సాహితి

రంగుల సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండిపోయన ఆకుల్లాంటి
అలవాటైన మూసపోసిన రోజుల్లో
చిగురించిన పత్ర స్వప్నం పండగ దినం
శిబిరంలో పలకరించే సూర్యకిరణం

అందరూ కలిసి చేసే పిండివంటల సందర్భంలో
బొమ్మల కొలువుల పేరంటాలలో
సామూహిక ఆనంద సంరంభం సంక్రాంతి
ఆకాశానికి చాచే జ్వాలల చేతుల
భోగిమంటల చుట్టూ
ఒకరి పక్క ఒకరు వలయాకారంలో కూర్చున్నప్పుడు
పరస్పర స్పర్శలోని వెచ్చదనం మానవత్వం
ఒక నిశ్శబ్ద సమైక్యతా రాగం

ఒకప్పుడు సంక్రాంతి అంటే
ముంగిట్లో ముత్యాల ముగ్గులు
ముగ్గుల్లో గొబ్బిళ్ళు
గొబ్బిళ్ళలో గుమ్మడిపూల కిరీటాలు
హరిదాసులు గంగిరెద్దులు కోళ్లపందేలు

ఇప్పుడు
దుక్కిటెడ్ల స్థానంలో ట్రాక్టర్లు
ఇంటి నెత్తిపైన డిష్ ఏంటినా
ప్లాట్లుగా మారిన పంటపొలాలు
పల్లెల్లోనూ సాధారణ దృశ్యాలు
డాలరు గేలానికి చిక్కి
పడమటి చెరువుకు వలసవెళ్లిన చేపలు
ఎదిగిన పిల్లలు లేక ముగ్గులు లేని ఇళ్ళలో
పలకరించే దిక్కులేని పండుటాకులు
ఇక నగరాల్లో
అపార్టుమెంటు అరణ్యంలో
ముగ్గు పెట్టడానికి ముంగిళ్ళెక్కడ
ఆరు గజాల ఖాళీలో
ఆరున్నొక్క కొట్లు కట్టే నగరంలో
ఇంటి తలుపు తెరిస్తే
వీధి వాకిలే ముంగిలి
ముగ్గే గగనమైనచోట గొబ్బిళ్ళకు తావెక్కడ
ఇక- సంక్రాంతినాడు ఉదయం
ఎక్కడో ఓ మైదానంలో
భోగిమంటలు రగిలించి
గంగిరెడ్లను అలంకరించి
హరిదాసులను పిలిపించి
ఆదే సంక్రాంతి వైభవమంటారు
నానాటికీ పండగల ప్రాభవం చిలక ఎగిరిపోయ
కొత్త కొత్త పండుగల పావురాలు వచ్చి వాలుతున్నాయ

తెలుగువారి పండుగలన్నీ
రేపటి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయేమో
అందరం కలసి కలగందాం
రంగుల సంక్రాంతిని.

- మందరపు హైమవతి, 9441062732