భక్తి కథలు

యాజ్ఞసేని-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పాంచాల రాజకుమారి!’’ అని మళ్లీ పిలిచింది. అయినా సమాధానం లేదు.
‘‘రాజకుమారి ద్రౌపదీదేవి! ద్రౌపదీదేవి!’’ అని రెట్టించింది.
ఉలిక్కిపడిన యాజ్ఞసేని పైకి చూచింది ఏమిటన్నట్లు.
ఏమి ఆలోచిస్తున్నావు? అంది చిలుక.
నీకెందుకు? అన్నది ద్రౌపది.
అర్జునా! అర్జునా! పార్దా! పార్దా! అని పిలిచింది చిలుక.
‘‘ఏం? పరిహాసంగా ఉన్నదా!’’ చిరునవ్వుతో అన్నది ద్రౌపది.
‘‘లేదు రాకుమారి! అర్జునుడు కనపడ్డాడా? ఎక్కడ ఉన్నాడు. రోజూ ఎక్కడున్నాడో ఎక్కడున్నాడో అని ఆరాటపడుతుంటావుగా! ఏమయినా తెలిసిందా? తెలిస్తే చెప్పుము. రాయబారం నడపగలను’’ అంది చిలుక.
అబ్బా అంత గొప్పదానివా? అన్నది ద్రౌపది.
మా పక్షులు రాయబారాలు నడుపుతాయి. తెలియదా! శుచిముఖి పేరు వినలేదా? అదే హంస రాయబారం. నలదమయంతులను కలిపింది మా పక్షులే కదా!’’ అని అన్నది చిలుక.
ఓహో! అలాగా! ఆ కధ ఏమిటో చెప్పవచ్చు గదా?
అబ్బో అది చాలా పెద్ద కథలే! అది యిప్పుడెందుకు! నీ సంగతేదో చెపితే వెంటనే రాయబారం నడుపుతాం! నాకు చాలా పనులున్నాయి! నేను కొంతమంది మా పక్షి సమూహాన్ని ఏర్పాటుచేసికోవాలి! నాలా ఆకాశంలో వేగంగా ఎగురగలిగే వాటిని’’ అని అన్నది చిలుక.
పెద్దగా నవ్వింది యాజ్ఞసేని ‘‘పెద్ద ఆరిందవే! మా తండ్రి వేగులను పంపాడు. అతడి ఉనికి తెలిస్తే నీకు తప్పక చెబుతాను. రాయబారం నడుపుదువుగాని’’’ అని నిట్టూర్పు విడిచింది ద్రౌపది.
సరే అలాగయితే తొందరగా చెప్పు అని పంజరంలోని గింజలను నోట కరచి తినడం మొదలుబెట్టింది చిలుక.
నిగనిగలాడే వనె్నగాడు, పాండవులలో నడిపివాడు, ధనుర్ధారలలో మేటి వీరుడు అయిన అర్జునుని గురించి ఆలోచిస్తున్న ద్రౌపది.
తన తండ్రి, అర్జునుడికి భార్య కాగల ఒక కూతురు కొరకై పుత్ర కామేష్టియాగాన్ని నిర్వహిచి తనను పొందాడు. ఇపుడు ఆ అర్జునుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అతడి గురించి వినడమే కానీ ఎట్లా ఉంటాడో ఏమో ఎరుగను అని పరిపరివిధాల ఊహాంబరవీధిలో విహరిస్తున్న ద్రౌపది ‘రాజకుమారీ’ అన్న శబ్దాన్ని విని కళ్ళు తెరిచి చూచింది.
ఎదురుగా ఉన్న యశస్విని అనే తన చెలికత్తెను చూచింది. ఏంటి అని కనులతో అడిగింది.
‘‘అమ్మా! మహారాజుగారు తమను వెంటనిడుకొని రమ్మన్నారు’’ అన్నది యశస్విని.
ఎందుకు? అన్నది నింపాదిగా ద్రౌపది.
రాజుగారు, మీ తల్లిగారు, మీ సోదరులైన దృష్టద్యుమ్నులవారు ఏదో విషయమై చర్చించుకంటున్నారు. తమని తోడ్కొని రమ్మని ఆజ్ఞాపించారు అని అన్నది.
సరే! పదా. నెమ్మదిగా లేచింది ద్రౌపది.
యశస్విని ముందు నడువగా వెనుక మెల్లగా నడుచుకుంటూ వచ్చింది పాంచాల రాజకుమారి. చెలికత్తెతో నడచి రాజాంతఃపురంలోనికి కాలుపెట్టింది. ఎదురుగా ఆసీనులైయున్న తండ్రిని, తల్లిని, సోదరుని చూచింది. తాను కూడా ఒక ఆసనంపై తల్లి చెంతన మెల్లగా కూర్చుంది. కొంతసేపు అంతా నిశ్శబ్దం ఆవహించింది.
అమ్మా ద్రౌపదీ! నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నది కోకిలాదేవి.
తలెత్తి చూచింది ద్రౌపదీ.
మహారాజు వారు నీ వివాహం కొరకై స్వయంవరాన్ని ప్రకటించాలని అనుకుంటున్నారు అని అన్నది.
ఆ మాటలు విన్న యాజ్ఞసేని మిన్నకుండింది.
కొంతసేపు మళ్లీ వారిమధ్య నిశ్శబ్దం ఆవహించింది.
అంతవరకు చింతాక్రాంతుడై కనపడుతున్న ద్రుపదుడు మెల్లగా అన్నాడు.
పాండవుల ఉనికిని కనిపెట్టటానికై నా శాయశక్తులా వినియోగించాను. వారి జాడ ఎక్కడా కనిపించలేదు. వారు జీవితులై ఉన్నారా లేదా అన్న విషయం నిర్థారించడం కష్టంగాయున్నది. అంతటి మహావీరులు మృత్యువాత పడ్డారన్నది నమ్మశక్యంగా లేదు. ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీయూ లేదు! అని.
పాంచాలి ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. అర్జునుడు తప్పక వస్తాడన్న ఆశ నశిస్తున్నది. పాంచాలి వౌన వేదనను గమనిస్తున్నాడు దృష్టద్యుముడు. చెల్లెలని చూచి ఆమెతో పాండవులు తప్పక వస్తారు. విధాత నిర్ణయించిన ప్రకారం నేను ద్రోణుని చావుకు కారకుణ్ణి కావాలి. ద్రౌపది అర్జునుని వివాహమాడాలి. అట్లా ఏ విధంగా కాకుండా పోతుంది. అందువలన మనం అధైర్యపడకుండా ముందుకు సాగాలి.
- ఇంకా ఉంది

- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము