రాష్ట్రీయం

గల్ఫ్ బాధితులను ఆదుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: గల్ఫ్ బాధితుల కష్టాలను తీర్చడంలో టీఆర్‌ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం దారుణమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. గల్ఫ్ బాధితుల వెతలపై ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతి పత్రం అందించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నుండి 10 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారని, ఇక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది తెలుగువాళ్ల వలస బాట పడుతున్నారని అక్కడ వారి జీవితాలకు భద్రత లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. సమస్యలను విన్న తర్వాత గవర్నర్ నరసింహన్ కూడా సానుకూలంగా స్పందించారు. ఏజెంట్ల బారిన పడి మోసపోయిన వారు, వివిధ దేశాలకు వలస పోయి తిరిగి వచ్చిన వారు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఎందుకు సాయం అందించడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు.
టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే బొగ్గుబాయి, దుబాయి, మంబాయి వలసలుండవని ప్రచారం చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ బాధితులకు ఎలాంటి అవకాశాలు కల్పించకపోగా, కనీసం మూతపడ్డ పరిశ్రమలను కూడా తెరిపించలేకపోయారని అన్నారు. కేరళ, పంజాబ్ తరహాలో ఎన్‌ఆర్‌ఐ పాలసీ తీసుకువస్తామని 2014లో టిఆర్‌ఎస్ హామీ ఇచ్చిందని, ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. గల్ఫ్ దేశాల్లో అలాగే గల్ఫ్ నుండి తిరిగి వచ్చి మృతి చెందిన వారి కుటుంబాలకు ఆరు లక్షలు చొప్పున పరిహారం చెల్లించి , బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గల్ఫ్ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపచేయాలని, రేషన్ కార్డుల నుండి వారి పేర్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్‌లో గల్ఫ్ బాధితులకు ఒక సెల్ కూడా లేదని, గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఎప్పటికపుడు తగిన చర్యలు తీసుకుంటున్నారని , వేలాది మంది బాధితులకు రక్షణగా నిలిచి సమస్యలు పరిష్కరించారని అన్నారు. అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్, మీడియా కమిటీ కన్వీనర్ వి సుధాకర్ శర్మ, కిసాన్‌మోర్చ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నర్సింహ నాయుడు తదితరులు ఆయన వెంట ఉన్నారు.
చిత్రం..గల్ఫ్ బాధితుల వెతలపై గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అంద జేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్