జాతీయ వార్తలు

ఐరాసాలో మద్దతు సరిపోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా ప్రకటించడానికి నిబంధనలు అవరోధంగా మారాయని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఐరాసలో హిందీ భాష అమలుకు అవసరమయ్యే 4 బిలియన్లు ఖర్చుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బుధవారం ఇక్కడ తెలిపారు. ‘ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం మొత్తం సభ్యుల్లో మూడింట రెండో వంతు సభ్యుల మద్దతు ఉండాలి. అప్పుడే ఏ భాషనైనా అధికారికంగా గుర్తించడానికి వీలుంటుంది. దీనికి సంబంధించి ఐరాస నిబంధనల్లో స్పష్టంగా ఉంది’ అని ఆమె చెప్పారు. ఐరాసలో సభ్యదేశాల సంఖ్య 193 అంటూ లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సుష్మా తెలిపారు. సభ్యదేశాల మద్దతు లభించి హిందీని అధికార భాషగా గుర్తిసే దానికయ్యే ఖర్చును భరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆమె అన్నారు.