హైదరాబాద్

అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: మహానగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ) కింద చేపట్టిన అయ్యప్ప సొసైటీ సమీపంలోని అండర్ పాస్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కే. తారరామారావు నేడు ఈ అండర్‌పాస్‌ను ప్రారంభించనున్నారు. నిర్ణీత గడువు కన్నా ముందుగానే ఈ అండర్‌పాస్ పనులు పూర్తికావటం విశేషం. జీహెచ్‌ఎంసీ అధికారులు ఏ ప్రాజెక్టు చేపట్టినా, క్షేత్ర స్థాయిలో స్థల సేకరణ మొదలుకుని అనేక రకాల అడ్డంకులు ఎదురై నిర్ణీత గడువు ముగిసి అయిదారేళ్లు పూర్తయితే గానీ ప్రాజెక్టులు పూర్తి కాని పరిస్థితులు నెలకొన్న నేటి తరుణంలో ఈ అండర్‌పాస్ నిర్మాణ పనులు రికార్డు సమయంలో పూర్తి కావటానికి పనులను ఎప్పటికపుడు పర్యవేక్షించటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దాదాపు రూ. 44.30 కోట్ల వ్యయంతో 450 మీటర్ల పొడువున చేపట్టిన ఈ అండర్‌పాస్ నిర్మాణ పనులకు రూ. 44.30 కోట్లను వెచ్చించారు.
అయ్యప్ప సొసైటీ మార్గంలో 220 మీటర్లు, కొండాపూర్ వైపు 160 మీటర్ల పొడువున నిర్మించే ఈ అండర్‌పాస్ ఏడు మీటర్ల క్యారేజీవేతో కలుపుకుని మొత్తం 10 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. కొండాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ మార్గంలో పనులను వేగవంతం అయ్యేలా నిరంతర సమీక్షలు నిర్వహించారు. అయ్యప్ప జంక్షన్ మార్గంలో ప్రస్తుతం గంటకు 9వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయని, 2035 నాటికి ఈ వాహనాల సంఖ్య 19వేలకు పెరగనున్నట్లు అధికారులు అంచనా వేశారు. గత సంవత్సం ఆగస్టు 8న ప్రారంభమైన అండర్‌పాస్ పనులు వచ్చే మార్చి కల్లా పూర్తి చేయాల్సి ఉండగా, ఈ మార్గంలో ఉన్న 132 కె.వీ విద్యుత్ టవర్లు, విద్యుత్ లైన్లను తొలగించటంలో జాప్యం అయ్యింది. 132 కేవీ విద్యత్ టవర్లు, హై టెన్షన్ విద్యుత్ లైన్ల తొలగింపునకు ట్రాన్స్‌కోకు అవసరమైన నిధులను జీహెచ్‌ఎంసీ ముందుగానే డిపాజిట్ చేసినప్పటికీ 2017 మే మాసంలో పూర్తి చేయాల్సిన పనులను ఆరు నెలల ఆలస్యంగా అంటే అక్టోబర్ 3వ తేదీన ట్రాన్స్‌కో పూర్తి చేసింది. నగరంలో భారీ వర్షాలు కురవటంతో నిర్మాణ పనులను పదిరోజుల పాటు నిలిపివేసినా, నిర్ణీత గడువు కంటే ముందే ఈ అండర్‌పాస్‌ను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ట్రాన్స్‌తో పనులు ఆలస్యమైనా, నిర్ణీత గడువుకు ముందుగానే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.
అండర్‌పాస్ ప్రత్యేకతలు
* ఈ అండర్‌పాస్ మొత్తం 450 మీటర్ల పొడువున నిర్మాణం
* 70 మీటర్ల పొడువు క్లోజ్‌డ్ బాక్స్
* 380 మీటర్ల విస్తీర్ణంలో అప్రోచ్ రోడ్డు
* కొండాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు రెండు లేన్ల రహదారి
* 70 మీటర్ల పొడువున చేపట్టాల్సిన క్యాష్ బ్యారియల్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
* అండర్‌పాస్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య బాగా తగ్గనుంది.