సబ్ ఫీచర్

మలితరం గొప్ప నేత ‘అయ్యదేవర’ ( నేడు వర్ధంతి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యదేవర కాళేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి స్పీక ర్. తొలితరం నేతలు కాశీనాథుని నాగే శ్వరరావు, కొండా వెంకటప్పయ్య, టం గుటూరి ప్రకాశం పంతులు కాగా మలి తరం నేతల్లో డాక్టర్ పట్టాని సీతారామ య్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబ మూర్తి మొదలైన వారు ముఖ్యులు. కాళేశ్వరరావు 1881, జనవరి 22న కృష్ణాజిల్లా నందిగామలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత ఉన్నత విద్యకాస్త ఆలస్యంగా 1894-1901 మధ్యకాలంలో జరిగింది. మచిలీపట్నం నోబుల్ కళాశాలలో ఎఫ్.ఎ. పూర్తి చేశారు. కాళేశ్వరరావుకు, విద్యా గురువు రఘుపతి వెంకటరత్నం నాయుడు. వేమూరి రామకృష్ణరావు వద్ద ఇంగ్లీషు నేర్చుకున్నారు. డాక్టర్ పట్ట్భా, మట్నూరు కృష్ణారావులు ఆయనకు అక్కడ స్నేహితులయ్యారు. ఇంగ్లీషు, గణితంలలో ప్రావీణ్యం సంపాదించిం ఇంజనీరు కావాలను కున్నా, ఆ కోరిక తీరలేదు. బందరులోనే చరిత్రలో పట్ట భద్రుడయ్యారు. ఆయనలోని ప్రతిభను గుర్తించి బందరులోని స్కూలులోనే చరిత్ర ఉపాధ్యాయుడిగా అవకాశం ఇచ్చారు. 1901-03 మధ్యకాలంలో ఉపాధ్యాయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
మద్రాసు లా కళాశాలలో 1904-05 మధ్యకాలంలో బిఎల్ పూర్తి చేశారు. మద రాసులో కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగంగార్లతో పరిచయమైంది. ఆ కారణంగా సంఘ సంస్కరణోద్యమానికి బీజం పడింది. రఘుపతి వెంకట రత్నం నాయుడు ప్రభావంతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. బెంగాల్ విభజనకు వ్యతిరేక ఉద్యమంలోను, హోం రూలు ఉద్యమంలోను పని చేసి కారాగార శిక్షలు అనుభవించారు. 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయవాడ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిం చారు. ప్రజాప్రతినిధిగా ఆయన విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఎందరికో విద్యాదానం చేశారు. 1939లో మదరాసు శాసనసభకు, విజయవాడ, బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేసి అఖండ విజయం సాధించారు. రాజగోపాలాచారి నేతృత్వంలో మదరాసు ప్రభుత్వం ఏర్పడింది. దానిలో కాళేశ్వరరావు, రాజగోపాలాచారికి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మద్యపాన నిషేధ చట్టం, అమ్మకంపన్ను, హరిజనుల దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో కాళేశ్వరరావు మేధా సంపత్తిని, భాషా నైపుణ్యం అందరి ప్రశంసలందుకుంది.
1946లో విజయవాడనుంచి ఎన్నికైన కాళేశ్వరరావు, ప్రకాశం పక్షం వహించారు. ప్రకాశం మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదు. కానీ కాళేశ్వరరావు తన శిష్యుడు వేముల కూర్మయ్యకు మంత్రిపదవి ఇప్పించారు. ప్రకాశం ప్రభుత్వం ఏడాదికాలమే ఉన్నప్పటికీ, ప్రకాశం పక్షానే కాళేశ్వరరావు కొనసాగారు. 1947లో బహుభార్యాత్వ నిషేధపు చట్టాన్ని కాళేశ్వరరావు ప్రవేశపెట్టారు. 1955లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి, 1955, మార్చి 28న పదవీ స్వీకారం చేశారు. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్‌గా కాళేశ్వరరావును ఎన్నుకున్నారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొట్టతొలి స్పీకర్‌గా 1956-1962 మధ్యకాలంలో పనిచేశారు. విజయవాడ రామమోహన గ్రంథాలయ ఏర్పాటుకు సహాయం చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన ‘విజ్ఞాన చంద్రికా మండలి’ కార్యదర్శిగా పనిచేశారు. ‘అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర’, ‘ఫ్రెంచ్ విప్లవం’, ‘తురుష్క ప్రజాస్వామికం’, ‘చీనా జాతీయోద్యమం’, ‘ఈజిప్టు చరిత్ర’ గ్రంథాలను రచించారు. ఆయన జీవిత చరిత్ర ‘నవ్యాంధ్ర-నా జీవిత కథ’ అనే పుస్తక రూపంలో వెలువడింది. విజయవాడలోని మార్కెట్‌కు ఆయన పట్ల గౌరవ సూచికంగా కాళేశ్వరరావు మార్కెట్ అని పేరు పెట్టారు. తెలుగువారు మరువలేని ఈ గొప్ప నేత 1962, ఫిబ్రవరి 26న విజయవాడలో పరమపదించారు.

- అయ్యదేవర పురుషోత్తమరావు