సాహితి

శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంగ్ల వత్సరమైనా.. తెలుగు వత్సరమైనా
అందరికీ కావాలి శుభారంభం
అమ్మనాన్నల పిలుపు దూరమైనా
మమీ డాడీల గెలుపు చేరువైనా
మారిన కాలానికి మనమే నిలువెత్తు సాక్షులం
పోటీ ప్రపంచంలో గె(ని)లవాలన్నా
తప్పదు అలుపెరుగని పోరాటం
డాలర్లవేటలో అందరూ ప్రయాణికులమే
బంధాలు - అనుబంధాలు
అందరికీ కడు దూరమే
పిల్లలంతా విదేశాలకు తరలుతున్నారు
వృద్ధులంతా ఆశ్రమాలకు తరలుతున్నారు
బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న ఓ మహాత్ముని మాట
అది అక్షరాల నడుస్తున్న
కలియుగమెరిగిన బాట
ఆస్తి అంతస్తు హోదాలు మనిషికివే భూషణాలు
అవినీతి మనిషికి అందరితో దూషణాలు
ఎవరూ అవునన్నా.. ఎవరు కాదన్నా..
ఇదే కలియుగపు మనుషుల నీతి
మనిషిగా మాయమవుతున్న మన అధోగతి
కాలమెంత మారినా.. మనిషి నైజం మారదు
అందుకే అందరికీ కావాలి శుభారంభం
మానవత్వం పరిమళించాలి నిరంతరం..
*
- కురువ శ్రీనివాసులు