జాతీయ వార్తలు

ఖరాన్‌కు వ్యతిరేకమైతే తలాఖ్ బిల్లు ఆమోదించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 27: ట్రిపుల్ తలాఖ్‌పై ప్రభుత్వం చేయబోతున్న చట్టం ఖరాన్ భావాలకు విరుద్ధంగా ఉంటే ఆమోదించేది లేదని బుధవారం ముస్లిం మహిళా సంఘాల ప్రకటించాయి. ట్రిపుల్ తలాఖ్‌పై నేడు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్న తరుణంలో ముస్లిం మహిళా సంఘాలు ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘పెళ్లి ఒక ఒప్పందమే. ఆ ఒప్పందానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవ్వరైనా శిక్షార్హులే. కానీ, అది ఖురాన్ భావాలకు, చట్టానికి అతీతంగా ఉంటేమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని అఖిల భారత ముస్లిం వుమెన్ పర్సనలా బోర్డు (ఏఐఎండబ్ల్యుపిఎల్‌బి) చైర్‌పర్సన్ షైష్టా అంబర్ స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాఖ్‌పై ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ‘ఈ విషయమై లా కమిషన్‌కు ఓ లేఖ రాశాం. ట్రిపుల్ తలాఖ్ వివాదంపై పని చేస్తున్న అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఏఐఎండబ్ల్యుపిఎల్‌బి, జమైత్ ఇస్లామీ, జమైత్ ఉల్మా-ఇ-హింద్, ఇతర ముస్లిం సంస్థలకు బిల్లు ముసాయిదా ప్రతి ఇవ్వాలి’ అని కోరామన్నారు. అయితే, బిల్లు ప్రతి ఇవ్వడం కుదరదుగానీ, అవసరమైతే దీనిపై చర్చిస్తామని లా కమిషన్ సమాధానమిచ్చినట్టు వెల్లడించారు. ముస్లింల వ్యవహారాలను చూడాల్సిన ఏఐఎంపిఎల్‌బి ట్రిపుల్ తలాఖ్‌పై ఇప్పటివరకూ బాధ్యతగా వ్యవహరించలేదని, ఇప్పుడు కళ్లు తెరిచినా ఆలస్యమైపోయిందని వ్యాఖ్యానించారు. ముస్లిం వుమెన్ లీగ్ అధ్యక్షురాలు నైష్ హసన్ మాట్లాడుతూ వివాదం తలెత్తినపుడు భార్యాభర్తలు కలిసుండేందుకు కోర్టులు ఒక అవకాశం కల్పిస్తాయని, అయితే ప్రస్తుత బిల్లులో అలాంటి అవకాశాన్ని పొందుపర్చటం ఎంతమాత్రం మంచిది కాదన్నారు. ‘మూడో వ్యక్తి జోక్యమూ సమర్థనీయం కాదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఎప్పుడో రూపొందించిన బిల్లును ఇప్పుడు యథాతథంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం మంచిది కాదంటూనే, బిల్లుపై మరింత లోతైనా చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎలాంటి చర్చలు లేకుండానే పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందితే, మహిళా సంఘాలు మళ్లీ పోరాటబాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ట్రిపుల్ తలాఖ్ బిల్లు రాజ్యాంగబద్ధంగా ముస్లిం వర్గాల హక్కులను దెబ్బతీసేదిగా ఉందని, బిల్లు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలంటూ ఇంతకుముందే ఎఐఎంపిఎల్‌బి డిమాండ్ చేయడం తెలిసిందే. ఒకవిధంగా విడాకులు తీసుకునే హక్కును పురుషుడి నుంచి బలవంతంగా లాక్కోవడమేనని వాఖ్యానించడం తెలిసిందే. ప్రస్తుత బిల్లుతో మగవారిపై మహిళల కక్షసాధింపు చర్యలు పెరిగే అవకాశం ఉందని, ఈ విషయాన్ని లోతుగా ఆలోచించి పార్లమెంట్‌లో బిల్లు ప్రతిపాదనను వాయిదా వేయాలి లేదా ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఏఐఎంపిఎల్‌బి చైర్‌పర్సన్ వౌలానా రబే హసాని నద్వీ విజ్ఞప్తి చేసినట్టు అధికార ప్రతినిధి వెల్లడించారు.