మెయిన్ ఫీచర్

చెన్నై చినె్నలకు వనె్నలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్రలో కనుమరుగైన ప్రదేశాలు, కట్టడాలు మన ముందు బొమ్మల రూపంలో ఆవిష్కృతమైతే ఎలా ఉంటుంది. ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం. ఆనాటి జీవన విధానం ఇలా ఉండేదా అని కళ్లు ఇంత చేసుకుని చూస్తాం. కనుమరుగవుతున్న చారిత్రక ప్రదేశాల ఆనవాళ్లను తన కుంచెలో బంధిస్తున్నారు హేమలత వెంకటరామన్. జ్ఞాపకాల పొరలలో పదిలంగా ఉన్న చరిత్ర ఆనవాళ్లు చెదిరి పోకుండా.. వారసత్వ సంపద కు వాస్తుశిల్పిగా మారిం ది ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని.

హేమలత వెంకటరామన్ కుంచె నుంచి జాలువారిన చిత్రాలలో కొన్ని..

హేమలత వెంకటరామన్ ప్రస్తుతం ఓహియో యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేస్తున్నారు. అలాగే సెలవు దొరికితే చాలు మద్రాసు నగరంలో వాలిపోతుంది. అక్కడ లైబ్రరీలో కూర్చొని చరిత్రకు సంబంధించిన విషయాలను చదువుతుంది. ఆమెకు చెన్నై అంటే వల్లమాలిన ప్రేమ. ఎందుకంటే దేశంలో మరెక్కడా లేనటువంటి చారిత్రక భవనాలు చెన్నైలో ఉన్నాయి. అందుకే సెలవు దొరికితే ఇక్కడకు వచ్చేస్తుంది. ఆమె నగరంలోని విభిన్న చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలను సందర్శిస్తోంది. ఇప్పటికే ‘మద్రాస్ ఇన్ మిని’ అనే శీర్షికతో తన హృదయాన్ని ఆకట్టుకున్న స్థలాలను స్కెచ్లు గీసేసింది. ఈ స్కెచ్లు బహుళ ప్రజాదరణ పొందాయి. ‘మద్రాస్ క్యాటలాగ్’ అనే సిరీస్‌ను ప్రారంభించి మద్రాసు నగరం, దాని పట్ల ప్రజలు కనబరచే ప్రేమను తెలియజేస్తూ చిత్రాలను సోషల్ మీడియాలో ఉంచింది. మద్రాసు నగర ప్రజలతో మమేకమై వారు చెప్పిన విషయాల ఆధారంగా కూడా ఆనాటి ప్రజల జీవన విధానంపై బొమ్మలు గీస్తుంది. పూల విక్రయదారులు, వాచ్‌మెన్లు, కొంత మంది పెద్దవారే ఆమె బొమ్మలకు వనరులంటే అతిశయోక్తి కాదు. గంటల తరబడి బొమ్మలు గీస్తుంటే ఆ ప్రాంతవాసులు ఆమె ఓపికను ప్రశంసిస్తూ ఆశ్రయం ఇచ్చేవారూ లేకపోలేదు. అందుకే మద్రాసు వాసులు అంటే హేమలతకు అభిమానం. మద్రాసులోని చారిత్రక ప్రదేశాలపై ఆమె డాక్యుమెంటరీని సైతం రూపొందించారు.
గంటల కొద్దీ నిరీక్షణ..
ఓ స్కెచ్ రూపొందాలంటే కొన్ని గంటల సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. పొడవైన స్కెచ్ వేయలంటే కనీసం ఏడున్నర గంటల సమయం పడుతోంది. అక్కడ ప్రజలు చెప్పే విషయాలను ఆకళింపు చేసుకుని అక్కడే వారితో పాటే ఉంటూ ఆమె స్కెచ్ గీస్తుంది. జిమ్నాస్ట్‌గా దేశంలో వివిధ ప్రాంతాలను సందర్శించాను. కాని మద్రాసువాసులు చూపించే అభిమానం మరెక్కడ దక్కదని, అందుకే వారితో ముచ్చటించిన అంశాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో పెడుతుంటానని హేమలత చెబుతున్నారు.
కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన..
ఇపుడు హేమలత ‘టీబ్యాగ్ ఆర్ట్ 100 డేస్’ పేరుతో మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. టీ బ్యాగ్‌లతో ఇంక్, వాటర్ కలర్స్ ఉపయోగించి స్కెచ్‌లు వేస్తుంది. హేమ ఇటీవలే కొలంబస్‌లో తన ఫెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేసింది. ‘స్ట్రీట్ ఆఫ్ స్మైల్స్’ అనే బ్లాగును నడుపుతూ.. కవిత్వాలను ఆ బ్లాగులో పొందుపరుస్తుంది. తన అంతిమ లక్ష్యం పెయింటింగ్ కళతో కమ్యూనిటీలను ఏకీకృతం చేయటం. విభిన్న సంఘాల ప్రజలు వారి చరిత్రను తెలుసుకోవాలను కుంటే తనకు సహకరించాలని హేమ కోరుతుంది.
ఆయా కమ్యూనిటీల సామాజిక, సాంస్కృతిక ప్రాజెక్టులకు వారధిగా పనిచేస్తానని అంటున్నారు. మరింత మంది చరిత్రకారులను కలుసుకుని వారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో పాటు చరిత్రకు సంబంధించిన చిత్రాలను పొందుపరచి ఒక కాఫీ టేబుల్ పుస్తకాన్ని తీసుకురావాలనే ఆశయంతో ఉన్నానని, ఈ పనులన్నీ కూడా మాస్టర్ డిగ్రీ చేతికి వచ్చిన తరువాతే అని చెబుతోంది.

నేను వేసే పెయింటింగ్స్‌కు పెన్, ఇంక్, వాటర్ కలర్స్, స్కెచ్ పెన్నులను ఉపయోగిస్తాను. ప్రస్తుతం నా అభిరుచి హిందూమతం, పురాణశాస్త్రాలకు సంబంధించిన పాత్రల స్కెచ్ల శ్రేణిని రూపొందించాలనుకుంటున్నాను. ఒక వాస్తుశిల్పిగా చారిత్రక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నాను. సంక్షిప్త చరిత్రను వారి కళ్ల ముందు ఉంచుతాను. సాంస్కృతిక పునర్జీవనాన్ని సృష్టించటమే ధ్యేయం.
-హేమలత వెంకటరామన్