క్రీడాభూమి

సెయలింగ్ పోటీలతో ఓడరేవు అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, డిసెంబర్ 27: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో బుధవారం తెలంగాణ డీజీపీ కృష్ణప్రసాద్ (రైల్వే అండ్ రోడ్స్ భద్రతా విభాగం అధికారి) ముఖ్య అతిథిగా విచ్చేసి సెయలింగ్ పోటీలను ప్రారంభించారు. బుధవారం ఓడరేవులో జరిగిన అంతర్జాతీయ సెయలింగ్ పోటీలను కృష్ణప్రసాద్, పోర్టు సీఈఓ అనిల్ యండ్లూరి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ కృష్ణపట్నం ఓడరేవులో అంతర్జాతీయ స్థాయి సెయలింగ్ పోటీలను నిర్వహించడం శుభపరిణామమన్నారు. సైలర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఓడరేవు యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడంతోపాటు అహ్లాదకరమైన వాతావరణంలో పోటీలను నిర్వహించడం, ఈ పోటీలకు వివిధ దేశాలకు చెందిన 160 మంది సెయలర్లు పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. వివిధ దేశాలకు చెందిన సెయలర్లు నేడు ఓడరేవులో జరిగే సైలింగ్ పోటీల్లో పాల్గొనడం పోర్టు అభివృద్ధికి మరో మైలురాయి అని డీజీపీ కృష్ణప్రసాద్ కొనియాడారు. పోర్టు అభివృద్ధి దిశగా ముందుకు సాగడంతోపాటు పర్యాటక రంగ అభివృద్ధికి ఓడరేవు యాజమాన్యం చేస్తున్న కృషి మరువలేమంటూ పోర్టు సేవలను ఆయన కొనియాడారు. తదుపరి ఓడరేవు సీఈఓ అనిల్‌కుమార్ మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టులో జరిగే అంతర్జాతీయ సెయలింగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సెయలింగ్ పోటీలతో క్రీడాకారుల్లో మానసిక వికాసం, నైపుణ్యంతోపాటు శరీర దృడత్వం ఏర్పడుతుందని అన్నారు. సైలింగ్ పోటీల్లో 11దేశాలకు చెందిన 160 మంది సెయలర్లు ఎంతో ఉత్సాహంతో పోటీల్లో పాలొంటున్నారని ఆయన తెలిపారు. ఈ పోటీలకు ఇండియాతోపాటు శ్రీలంక, మలేషియా, స్విడన్, యుఏఇ, ఇండోనేషియా, సింగపూర్, హాంకాంగ్, యుఎస్‌ఎ, కెనడా, ఐర్లాండ్ దేశాలకు చెందిన సెయలర్లు హాజరుకావడం శుభపరిణామం అన్నారు. తొమ్మిదవ ఎడిషన్ ఏసీఎస్ సెయలింగ్ యూత్ సైలింగ్‌కప్ పోటీలకు క్రీడాకారులు ఇతర దేశాల నుంచి ఉత్సాహంగా తరలిరావడం ఈప్రాంత అభివృద్ధికి మరొమెట్టన్నారు. నవయుగ సెయలింగ్ అకాడమీ, తమిళనాడు సెయలింగ్ అకాడమీ, యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆసియా సెయలింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈపోటీలు జరుగుతున్నాయ.
సెయలింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు: కృష్ణపట్నం పోర్టులో సెయలింగ్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేస్తామని ఓడరేవు సీఈఓ అనిల్ తెలిపారు. ఆసక్తిగలవారు సెయలింగ్‌లో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొని రాష్ట్రంతోపాటు, దేశానికి మంచి పేరు తీసుకువచ్చేందుకు తమ వంతు కృషిచేయాలని ఆయన అన్నారు.