రాష్ట్రీయం

అన్యమతస్థుల తొలగింపునకు నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 22: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలనా పాలనా చూసే తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ హోదాల్లో ఉన్న అన్యమతస్థులను తొలగించాలని టీటీడీ యాజమాన్యం ఉన్న ఫళంగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. వివిధ హోదాల్లో 35 మంది మైనార్టీలు, 10 మంది క్రైస్తవులు ఉన్నట్టు టీటీడీ గుర్తించింది. దీంతో వీరికి శ్రీముఖాలు జారీ చేసింది. శ్రీముఖాలు అందుకున్న బాధిత ఉద్యోగులు టీటీడీ ఈఓ ఎకె సింఘాల్‌ను కూడా కలిసి తమకు అన్యాయం చేయవద్దని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఓ కూడా తన నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. టిటిడి దేవస్థానం పాలన ప్రారంభమైన తొలినాళ్లల్లో అన్యమతస్థులను టీటీడీలో తీసుకోరాదన్న నిబంధనలు ఎక్కడాలేవు. అయితే అటు తరువాత క్రైస్తవులు హైందవులను మత మార్పిడులకు పాల్పడుతున్న నేపథ్యంలో టీటీడీ అన్యమతస్థుల వ్యవహరంపై తీవ్రస్థాయిలో దృష్టిసారించింది. తిరుమలలో అన్యమతస్థులు ఎలాంటి ప్రార్థనలు కాని, మత మార్పిడిలకు పాల్పడటం కాని, చివరకు తిరుమలకు వెళ్లే వాహనాలపై అన్యమతస్థుల గుర్తులే కాకుండా ఏ రాజకీయ పరమైన వ్యక్తుల ఫోటోలు, పార్టీ గుర్తులు, నినాదాలు ఉండకూడదనే విధానాన్ని టీటీడీ అమలు చేస్తోంది.