రాష్ట్రీయం

కొలకలూరి నాటక, కవితా పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా అందజేస్తున్న కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారాలకు, కొలకలూరి భాగీరథీ కవితా పురస్కారాలకు ఎంట్రీలను స్వీకరిస్తున్నారు. ఎంట్రీలు జనవరి 18వ లోగా పంపించుకోవల్సి ఉంటుంది. ఫిబ్రవరి 18న పురస్కార ప్రకటన చేస్తారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక సభలో పురస్కార ప్రదానం జరుగుతుంది. నాటక పురస్కారానికి సంబంధించి వివరాలను డాక్టర్ కొలకలూరి సుమకిరణ్, కవితా పురస్కారానికి సంబంధించి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి వివరాలు అందించారు.
నాటక పురస్కారాన్ని ఈ ఏడాది గ్రంథ రూపంలో ముద్రిత నాటక, నాటికా సంపుటాలకు అందిస్తామని ఇందుకోసం రచయితలు లేదా ప్రచురణ కర్తలు మూడేసి ప్రతులు పంపించాలని సుమకిరణ్ తెలిపారు. ఒకే రచయితవి ఒకటి కంటే ఎక్కువ నాటకాలు లేదా నాటికా సంపుటాలను ఎంపించవచ్చని ఆమె తెలిపారు. ఎంట్రీలను డాక్టర్ కొలకలూరి సుమ కిరణ్, ప్రొఫెసర్ ఆంగ్లశాఖ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి -517502 అనే చిరుమానాకు పంపించాలని ఆమె కోరారు.
కొలకలూరి భాగీరథీ కవితా పురస్కారానికి ముద్రిత పద్య/గేయ/వచన కావ్యాలు/ సంకలనాలు పంపించవచ్చని ఆచార్య కొలకలూరి మధుజ్యోతి తెలిపారు.
ఎంట్రీ కేవలం ఒక్క రచయిత గ్రంథమై ఉండాలని, వివిధ కవుల సంకలనాలను పరిశీలించబోమని చెప్పారు.
పురస్కారం రచయితకు మాత్రమే ఇస్తామని ఆమె తెలిపారు. పురస్కారంగా 10వేల రూపాయిల నగదు, శాలువ, మెమోంటో ప్రదానం చేస్తామని ఆమె వివరనించారు. ఎంట్రీలు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ఆంధ్రాచార్యులు, తెలుగు శాఖ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి -517502 అనే చిరునామాకు పంపించాలని ఆమె కోరారు.