ఆంధ్రప్రదేశ్‌

బాబు మారడు.. మారలేడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలికిరి/ వాల్మీకిపురం, జనవరి 3: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మోసగాడు అని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరన్నారు. చంద్రబాబు నాయుడు మోసగాడని ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలన్ని మరచిపోయాడని విమర్శించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు రైతురుణాలు, డ్వాక్రారుణాలు మాఫిచేస్తానని రైతులను, మహిళలను మోసం చేశాడని ఆయన మాటలు నమ్మిన రైతులు, డ్వాక్రామహిళలు అప్పులకు వడ్డిలు కట్టలేక బ్యాంకులలో బంగారు నగలు వేలం వేసుకుంటున్నారని అరోపించారు. ప్రతి పేదవాడికి ఇండ్లు కట్టిస్తాం అని హామి ఇచ్చిన బాబు మాట తప్పారని అన్నారు. ప్రత్యేక హోదావస్తేనే రాష్ట్రం అభివృద్ధిచెందుతుందని ట్యాక్సులు, జిఎస్‌టి వంటివి లేకుంటేనే ఫ్యాక్టరీలు, కంపెనీలు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయని అలాంటిది చంద్రబాబు ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టాడని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఆ పదవికి రాజీనామాచేసి వెళ్లిపోతేనే మంచి రాజకీయ వ్యవస్థ మన రాష్ట్రంలో వుంటుందన్నారు. వైకాపాను అధికారంలోకి తెస్తే నీతివంతమైన రాజకీయం చేస్తామని ఆయన ప్రజలకు హామి ఇచ్చారు. బుధవారం చంద్రబాబునాయుడు పులివెందులకు వెళ్లి ప్రాజెక్టులన్ని తానే కట్టినట్లు వాటిని తానే ప్రారంభిస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నాడని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పులివెందులలోని పగిడిపాల ప్రాజెక్టుకోసం 763 ఖర్చుపెట్టగా చంద్రబాబు కేవలం 23 కోట్లు ఖర్చుపెట్టి దానిని తానే నిర్మించినట్లుగా ప్రజలను మభ్యపెడుతున్నడని అన్నారు. చిత్రావతి ప్రాజెక్టుకోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 312కోట్లు ఖర్చుపెడితే చంద్రబాబు కేవలం నాలుగేళ్ల పాలనలో 20కోట్లు ఖర్చుపెట్టి అంతా తానే నిర్మించినట్లు చెప్పుకుంటున్నాడని అన్నారు. చిత్తూరు జిల్లాలోని పాలడైరిని రైతుల సంక్షేమంకోసం రాజశేఖర్‌రెడ్డి తెరిపిస్తే చంద్రబాబు తన హెరిటేజ్ డైరికోసం రైతులను మోసం చేసి దానిని మూసివేయించారని అరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే చిత్తూరు పాలడైరి తెరిపిస్తానన్నారు. గడచిన నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చెయ్యని చంద్రబాబు ఇప్పుడు ఓట్లుకోసం వస్తే ప్రజలను చూసి సిగ్గుపడాలని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.