బిజినెస్

టిఎస్‌ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్టీసీ) ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్న ఎండిని, అధికారులను సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రశంసించారు. సంస్థను ఇంకా ఆదాయం వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. బుధవారం నాడిక్కడ బస్‌భవన్‌లో చైర్మన్‌కు ఎండి జి.వి.రమణారావు, ఈడిలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ కాసేపువారితో ముచ్చటించారు. గత ఏడాది కొన్ని డిపోలు లాభాల్లోకి వచ్చాయని, మరికొన్ని లాభాలను సాధించే దిశగా ముందుకు వెళుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది కూడా ఇంకా కృషి చేస్తే చాలా డిపోలు లాభాల్లోకి వచ్చి సంస్థ ఆర్ధికంగా నిలదొక్కుకుంటుందని తెలిపారు. ఈ మేరకు అందరి సహకారం అవసరమని చైర్మన్ కోరారు. ఎండి జివి.రమణారావు మాట్లాడుతూ సంస్థ ఆర్ధికంగా పుంజుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు నూతన పద్దతుల ద్వారా ఆర్ధికాభివృద్ధి సాధించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.