మెయన్ ఫీచర్

నేడు గుజరాత్! రేపు కర్ణాటక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న బెంగళూరు నుండి బంధువులు వచ్చారు. వారితో ముచ్చటిస్తూ స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని అడిగాను. దానికి వారు జవాబిస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉంది, ఐతే దీనిని (యాంటీ ఇన్‌కంబెన్సీ) బిజెపి ఎంతవరకు ఓట్లకింద మలుచుకోగలదో వేచి చూడాలి అని చెప్పారు. 2019లో జరిగే ఎన్నికలలో కర్ణాటకలో కాంగ్రెసు ప్రభుత్వం కూలిపోతే దాదాపు వింధ్యకు దిగువనగల దక్షిణ భారతమంతా కాంగ్రెసు ముక్త భారత్ అవుతుంది.
ఇంతకూ కర్ణాటకలో ఏం జరుగుతున్నది? దీనిని పరిశీలించబోయే ముందు 2017 డిసెంబరులో గుజరాత్ హిమాచల ప్రదేశ్‌లలోని ఎన్నికల ఫలితాలను సంక్షిప్తంగా గమనిద్దాము. బలం తగ్గినా బిజెపి 99 స్థానాలలో గుజరాత్‌లో ఆరవసారి అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. ప్రతిపక్షంగా కాంగ్రెసు బలపడింది. బిజెపి శాసనసభాపతి ఆరుగురు మంత్రులు కూడా ఓటమిపాలైనారు. ఇక్కడ విజయ్‌రూపాని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బిజెపియేతర శక్తులన్నీ ఏకమైనాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో గతంలో పటేల్ వర్గం వారు సర్దార్ వల్లభ్‌భాయి పటేల్‌తో పార్టీ స్థాపించారు. ప్రముఖ బిజెపి నాయకుడు కేశూభాయ్ పటేల్ ఇక్కడే లోగడ బిజెపిపై తిరుగుబాటు జండా ఎగురవేశాడు. అటల్ బిహారీ వాజ్‌పాయి బ్రతిమలాడినా ప్రాధేయపడినా వినలేదు. ఇప్పుడు హార్దిక్ పటేల్ అనే 23 సంవత్సరాల యువకుడు రంగంలోకి దిగి పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలి అటూ రూపాని ప్రభుత్వాన్ని బహిరంగంగా డిమాండ్ చేశాడు. ‘మేము అధికారంలోకి వస్తే పటేల్ వర్గానికి రిజర్వేషన్లు ఇస్తాము’ అని కాంగ్రెస్ తన మానిఫెస్టోలో పేర్కొన్నది. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీకి ప్రజలకుకూడా తెలుసు. ఒక దశలో పాకిస్తాన్ ప్రత్యక్షంగా రంగప్రవేశం చేసి గుజరాత్ ఎన్నికలను శాసించడం మొదలుపెట్టింది. జిగ్నేష్ అనే అట్టడుగువర్గాల నాయకుడు బిజెపి ఓటుబ్యాంకును చీల్చాడు. అసమర్థ పాలకురాలైన ఆనంద్‌బెన్ పటేల్‌ను ముఖ్యమంత్రి పదవినుండి తప్పిస్తే ఆమెవర్గం అలిగింది. ఇలా ఊహించలేని ప్రతికూల పరిస్థితులలో గుజారాత్‌లో బిజెపి విజయం సాధించింది. పెద్దనోట్ల రద్దు - జిఎస్‌టి వంటి కేంద్రప్రభుత్వ నిర్ణయాలు బిజెపి ఓటు బ్యాంకను తూట్లు పొడిచాయి. గుజరాత్‌లో బిజెపి ఓడిపోతే 2019లో నరేంద్ర మోదీ పని అయిపోయినట్లే అని చాలామంది ఎదురుచూశారు. ఐనా రూపాని విజయం సాధించాడు. ఇది రూపానీ విజయం కాదు. గుజరాత్ ప్రజలు తమ రాష్ట్రానికి చెందిన ప్రధానమంత్రిని గౌరవించుకున్నారు.
1948లో సోమనాథ దేవాలయం పునరుద్ధరణకు కెం.ఎం.మున్షి, కర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రయత్నిస్తే దానిని పండిత జవహర్‌లాల్ నెహ్రూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. 2017లో రాహుల్ గాంధీ సోమనాథ దేవాలయంలోకి వెళ్లి తాను శివభక్తుణ్ణి, యజ్ఞోపవీతం ధరించిన బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకున్నారు. ఇలా గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఎన్నో నాటకాలు అంతర్నాటకాలు జరిగాయి. ఎన్నికల సమయంలో అధికారపక్షమూ, ప్రతిపక్షమూ ఇలా దుమ్మెత్తిపోసుకోవడం, భావోద్రేకాలను రెచ్చగొట్టడం సహజమే. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు దాదాపుగా ముందే నిర్ణయమైంది. అక్కడ కాంగ్రెసు ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో ఆపిల్ వర్తకుల అలక, బిజెపికి సంస్థాగతంగా ‘్ధమాల్’ బలం, అక్కడ నిర్ణయాత్మకంగా మారాయి. ఈ రెండు ఎన్నికల ఫలితాల ప్రభావం 2019 ఎన్నికలపై పడుతుంది. సంస్థాగతంగా సోనియాగాంధీ తన నాయకత్వ బాధ్యతలను రాహుల్‌కి అప్పగించి క్రియాశీల రాజకీయాలనుంచి తప్పుకున్నారు. ఈ దశలో గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నిజానికి గుజరాత్‌లో బిజెపి గెలిచింది - అనటంకన్నా ప్రధాని నరేంద్రమోదీని గుజరాత్ ప్రజలు గౌరవించారని చెప్పడం సమంజసంగా ఉంటుంది. ఇప్పుడు బిజెపి తన దృష్టిని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలపై సారించింది. కర్ణాటకలో కాంగ్రెసు విజయసాధన కోసం చాలా వ్యూహాలు రచించింది. భాషాదురభిమానాన్ని రెచ్చగొట్టింది. భారత జాతీయ జండాతోపాటు కర్ణాటక ప్రాంతంలో జండా ఒకటి ఆమోదించి దేశద్రోహానికి పాల్పడింది. జర్నలిస్టు గౌరీలంకేశ్‌ను ఎవరు హత్య చేశారో తెలియకపోయినా ఇది ‘హిందూ జాతీయ శక్తుల పనే’ అంటూ అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసింది. టిప్పుసుల్తాను జయంతి ఉత్సవాలు జరిపి మైనారిటీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రజలు నిరసన తెలిపితే వారిపై కాల్పులు జరిపించింది. రోడ్లవంటి ప్రాథమిక సౌకర్యలు సరిగ్గా లేని సమయంలో కర్ణాటక రాజ్యోత్సవాలు జరిపి శాసనసభ్యులకు బంగారునాణాలు, వెండిపళ్లాలు పంచిపెట్టారు. బ్లాక్‌లో టిక్కెట్లు కొనుక్కొని సిద్దరామయ్య కుటుంబం ‘బాహుబలి’ సినిమాను చూసింది. 80 లక్షల విలువైన రిస్ట్‌వాచ్ ధరించి సిద్దరామయ్య నిరాడంబరత గురించి ఉపన్యాసాలు చెప్పాడు. టిప్పుసుల్తాను నిజంగా దేశభక్తుడా? 1788 మార్చి 22 నాడు టిప్పుసుల్తాన్ అబ్దుల్ ఖాదిర్‌కు వ్రాసిన జాబులో ఇలా ఉంది..‘‘ఖాదిర్‌జీ నంబ్రూద్రి బ్రాహ్మణులతో సహా 12000 మందిని మన మతంలోకి మార్చాను’’. 1788 డిసెంబరు 14నాడు టిప్పు వ్రాసిన మరొక ఉత్తరంలో ఇలా ఉంది... ‘‘డిసెంబరు 21 - 1788 నాడు టిప్పు వ్రాసిన మరొక జాబు ‘‘ షేక్ కుతుబ్‌జీ - 242 మంది నాయర్ కులస్థులను పట్టుకున్నాను - వారిని మతం మార్చి మంచి దుస్తులతో అలంకరించాను’’. జనవరి 18, 1790లో టిప్పు రాసిన మరొక జాబులో ఇలా రాశాడు..‘‘సయ్యద్ అబ్దుల్ దులాల్ జీ! కాలికట్‌పై జిహాదీ ప్రకటించాను. ఈ ప్రాంతమంతా మత మార్పిడులు చేయబడింది. మలబార్ ప్రాంతాలలో రమణ నాయకర్‌ను అణచివేసి 4 లక్షల మందిని మతం మార్పించాను’’. కొడగు (కూర్గు) ప్రాంతంలో వేలాది హిందువులను, స్ర్తిలు, శిశువులు అనే తేడా లేకుండా హతమార్చాడు. ఇలాంటి వాని జయంతిని రాష్ట్రప్రభుత్వం అధికారికంగా జరపడం దేనికోసం? ఆ మధ్య జరిగిన అల్లర్లలో 175 మంది మైనారిటీలపైగల 1614 కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఇవన్నీ తమకు 2019 ఎన్నికలో ఓట్లు తెచ్చిపెడతాయని సిద్దరామయ్య భావిస్తున్నాడు. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కుంభకోణాల కారణంగా బిజెపి యడ్యురప్ప ప్రభుత్వం లోగడ పదవి కోల్పోయింది.
ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి వ్యూహరచన చేస్తున్నది. ఇక్కడ కేసీఆర్‌ప్రభుత్వం ఎంఐఎం మద్దత్తుమీద ఆధారపడింది. అట్టడుగు వర్గాల ఓట్లను ప్రొఫెసర్ కోదండరామ్ చీలుస్తున్నారు. ఈ దశలో కేంద్రంతో వ్యతిరేక ధోరణికి కేసీఆర్ ప్రభుత్వం సుముఖంగా లేదు. మరి ఢిల్లీలో దోస్తీ, రాష్ట్రంలో కుస్తీ అనే వ్యూహం ఎలా ఉండబోతున్నది? గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపిలో ఉత్సాహం పెరుగగా ప్రతిపక్షాలలో ఆత్మస్థైర్యం సన్నగిల్లిందని చెప్పవచ్చు. ‘గుజరాత్ ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు తెలంగాణలో జరుగుతాయి’ అని బిజెపి సీనియర్ నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఈ వాక్యానికి అర్థం ఏమిటి?? వలసలు - రాజకీయ పునరేకీకరణలు జరుగబోతున్నాయని భావమా??

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్