తెలంగాణ

1.55 లక్షల కోట్లతో... రాష్ట్ర బడ్జెట్‌పై మొదలైన కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. వోటాన్ అకౌంట్ బడ్జెట్ కావడం, ఎన్నికల సమయం కావడంతో ప్రజలకు ఆకర్షణీయ వరాలను బడ్జెట్‌లో ప్రకటించే అవకాశముంది. ఆర్థిక మాంద్యం, ఇతర కారణాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బడ్జెట్ రూపొందించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.1.55 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్‌లోనే రైతులకు సాలీనా ఎకరానికి రూ.8వేల సొమ్ము సబ్సిడీ కింద బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు నిధులను కేటాయించనున్నారు. రెవెన్యూ శాఖ ఇప్పటికే భూసర్వే ప్రాజెక్టును చేపట్టి మొదటి దశ పూర్తి చేసింది. భూ రికార్డుల ప్రక్షాళనా ప్రారంభమైంది. ప్రభుత్వం ఆఫర్ చేసే సబ్సిడీని దాదాపు 1.5 లక్షల ఎకరాలు సాగు చేస్తున్న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనికి దాదాపు రూ.6వేల కోట్ల అవసరమని అంచనా. అర్హులైన రైతుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నా, ఈ ఖాతాలను సంబంధించిన శాఖలు ఖరారు చేసి ధృవీకరించాల్సి ఉంది. ఈ నెల 8లోగా బడ్జెట్‌కు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీచేసింది. కొత్త స్కీంల ప్రతిపాదనలు, వాటి ఖర్చు అంచనా వివరాలు కాకుండా, ఇంతవరకు అమలు చేసిన స్కీంలు, వాటికి పెట్టిన ఖర్చు వివరాలను పొందుపరచాలని ఆర్థిక శాఖ కోరింది. ఇంతవరకు విడుదలైన నిధులు, ఏ పథకానికి ఎంత వ్యయమైందో వివరాలు పొందుపరచాలని కోరింది. అలాగే తమ శాఖల ఆస్తులు, అప్పుల వివరాలనూ అన్ని ప్రభుత్వ శాఖలు పొందుపరచాల్సి ఉంటుంది. ఉద్యోగుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
సంక్షేమానికి అగ్ర తాంబూలం
ఈసారీ సంక్షేమానికి అగ్రతాంబూలం ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017-18 బడ్జెట్‌లో మొదటి తొమ్మిది నెలల్లో దాదాపు రూ.22300 కోట్ల నిధులను వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టింది. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన గొర్రెల పెంపకం, కేసీఆర్ కిట్స్, బీసీ, బ్రాహ్మణ సంక్షేమ సంస్ధలకు దాదాపు రూ.11వేల కోట్ల నిధులు కేటాయించి ఖర్చుపెడుతున్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్ స్కీంకు రూ.1000 కోట్లు కేటాయించి 12వేల మందికి ఇస్తున్నారు. కల్యాణ లక్ష్మి స్కీం కింద బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు, షాదీ ముబారక్ కింద ముస్లింలకు వివాహం నిమిత్త ఆర్థికసహాయం ఇస్తున్నారు. మహిళా సంక్షేమం కింద ఈ ఏడాది రూ.1552 కోట్ల నిధులను ఖర్చుపెట్టారు. అంగన్‌వాడీ కింద రూ.459 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కింద రూ.250 కోట్ల నిధులు ఖర్చుపెట్టారు. బీడీ వర్కర్లకు పెన్షన్ కింద రూ.350కోట్లు, మహిళల స్వయం సహాయక గ్రూపులకు వడ్డీ రహిత రుణాల కోసం రూ. 700 కోట్లు, సబ్సిడీపైన ఒక రూపాయికి కేజీ బియ్యానికి రూ.2500 కోట్లు, ఉచిత విద్యుత్ సబ్సిడీ రూ.4485 కోట్లు, ఆసరా పెన్షన్ అమలుకు రూ.5వేల కోట్ల, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.900 కోట్లు ఖర్చు పెట్టారు.