బిజినెస్

తెలంగాణ జెన్కో సీఎండీ దేవులపల్లికి సీబీఐపీ అవార్డు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: ప్రతిష్టాత్మకమైన సిబిఐపి అవార్డును తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. ఈ అవార్డును సిబిఐపి అధ్యక్షుడు రవీంద్రకుమార్ ప్రదానం చేశారు.
కేంద్ర మానవనరుల శాఖ సహాయమంత్రి సత్యపాల్ సింగ్, కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్, విద్యుత్ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవులపల్లి మాట్లాడుతూ తెలంగాణ ట్రాన్స్‌కోలో సరఫరానష్టాలు 3.37 శాతం తగ్గాయన్నారు. ఉత్తర, దక్షిణ గ్రిడ్‌ల మధ్య కొత్త లైన్లను నిర్మించడంలో తెలంగాణట్రాన్స్‌కో విశేషమైన చొరవను ప్రదర్శించినట్లు చెప్పారు. 11వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ తలెత్తినా తట్టుకునే శక్తి తెలంగాణకు ఉందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కొత్తగా 514 సబ్‌స్టేషన్లు నిర్మించామన్నారు.