస్టు శిఖరం ఎత్తు కూడా తగ్గి ఉండవచ్చునన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. దాదాపు ఎనిమిదివేలమంది ప్రాణాలను బలిగొన్న పెను భూవలయంలో లక్షలాదిమంది నిర్వాసితులయ్యారు. అప్పుడే భారత్ ఈ ప్రతిపాదన చేసింది. సంయుక్తంగా ఎవరెస్టు శిఖరం ఎత్తును కొలుద్దామని తాము సంకేతాలు పంపామని, కానీ నేపాల్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని భారత్ సర్వేయర్ జనరల్ మేజర్ జనరల్ గిరీష్‌కుమార్ తెలిపారు. అయితే భారత్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ తామే ఎవరెస్టు శిఖరాన్ని సొంతంగానే కొలుస్తామని నేపాల్ సర్వే విభాగం డైరెక్టర్ జనరల్ గణేష్ బక్తా తెలిపారు. 1975, 2005లో ఎవరెస్టు శిఖరం ఎత్తును చైనా మళ్లీ కొలిచింది. అలాగే 1956లో భారత సర్వేయర్లు ఈ ప్రక్రియను చేపట్టారు. భారత సర్వేయర్ జనరల్ అధికారులు బ్రిటిష్ హయాంలో ఎవరెస్టు శిఖరం ఎత్తును కొలిచారు. సర్ జార్జి ఎవరెస్టు సర్వేయర్ జనరల్‌గా పనిచేసిన కాలంలో భారతదేశం మొట్టమొదటిసారిగా ఎవరెస్టు శిఖరం ఎత్తును ప్రకటించింది. 1855లో భారత్ ఎవరెస్టు శిఖరం ఎత్తును నిర్ధారించిందని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం తెలిపింది.