ఆంధ్రప్రదేశ్‌

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు: ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జనవరి 22: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని వీర వెంకట విఘ్నేశ్వర ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కేంద్రం ఆవరణలో సోమవారం సంభవించిన పేలుడులో ఒక యువకుడు దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పేలుడు తారాజువ్వలు తయారుచేస్తుండగా నిప్పు రవ్వలు లేచి, పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో జువ్వలు తయారుచేస్తున్న సామర్లకోటకు చెందిన వేలంగి వెంకటరమణ (23) పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో తయారీ కార్మికుడు రేపాక రమణ (38)కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ హుటాహుటిన కాకినాడలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వెంకటరమణ పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన రేపాక రమణ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రమాదం తయారీ షెడ్‌లో కాకుండా బయట ఆవరణలో జరగడంతో పెనుప్రమాదం తప్పినట్లయ్యింది.