పశ్చిమగోదావరి

పరిష్కారం ఎప్పటికో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 21: అన్ని ప్రభుత్వ విభాగాల వద్ద జనం మహజర్లు దొంతర్లు దొంతర్లుగా పెరిగిపోతున్నాయ. అంతకుముందు ఇంటింటికి టిడిపి వినతులను ఆన్‌లైన్ చేసి అయా విభాగాలకు పంపేశారు. దీంతోపాటు అంతకముందర వరకు పెండింగ్‌లో ఉన్న వినతులకు వీటిని జతచేశారు. వాటి సంఖ్యే లక్షల్లో చేరిపోతే వాటిని పరిష్కరించడానికి అధికారులంతా ఆపసోపాలు పడుతూనే ఉన్నారు. అవి పూర్తిగా పరిష్కారం కాకుండానే మరిన్ని వేల వినతులు వచ్చి పడ్డాయనే చెప్పాలి. తాజాగా ముగిసిన 5వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంతో మరింత అధికసంఖ్యలో ఈవినతులు వచ్చి చేరాయి. ఒక్క జిల్లా వ్యవహారానే్న చూసుకుంటే ఇటీవల ముగిసిన జన్మభూమి కార్యక్రమంలో ఏకంగా 68,516 వినతులు జనం నుంచి అధికారయంత్రాంగానికి అందాయనే చెప్పాలి. వీటిలో అత్యధికంగా రెవిన్యూ విభాగానికి సంబంధించే మహాజరులు ఉండటం విశేషం. అవిధంగా ఇప్పటికే దొంతర్లకొద్ది విజ్ఞప్తులు, వినతులు మూలుగుతుంటే వాటికి అదనంగా ఒక్క జిల్లాలోనే 68వేలకు పైగా వినతులు వచ్చి చేరాయంటే మిగిలిన జిల్లాలు అన్ని కలుపుకుంటే ఈసంఖ్య ఏ స్ధాయికి చేరుతుందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు జన్మభూమిలో వచ్చిన వినతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన వీటిని పరిష్కరించాలని ఆదేశాలు కూడా అప్పట్లోనే జారీ చేసింది. దానికనుగుణంగా అధికారులు కూడా ఒకరకంగా పరుగులు తీస్తున్నారనే చెప్పాలి. అయితే ఏ స్ధాయిలో ఏవిధంగా పరుగులు తీసినా దాదాపుగా వచ్చిన వినతుల్లో సింహాభాగం ఆర్ధిక అంశాలు కావటంతో కొంత మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితే కన్పిస్తోంది. మిగిలినవాటిని ఎప్పటికప్పుడు అధికారయంత్రాంగం పరిష్కారం జాబితాలోకి చేరుస్తున్నా సింహాభాగం ఆర్ధిక అంశాలు కావటంతో వాటి పరిస్దితి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తర్వాతే శుభంకార్డు పరిస్ధితి కన్పిస్తోంది.
అయితే కొంత ఎన్నికల వేడి కన్పిస్తున్న నేపధ్యంలో మిగిలిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగానే ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తుండటం విశేషంగానే చెప్పుకోవచ్చు. ఏరకంగా చూసినా వచ్చిన మరిన్ని మహాజరుల్లో అధికభాగంగా రెవిన్యూకు సంబంధించి అందులోనూ ఇళ్లస్ధలాలు కావాలనే అన్న అంశంపైనే కావటం గమనార్హం. అయితే ఈవిధంగా ఇళ్లస్ధలాలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఎంతవరకు ఉన్నదన్నది కొంత ప్రశ్నార్ధకమనే చెప్పాలి. ప్రభుత్వం ఈ అంశం తెరపైకి వచ్చిన దగ్గరనుంచి జిఫ్లస్ త్రీ, జిఫ్లస్ ఫోర్ తరహాలో బహుళ అంతస్ధుల భవనాలను నిర్మించి వాటిని అపార్టుమెంట్లుగా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఇవ్వాలన్న పాలసీని అమలుచేస్తుండటం తెల్సిందే. దీనికి తగ్గట్టుగా పలుచోట్ల కొన్ని పనులు కూడా ప్రారంభమయ్యాయి. అలాంటి సమయంలో ఇళ్ల స్ధలం అందించే పరిస్దితి దాదాపుగా లేదనే చెప్పవచ్చు. దీంతోపాటు కొత్త రేషన్‌కార్డులు వంటి అంశాలపైనే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు కన్పిస్తోంది. ఇక గృహాలు అవసరమని గృహనిర్మాణశాఖకు దాదాపు 12,311 దరఖాస్తులు అందాయి. అలాగే పంచాయితీరాజ్‌కు సంబంధించి 11,830, మున్సిపాల్టీలకు 5,197, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి 913, వ్యవసాయశాఖకు 184, ట్రాన్స్‌కోకు 131, ఆర్‌అండ్‌బికి 58, ఎస్సీ కార్పోరేషన్‌కు 53 చొప్పున దరఖాస్తులు అందాయి. మొత్తంమీద తాజాగా ముగిసిన జన్మభూమిలో అధికారుల వద్దకు చేరుకున్న విజ్ఞప్తుల సంఖ్య మరింత భారీగా పెరిగిపోయింది. ఇక వీటి పరిష్కారం ఎన్ని ప్రదక్షిణలు చేస్తే అవుతుందన్నది వేచిచూడాలి.