తెలంగాణ

నల్లగొండ, సూర్యాపేటలకు దక్కని సాగు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, జనవరి 20: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల వరకు నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద ఆయకట్టుకు పంటలకు నీరివ్వలేదని, నేడిస్తే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఆయకట్టుకు దక్కకుండా సీఏం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్‌భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎడమ కాల్వ ఆయకట్టులో ఈ ఏడాది నీరు విడుదల చేసిన నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని మేజర్ కాల్వల చివరి భూములకు నీరందడం లేదన్నారు. అదేవిధంగా ఏఏమ్మార్పీ కింద 700 గ్రామాలకు తాగు నీరు, 50వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా నీరందించలేని పరిస్థితి నెలకొందన్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డికి వ్యవసాయం, జిల్లాపై అవగాహన ఉందా, ఉంటే నోరు మెదపరేందుకని ప్రశ్నించారు. ఎడమ కాల్వ నీరు ఖమ్మం జిల్లాకు రాష్ట్ర ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. అదే విధంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను, ఏపీ వాడుకుంటున్నా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారని, నల్లగొండను అనాథగా చేశారన్నారు. అసలు తెలంగాణ వచ్చింది మన నీరు మనకు అన్న నినాదంతో కాగా, నేడు సీఏం కేసీఆర్ నోరు మెదపడం లేదని ఆరోపించారు. కేసీఆర్ చేతుల్లో అధికారం ఉన్నా ఏమీ చేయని పరిస్థితి ఉందని ఆరోపించారు.
కేవలం కాళేశ్వరం, మిషన్ భగీరథ తప్ప నల్లగొండ జిల్లాను కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల ఇండియాటుడే ఇంటర్యూలో తెలంగాణా ధనవంత రాష్టమ్రని కేసీఆర్ ప్రకటించి అధికారంలోకి రాగానే 91వేల రూపాయలు, ఇటీవల 60వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, ఎవరికీ తెలియకుండా మనలను కేసీఆర్ అమ్మేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. నల్లగొండ, మిర్యాలగూడ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్లో భాగంగా ఏస్‌టీపీ నిర్మాణానికి చెరో 26 కోట్ల రూపాయలు గవర్నర్ ద్వారా మంజూరు చేయించామని వాటి ఊసెత్తకుండా నేడు ఏదో ఎస్‌టీపీల నిర్మాణానికి నిధులు కేటాయించామనడం విడ్డూరమన్నారు. పంచాయతీల ఏర్పాటు, మునిసిపాలిటీల్లో గ్రామాల విలీనం క్షుణ్నంగా పరిశీలించి చేయాలన్నారు. పంచాయతీలకు వెంటనే ప్రత్యక్ష ఎన్నికలు జరపాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు అన్నారు. సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి డి.స్కైలాబ్‌నాయక్, పి.రాంలింగయ్య, పట్టణ, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ.కరీం, పొదిల శ్రీనివాస్, కె.బసవయ్యగౌడ్, ఎల్లమ్మ, సలీం, ఈశ్వరాచారి, లింగయ్య పాల్గొన్నారు.