జాతీయ వార్తలు

వణుకుతున్న ఢిల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఏడాది ఆరంభంలోనే దేశ రాజధాని ఢిల్లీని డెంగ్యూ వణికిస్తోంది. వారం వ్యవధిలో ఇప్పటికే మూడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూలాంటి వెక్టర్-బోర్న్ డిసీజెస్ సాధారణంగా జూలై రెండోవారం నుంచి నవంబర్ చివరి మధ్య నమోదవుతుంటాయి. ఒక్కోసారి డిసెంబర్ వరకూ కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉండొచ్చు. ‘జనవరి 20 వరకూ మూడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అయితే, మలేరియా, చికెన్ గున్యా కేసులో నమోదైన దాఖలాలు లేవు’ అని ఢిల్లీ మున్సిపల్ వైద్యాధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి జనవరి 13 వరకూ ఎలాంటి కేసులు నమోదు కాలేదని, వారం వ్యవధిలోనే ముగ్గురు డెంగ్యూ బారిన పడినట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల లెక్కల ప్రకారం గత ఏడాది ఢిల్లీలో 9,271 మంది డెంగ్యూ బారిన పడ్డారు. ఈ ప్రాణాంతక వ్యాధికి పదిమంది ప్రాణాలు కోల్పోతే, వారిలో ఐదుగురు ఢిల్లీయేతరవాసులు. మున్సిపల్ అధికారుల లెక్కల ప్రకారం నలుగురే చనిపోయినట్టు గుర్తించినా, ప్రయివేట్ ఆస్పత్రుల్లో అనేక మరణాలు డెంగ్యూ కారణంగానే అని నమోదయ్యాయి. అన్నీ డెంగ్యూ మరణాలే కాకున్నా, దోమనుంచి వ్యాప్తిచెందే చికెన్‌గున్యా, మలేరియా వ్యాధులవల్లా ఈ మరణాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.