కృష్ణ

జన్మభూమికి ఆటంకాలు లేకుండా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి గ్రామసభలకు ఎటువంటి అటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు శాఖ మీద ఉందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ అన్నారు. మంగళవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు జన్మభూమి ద్వారా ప్రజల్లోకి చేరేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామసభల నిర్వహణకు ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో మెలిగి జన్మభూమి ముఖ్య ఉద్దేశం నెరవేరేలా చూడాలన్నారు. నియోజకవర్గాల వారీగా జన్మభూమి కార్యక్రమాల సమాచారాన్ని సేకరించాలన్నారు. సేకరించిన సమాచారాన్ని విశే్లషించుకుని ఇతర నియోజకవర్గాల సిబ్బందితో సమాచార పంపిణీని నిరంతరం కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, బందరు డీఎస్పీ ఎండి మహబూబ్ బాషా, ఎస్‌సి, ఎస్‌టి సెల్ డీఎస్పీ హరిరాజేంద్రబాబు, ఎస్‌బీ సీఐ రఘు, డీసీఆర్‌బీ సీఐ దుర్గారావు, ఎస్‌బీ ఎస్‌ఐ వీర్రాజు, డీసీఆర్‌బీ ఎస్‌ఐ గఫార్ తదితరులు పాల్గొన్నారు.