కరీంనగర్

అనుమానితులను ప్రశ్నించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీపీ కమలాసన్‌రెడ్డి
కరీంనగర్ టౌన్, జనవరి 3: నగరంలో అనుమానాస్పదంగా కనిపించే అపరిచిత వ్యక్తులను ఆయా కాలనీల వాసులు ప్రశ్నించాలని పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి సూచించారు. అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమయితే, సత్వరమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. బుధవారం నగరంలోని సుభాష్‌నగర్ కాలనీ ప్రాంతంలోపోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం 5గంటలనుంచి 8గంటల వరకు అనుమానాస్పద ప్రాంతాలు, ఇళ్ళలో సోదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్డన్ సెర్చ్ నిర్వహణతో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి రాకపోవటం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. పోలీసులు ముందస్తుగా తీసుకున్న చర్యలతోనే నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతులు దొర్లలేదని, పోలీసుల చర్యలకు సహకరిస్తున్న అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమకెదురయ్యే ఇబ్బందులతోపోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా, నేరుగా హాక్‌ఐ ద్వారా ఫిర్యాదు చేసేలా ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్లు వెల్లడించారు. రేయింబవళ్ళు నగరాన్ని నిఘానేత్రంలోకమీషనరేట్‌ను కొనసాగించేందుకు సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. అక్రమ, అసాంఘీక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా సుభాష్‌నగర్‌లో12 సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు కాలనీవాసులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చినట్లు, కార్పొరేటర్ గంట శ్రీనివాస్, దవుడ రాములు, మల్లేశ్‌గౌడ్, వెంక, రాజ్‌కుమార్, తదితరులు కెమెరాలు అందించేందుకు అంగీకరించగా, వారిని సిపి అభినందించారు. వారం రోజుల వ్యవధిలోసిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
యువరైతు ఆత్మహత్య
సారంగాపూర్, జనవరి 3: సారంగాపూర్ మండలంలో రైతుల ఆత్మహత్య పరంపర కొనసాగుతునే ఉంది. ఇప్పటి వరకు 3 రైతులు ఆత్మహత్య చేసుకోగా, బుధవారం మరో యువ రైతు ఆత్మహత్యకు పాల్పడడం రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన అత్తిని మహిపాల్ (30) అనే యువ రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న ఊరిలో ఉపాది కరువై జీవనోపాధి కోసం మూడు సార్లు ఎడారి దేశం గల్ప్ వెల్లగా, సరైన ఉపాధి లభించకపోవడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తనకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని పొలాన్ని సాగు చేశాడు. ఇటీవల దోమపోటుకు తీవ్ర పంట నష్టం జరగగా, అప్పులు ఇచ్చిన వారు వేధించడంతో మంగళవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు సేవించి పడుకున్నాడు. అంతకు ముందు రోజు మహిపాల్ బార్య రజిత తల్లిగారింటికి వెల్లగా, తన గదిలో పురుగుల మందు సేవించి పడుకోవడంతో ఎవరు గుర్తించలేక పోయారు. ఉదయం తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా, మంచంలో శవమై నీర్జీవంగా కన్పించడంతో కుటుంబ సభ్యుల అర్తనాదాలు మిన్నంటాయి. మహిపాల్‌కు 9ఎళ్ల కుమారుడు రాజు ఉన్నాడు. తండ్రి భూమయ్య సారంగాపూర్ పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
తీగల గుట్టపల్లి అభివృద్ధి కోసం తీర్మాణాలు

* రోడ్డు ఆక్రమించిన వారిపై చర్య తీసుకోవాలని వినతి
కరీంనగర్ రూరల్, జనవరి 3: కరీంనగర్ రూరల్ మండలంలోని తీగలగుట్ట పల్లి గ్రామ పరిధిలోని పలు కాలనీల్లో అభివృద్ధిపై బుధవారం వార్డు సభ్యులతో కలిసి తీర్మాణం చేసారు. ఈ సందర్భంగా గ్రామ సభలో ఉన్న పలు సమస్యలపై వార్డు సభ్యులు సర్పంచ్‌కు తెలిపారు. పంచాయితీ పరిధిలోని అన్ని కాలనిల్లో ఎల్ ఇ డి లైట్లు, తాగు నీరు, చేతి పంపుల మరమ్మత్తులు, గతంలో వేసిన సీసీ రోడ్లకు మరమత్తులు చెసేందుకు తీర్మాణించారు. ఈ వియంపై ఎమ్మెల్యేకు, ఈవోపిఆర్‌డికి ఫిర్యాదు చెస్తామని తెలిపారు.
రైతుల సంక్షేమానికి పెద్దపీట
* హార్టికల్చర్ రాష్ట్ర కమిషనర్ వెంకట్రాంరెడ్డి
సుల్తానాబాద్, జనవరి 3: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందుకువెళ్తూ భారతదేశ చరిత్రలోనే రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తూ పెద్దపీఠ వేశారని హార్టికల్చర్ రాష్ట్ర కమీషనర్ ఎల్.వెంకట్రాంరెడ్డి అన్నారు. ఉద్యానవన వారి ఆర్థిక సహాయంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పాలిహౌజ్-కూరగాయల పంటను బుధవారం ఆయన పరిశీలించారు. ఆ పంట రైతు తెలుకుట్ల సుగుణాకర్‌ను బీరకాయతో పాటు ఇతర కూరగాయల పంటల దిగుబడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి గాను రెండు పంటలకు 8 వేలను ప్రభుత్వం అందించనుందన్నారు. రైతులు పాలిహౌజ్‌లపై ఎక్కువ శాతం దృష్టి సారించినట్లయితే అధిక దిగుబడులు సాధించడంతో పాటు ఎక్కువగా లాభాలు వస్తాయన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు గాను ఎక్కడా లేనివిధంగా గోదాములను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, అధికారులు దేవేందర్, జ్యోతి, శ్యాం, శ్రీకాంత్, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు.
వాగ్ధానాలను విస్మరించిన సర్కార్
* పీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేశ్‌రావు
సిరిసిల్ల, జనవరి 3: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ హామీతోనే అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించి, కమీషన్ల కోసం మానిఫెస్టోలో లేని మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు చేపట్టారని పీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేశ్‌రావు ఆరోపించారు. బుధవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అభివృద్ది పనులు చేపట్టడం లేదని, ఇచ్చిన హామీల్లో దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు గాలికి వదిలేశారని, అధికారంలోకి రావడానికి కారణమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ హామీని రాష్ట్రంలో అమలు చేయాలని, దీనిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి, తెరాస ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతామని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా నేపథ్యంలో లారీల దగ్డం సంఘటనల్లో నేరెళ్ళ బాధితులకు న్యాయం జరుగలేదని, దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ది బాగా జరుగుతున్నదని ప్రచారం చేసుకుంటున్నారని, కానీ మంత్రి కేటీఆర్ నియోకవర్గంలో అభివృద్ది ఎక్కడా కానరాదని, కనీసం ఆయన దత్తత గ్రామాలలో కూడా ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. మైనింగ్ మంత్రిగా ఉన్న కేటీఆర్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదని, దీనిని నియంత్రించడంలో ఆయన విఫలమయ్యారని, అందుకే ఆయన మైనింగ్ మం త్రిగా పనికి రాడడని, కేవలం ఐటి మంత్రిగానే కొనసాగితే బాగుంటుందని హితవు పలికారు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీలు తెరాస కార్యకర్తల లాగే పని చేస్తున్నారని, అధికారులుగా పనికి రారన్నారు. మూడున్నర ఏళ్ళ నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే వీరికి కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేదని, ఇపుడు ఆదాయం పేరుతో ప్రజలకు ఇసుక లభ్యం కాకుండా చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణగౌడ్, నాయకులు వైద్య శివప్రసాద్, కూతురు వెంకటరెడ్డి, ఎడ్మల భూపాల్‌రెడ్డి, ఆడెపు చంద్రకళ, కంది భాస్కర్‌రెడ్డి, కరీంఖాన్, బేతి నవీన్ పాల్గొన్నారు.
చివరి ఆయకట్టు వరకు నీరందించాలని వినతి
* రైతుల కోరిక మేరకు డి-86 కెనాల్ పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్ రూరల్, జనవరి 3: రూరల్ మండలంలోని ముగ్ధుంపూర్, ఇరుకుల్ల గ్రామాల్లోని చివరి ఆయక ట్టు వరకు సాగు నీరందించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను రైతులు కోరగా వారి కోరిక మేరకు ముగ్ధుంపూర్ వద్ద డి-86 కెనాల్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామా ల పంటలకు సాగు నీరు వచ్చేలా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కాకాతీయ మెయిన్ కాలువ ద్వారా డి-86కు వచ్చేలా రెవెన్యూ అధికారులతో కలిసి వెంటనే నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని మండల్లాలోని గ్రామాలకు నీరు వచ్చేలాగ ఇరిగేషన్, రెవెన్యూ, సంబంధిత అధికారుతో మాట్లాడి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిచేలా కృషి చేస్తానని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో ఇరుకుల్ల, ముగ్ధుంపూర్, బొమ్మకల్ గ్రామస్థులు పాల్గొన్నారు.
జమ్మికుంట టూ హైద్రాబాద్ బస్సు ప్రారంభం
జమ్మికుంట, జనవరి 3: జమ్మికుంట పట్టణం నుండి హైద్రాబాద్‌కు వ్యాపారులు,పట్టణ వాసులకు సౌకర్యం కోసం బుధవారం రెండు ఆర్టీసీ బస్సులను రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్,కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రోజుకు ఉదయం రెండు, సాయంత్రం రెండు ట్రిప్పులు కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘం అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు,మార్కెట్ చైర్మెన్ పింగిళి రమేష్, నగర పంచాయతీ చైర్మెన్ పోడేటి రామస్వామి, ఎక్కటి సంజీవరెడ్డి , కసుబోజులు వెంకన్న, ఆర్టీసీ డీఎం ధరమ్‌సింగ్‌తో పాటు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శోభ చిత్రపటానికి పాలాభిషేకం
* నియోజకవర్గంలో పలు రోడ్లకు పది కోట్ల నిధుల విడుదల
చొప్పదండి, జనవరి 3: నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలలోని పలు గ్రామాలను కలుపుతూ లింక్ రోడ్లకు గాను పది కోట్ల 96 లక్షల నిధులు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ కృషి ద్వారా విడుదల కావడంతో బుధవారం చొప్పదండి మండల పరిధిలోని రుక్మాపూర్ గురుకుల విద్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే బొడిగ శోభ చిత్రపటానికి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మునిగాళ్ల విజయలక్ష్మి-చందు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. మంద నర్సయ్య, సర్పంచ్ నెరుమట్ల మల్లేశం, మునిగాళ్ల నరేష్, దొంతిసారపు సంపత్, దూస రమేష్, చొక్కాల స్వామితో పాటు గురుకుల విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
* బీజేపీ రాష్ట్ర నేత హన్మంతాగౌడ్
ముస్తాబాద్, జనవరి 3: ఉద్యోగాల భర్తీని విస్మరించి, నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేర్గు హన్మంతాగౌడ్, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు ఎంపల్లి వంశీగౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేయాలంటూ ముస్తాబాద్ ప్రధాన చౌరస్తాలో బుధవారం బిజెవైఎం మండలాధ్యక్షుడు బాధ నరేష్, వైస్‌ఎంపిపి చిట్నేని శ్రీనివాస్‌రావు, బిజెవైఎం రాష్టన్రేత మల్లారపు సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్షలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ వివిధ శాఖల్లో లక్షల ఖాళీలు ఉన్నా, ఉద్యోగాల భర్తీపై చిత్తశుద్ధితో వ్యవహారించక నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారానికి వచ్చిన కేసీఆర్, మండలానికో ఉద్యోగం ఇచ్చిన దాఖలా లేదని అన్నారు. నిరుద్యోగుల్ని మాయమాటలతో మోసం చేస్తున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు తాండ్ర రాంగోపాల్, నేతలు ఎదునూరి రాజశేఖర్, అబ్రవేని సాయిలు, కరెడ్ల రమేశ్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు.
చదువుతోనే ఉన్నత స్థానాలు
* కస్తూర్బా బాలికలతో కలెక్టర్ శరత్
సారంగాపూర్, జనవరి 3: చదువుతోనే ఉన్నత స్థానాలు అధిరోహిస్తామని జగిత్యాల కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులకు ఆరోగ్య శుభ్రత కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 14 కేజిబివిలలో సుమారు 2200 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులకు గతంలో రూ. వంద చొప్పున కాస్మోటిక్ చార్జీల కింద చెల్లించడం జరిగేదని ప్రస్తుతం రూ. వంద స్ధానంలో ఆరోగ్య శుభ్రత కిట్‌లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శుభ్రత కిట్లలో స్నానపు, బట్టల సబ్బులు, షాంపు, కొబ్బరి నూనె, పౌడర్, టూత్ పెస్టు, బ్రష్, టంగ్ క్లీనర్, దువ్వెన, బొట్టు బిల్లలు, రిబ్బన్‌లు, హెర్ బ్యాండ్లు, దోమ నివారణ మందు, హ్యాండ్ వాష్ ఉంటాయన్నారు. బాలికలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. రాజేశం, ఎంపిపి శారద, జడ్‌పిటిసి సరళ, ప్రిన్సిపాల్ శిరీష, ప్రజాప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తా
* ఎమ్మెల్యే మధు
కమాన్‌పూర్, జనవరి 3: ప్రజా సేవే ధ్యేయంగా ముందుకు వెళ్తానని మంథ ని ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. బుధవారం కమాన్‌పూర్ మండలంలోని క న్నాల, జీడీ నగర్, కమాన్‌పూర్, జూలపల్లి, ముల్కల్లపల్లి గ్రామాల్లో మన ఊరు... ఎమ్మెల్యే-2 కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమకు పెన్షన్లు రావడం లేదని, సరైన రోడ్లు లేవని, రెండవ పంటకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికే మీ వద్దకు రావడం జరిగిందని, ముఖ్యమంత్రి కెసి ఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకు సాగుతుందన్నారు. అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలను అందించడమే కెసి ఆర్ ధ్యేయమని అన్నారు. ప్రతీ గ్రామంలో వౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తానని చెప్పారు. మారుమూల ప్రాంతమైన మంథని నియోజక వర్గంలో గత సర్కార్లు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడున్నర సంవత్సరాల పాలనలో రోడ్లు, బ్రిడ్జీలు వేయడం జరిగిందని, ముఖ్యం గా ప్రజలకు తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ ద్వారా ప్రతీ గ్రామానికి తాగునీరు అందించడమే ధ్యేయమని అన్నారు. నియోజక వర్గంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఆకలి తీర్చేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా అందించడం జరిగిందని, అలాగే బీదలకు అందుబాటులో అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ఇనగంటి ప్రేమలత, జడ్పిటిసి మేకల సంపత్ యాదవ్, సర్పంచ్‌లు కొంతం సత్యం, ఆకుల గట్టయ్య, ఎంపిటిసి దేవీ స్రవంతి లక్ష్మినర్సయ్య, ఆశా కుమారీ, కిషన్ రెడ్డి, పూదరి సత్యనారాయణ, ఇనగంటి రామారావు, పీట్ల గోపాల్, ఇనగంటి భాస్కర్ రావు, ఆడేపు రమేష్, ఆడేపు శ్రీనివాస్, తొగరి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.