ఆంధ్రప్రదేశ్‌

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 20: లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రానున్నాయా? ఆ మేరకు ఎన్డీఏ భాగస్వామి తెలుగుదేశం పార్టీకి సంకేతాలు వచ్చాయా? ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే అలాంటి అనుమానాలే తెరపైకి వస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు హటాత్తుగా లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించడంతో సమావేశంలో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందుగానే వచ్చే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి.. ఏప్రిల్, మే లేదా నాలుగు నెలల ముందుగా ఎన్నికలు వచ్చే సూచనలున్నాయి.. మనం ఏవిధంగా సిద్ధమవుదామో చెప్పండి అని సహచర నేతలను చంద్రబాబు కోరినట్లు తెలిసింది. దానికి స్పందించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మనం కూడా సన్నద్ధమవుదాం.. ఆ మేరకు క్యాడర్‌కు ఇప్పటి నుంచే కార్యక్రమాలు ఇద్దామని సూచించినట్లు తెలిసింది.
కాగా, రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య నెలకొన్న పోటీలో ఎవరివైపు నిలవాలని దళితులు అయోమయంలో ఉన్నారన్న చర్చ వచ్చింది. దానితో ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వరకు జరిగే అంబేద్కర్ జయంతి వరకూ రాష్ట్రంలో ఉన్న అన్ని మాల, మాదిగ పల్లెల్లో దళిత తేజం-తెలుగుదేశం, చంద్రన్న ముందడుగు ట్యాగ్‌లైన్‌తో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దళితులకు పార్టీ ఏం చేసింది? ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించింది? రాజకీయంగా వారిని ఏవిధంగా ప్రోత్సహించింది? అంబేద్కర్‌ను ఏవిధంగా గౌరవించిందన్న అంశాలను దళిత వాడల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది.
మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో 15 టీములు నియమించి, మూడుస్థాయిల్లో బహిరంగ సభ నిర్వహించాలని, జిల్లా స్థాయిలో కనీసం 10 వేల మందికి తగ్గకుండా దళితులతో సభలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఈ కార్యక్రమానికి ఒక్క దళితులే కాకుండా, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు కూడా పర్యటించి వారిని ఓన్ చేసుకోవాలని, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అనుబంధసంస్థల ఇన్చార్జి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సూచించగా, ఆదివారం జరిగే పార్టీ వర్క్‌షాప్‌లో పార్టీ నేతలకు ఈ విషయం స్పష్టం చేస్తానని బాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.
కాగా, దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల నుంచి అంబేద్కర్ జ్యోతులు అమరావతికి చేరుకోనున్నాయి. అంతకుముందు అవి నియోజకవర్గాల్లో తిరుగుతాయి. అక్కడి నుంచి ఏప్రిల్ 14న అంబేద్కర్ స్మతివనం శంకుస్థాపన జరిగే ప్రాంతానికి అవి చేరుకుంటాయి. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 20న ఇబ్రహీంపట్నం లోని త్రివేణీ సంగమం వద్ద లక్షమందితో దళిత మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదిలాఉండగా, కాపులను బీసీల్లో చేర్చారని బీసీలు అసహనంతో ఉన్నందున బీసీల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని యనమల రామకృష్ణుడు సూచించగా, బాబు అందుకు అంగీకరించారు. ‘బీసీలు పార్టీకి పునాది. వాళ్లు లేకపోతే పార్టీ లేదు, మనం లేము. బీసీల కోసం ఏం చేయడానికైనా సిద్ధమే’నని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా, ఇక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి మొదలయినట్లేనని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆదివారం జరిగే పార్టీ వర్క్‌షాపు నుంచే పార్టీ శ్రేణులను ఆ మేరకు సన్నద్ధం చేసే రాజకీయ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఓ మంత్రి వెల్లడించారు.