క్రీడాభూమి

స్టార్క్ వచ్చేస్తాడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 3: ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో కాలి మడమ గాయం కారణంగా ఆడలేకపోయిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ చివరిదైన ఐదో టెస్టులో ఆడనున్నాడు. అతను నెట్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌల్ చేశాడని, చివరి టెస్టులో ఆడే ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటాడని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. బుధవారం నెట్స్ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, స్టార్క్ ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. జట్టులోని రెండో స్పిన్నర్ అస్టన్ అగర్‌కు అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నిడు. సిడ్నీ పిచ్‌ని పరిశీలించిన తర్వాత, ఒకే స్పిన్నర్‌తో చివరి టెస్టు ఆడాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అయితే, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. వికెట్‌పై పచ్చిక ఎక్కువగా ఉంది కాబట్టి బంతి స్వింగ్ అవుతుందని తెలిపాడు. ఇలాంటి పిచ్‌లపై ఫాస్ట్ బౌలర్లు బాగా రాణిస్తారని, ఈ సిరీస్‌లో ఇంత వరకూ 604 పరుగులు చేసిన స్మిత్ అన్నాడు. ఇలావుంటే, 1936-37 యాషెస్ సిరీస్‌లో 810 పరుగులు చేసి సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ నెలకొల్పిన రికార్డును స్మిత్ అధిగమించడం కష్టమైనప్పటికీ, అసాధ్యం మాత్రం కాదని పరిశీలకులు అంటున్నారు.
మాక్స్‌వెల్, వేడ్‌పై వేటు వనే్డలకు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక
సిడ్నీ, జనవరి 3: ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌కు ఆస్ట్రేలియా జాతీయ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. గ్లేన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్‌పై సెలక్టర్లు వేటు వేశారు. నిలకడగా ఆడకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని చీఫ్ సెలక్టర్ ట్రెవర్ హాన్స్ ప్రకటించాడు. వేడ్ స్థానంలో టిమ్ పైన్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు తీసుకుంటాడని తెలిపాడు. ఫాస్ట్ బౌలర్ల త్రయం మిచెల్ స్టార్క్, జొష్ హాజెల్‌వుడ్, పాక్ కమిన్స్ వనే్డ జట్టులోనూ చోటు దక్కించుకున్నరు. టీ-20 ఫార్మాట్‌లో స్టార్‌గా ఎదుగుతున్న యువ ఆటగాడు క్రిస్ లిన్‌ను కూడా వనే్డ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐదు వనే్డలు వరసగా ఈనెల 14 (మెల్బోర్న్), 19 (బ్రిస్బేన్), 21 (సిడ్నీ), 26 (అడెలైడ్), 28 (పెర్త్) తేదీల్లో జరుగుతాయి.
ఆస్ట్రేలియా వనే్డ జట్టు
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పాట్రిక్ కమిన్స్, ఆరోన్ ఫించ్, జొష్ హాజెల్‌వుడ్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, మిచెల్ మార్ష్, టిమ్ పైన్, జీ రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, ఆండ్రూ టై, ఆడం జంపా.