తెలంగాణ

ఆదివాసీ ఉద్యమం వెనుక మాజీలే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్, డిసెంబర్ 27: లంబాడాలకు వ్యతిరేకంగా ఆదివాసీలు చేపడుతున్న ఆందోళనల వెనక ఉన్నది మావోయిస్టులు కాదని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. కొంత మంది మాజీలు అన్నీ తామై ఈ ఉద్యమాన్ని వెనకుండి నడిపిస్తున్నారన్నారు. బుధవారం ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అరిగెల నాగేశ్వర్‌రావులతో కలిసి ఆయన విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఆదివాసీ ఉద్యమం వెనక మావోయిస్టులున్నారని డీజీపీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలంటూ ఆదివాసీలను ఆందోళనలకు పురిగొల్పుతోంది మాజీ మావోయిస్టులే అన్నారు. కాని ఆదివాసీ ఉద్యమం వెనక మావోయిస్టుల పాత్ర లేదన్నారు. కొంత మంది డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి పేర్కొన్నారు. ఆదివాసీల ఆందోళనల వెనక మావోయిస్టులున్నారని మహేందర్ రెడ్డి చెప్పలేదని రామన్న తెలిపారు. ఆదివాసీలు సైతం తమ డిమాండ్లను శాంతిమార్గంలో నెరవేర్చుకోవాలని రామన్న సూచించారు. అంతేతప్ప హింసాత్మక చర్యలతో డిమాండ్లను సాధించుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఆదివాసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమస్యలుంటే అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళితే ముఖ్యమంత్రిని కలిపిస్తారని తెలిపారు. గ్రామాల్లో నిత్యం కలిసి మెలిసే నివసించే ఆదివాసీలు, లంబాడాలు పరస్పర దాడులకు పాల్పడడం అప్రజాస్వామికమని తెలిపారు.
ప్రభుత్వ చర్యలతో బీసీలకు నవశకం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో వెనకబడిన కులాలైన బీసీలకు నవశకం మొదలైనట్టేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న తెలిపారు. ఆ దిశగా కేసీఆర్ సర్కార్ చర్యలు చేపడుతోందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అనేక పార్టీలు దేశాన్ని పరిపాలించాయన్నారు. కాని జనాభాలో 54 శాతం జనాభా ఉన్న బీసీలను పాలకులు విస్మరించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం బీసీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే గొల్ల, కుర్మలకు ఉపాధి కల్పించేందుకు గొర్రెలను పంపిణీ పథకాన్ని ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.12వందల కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. కుల వృత్తులపై ఆధార పడి జీవనం సాగిస్తున్న బీసీలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు ముఖ్యమంత్రి, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశమై నివేదికలు తెప్పించుకున్నట్టు మంత్రి రామన్న తెలిపారు. అలాగే సంచార జాతుల కోసం మరో వెయ్యి కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. కుల వృత్తుల వారికి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వ్యాపారాలకు అనుగుణంగా రూ.50వేల నుండి 2లక్షల వరకు రుణాలు నేరుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీసీల కోసం మహాత్మా పూలే పేరిట భవనం నిర్మించనున్నట్ట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని సింగరేణి ద్వారా కేటాయించిన రూ.100 కోట్ల నిధులను సమీప గ్రామాల అభివృద్ధ్దికి ఖర్చు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ఛైర్మెన్ కన్నక యాదవ్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్, నాయకులు ప్రవీణ్ గౌడ్, జీవన్, జగదీష్ పాల్గొన్నారు.