శ్రీకాకుళం

అయితే.. ఓకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 27: జిల్లా టిడిపి కార్యాలయం స్థల వివాదానికి తెర పడింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
25 లక్షల రూ.లు బలగ రూరల్ సర్వే నెం. 18/6,7,8లో 45 సెంట్లు స్థలానికి ఇంకా బకాయివున్నారంటూ బహిరంగ లేఖ రాసిన తెలుగుతమ్ముడు రెడ్డి చిరంజీవి ‘అచ్చెన్న సంకల్పమా-అయితే ఓకే’ అంటూ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణంలో తాను పాలుపంచుకుంటానంటూ మరో లేఖను శుక్రవారం ఆయన పంపించారు. ఇటీవల 80 అడుగుల రోడ్డులో రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కోసం కేటాయించిన విషయం తెలిసిందే. అక్కడ అన్నీ సౌకర్యాలతో జిల్లా టిడిపి కార్యాలయం నిర్మించేందుకు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు సంకల్పించారు. అందుకు కావల్సిన నిధులు కోసం ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్‌తో సంభాషణ వచ్చినప్పుడు పార్టీ కార్యాలయానికి గతంలో తీసుకున్న స్థలాన్ని అమ్మజూపి ఆ వచ్చిన నిధులతో ముందుగా నిర్మాణం ప్రారంభించాలన్న సమాలోచన జరిగింది. ఆ మేరకే మంత్రి టెక్కలి నియోజకవర్గం సమావేశంలో బలగలో పార్టీకి గల 45 సెంట్లు స్థలాన్ని మార్కెట్‌లో పెట్టమంటూ ఆయన అనుచరులు బోయిన గోవిందరాజులు, చౌదరి బాబ్జీలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో స్థలం పార్టీ అధినేతకు అమ్మచూపిన రెడ్డి చిరంజీవికి ఇంకా ఆ స్థలానికి చెందిన 25 లక్షల రూ.లు బకాయి ఉందంటూ గళం విప్పారు. ఇంతలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎం.పి. రామ్మోహన్‌నాయుడు స్థలదాత, విక్రయదారుడు రెడ్డి చిరంజీవితో ప్రత్యేక సంభాషణ నిర్వహించినట్టు సమాచారం. చిరంజీవి తన కష్టనష్టాలు, బాధలు, బాంధవ్యాలు కింజరాపు కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం అంతా వెల్లగక్కుకున్నట్టు సమాచారం. అనంతరం శుక్రవారం రెడ్డి చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు అకాల మరణంతో మనస్తాపానికి గురై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానే తప్ప, పార్టీ పట్ల, పార్టీ కార్యక్రమాల పట్ల విముఖత లేదని, నాటి నుంచి నేటి వరకూ పార్టీ కోసం పనిచేశాననంటూ అందులో వివరించారు. అంతేకాకుండా, శ్రీకాకుళం, బలగ రూరల్ సర్వే నెం. 18/6,7,8లో భాగం 45 సెంట్లు స్థలం 2002, మే 10న ఎర్రన్న, గుండ, వై.వి.సూర్యనారాయణ వంటి పెద్దల సూచనల మేరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ స్థలాన్ని అమ్మచూపి వచ్చిన మొత్తంతో జిల్లా పార్టీ కార్యాలయం నిర్మించేందుకు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు సంకల్పించారని, అందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానంటూ చిరంజీవి స్పష్టం చేశారు. 45 సెంట్లు స్థలం వినియోగం విషయంలో అచ్చెన్న, ఎం.పి, జిల్లా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం చెప్పే ఉద్దేశం తనకులేదంటూ ప్రకటనలో వెల్లడించారు.. అచ్చెన్న చెప్పారా..అయితే-ఓకే! అంటూ పార్టీకి 2002లో విక్రయించిన స్థలం క్రయవిక్రయాలకు అడ్డుచెప్పనంటూ రెడ్డి చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. ‘టిడిపి స్థలం ఫర్ సేల్’ అనే శీర్షికన ‘ఆంధ్రభూమి’లో వెలువడిన కథనం జిల్లా టిడిపిలో చర్చానీయాంశమైంది. చివరకు విక్రయించేవారినే విధేయుడుగా మార్చిన మంత్రి అచ్చెన్న రాజనీతికి తెలుగుతమ్ముళ్ళంతా శభాష్ అంటున్నారు.
చేతిలో చిల్లిగవ్వ లేదు!
శ్రీకాకుళం:
ఒక అడుగు పరిశుభ్రతకు.. అన్న నిదానం పాఠశాలల్లో నిలువునా నీరుగారిపోయింది. పది అడుగులు వెనక్కి వేసే విధంగా సర్వశిక్షఅభియాన్ తీరు ఉండడంతో కోట్లాది రూపాయల నిధులను ప్రభుత్వం వెనక్కి రప్పించింది. నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోలేదన్న వాదన ఒకటైతే, ప్రభుత్వాలు మారితే ఆడిట్‌లో భాగంగా నిధులన్నీ వెనక్కి రప్పించి, మరల ఖర్చుల గణాంకాలు పరిశీలించిన తర్వాత నిధులు మంజూరు చేస్తారన్నది మరో వాదన. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, నిర్వహణకు ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ద్వారా 2014-15 విద్యాసంవత్సరానికి 205 కోట్ల వార్షిక బడ్జెట్‌తో కార్యక్రమాలు చేపట్టాల్సివుంది. ఎమ్మార్సీ గ్రాంటు కింద 728.80 లక్షల రూ.లు వెచ్చించినప్పటికీ, ఆ నిధుల్లో కొంతమేరకు వినియోగించరాదంటూ ఫీజింగ్ ఏర్పడింది. 298 పాఠశాలల నిర్వాహణకు 403.96 లక్షలు కేటాయించగా, పాఠశాలల గ్రాంటు కింద 3127 ప్రాథమిక పాఠశాలలకు ఐదు వేల రూ.లు చొప్పున్న, 1040 యు.పి., హెచ్.ఎస్. పాఠశాలలకు ఏడు వేల రూ.లు చొప్పున్న మంజూరు చేయాల్సివుంది. ఇప్పుడు ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోవడంతో పాఠశాలల నిర్వాహణకు గడ్డుకాలం ఏర్పడింది. ఏటా విడుదల చేసిన నిధులను ప్రభుత్వం పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు.
పాఠశాలల నిర్వహణకు కూడా ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వినియోగిస్తుంటారు. ఇలా 2011 - 2015 వరకూ ఎస్‌ఎస్‌ఏ ద్వారా విడుదలైన నిధుల్లో ఖర్చు చేసిన సొమ్ము పోగా మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. జిల్లాకు సంబంధించి 12.32 కోట్ల రూపాయలను వెనక్కు మళ్ళిస్తూ, ఆ నిధులను ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు అధికారి ఖాతాలో జమ చేయాలని ప్రాజెక్టు రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిధులను ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు అధికారి ఖాతాలో జమ చేసేశారు. ప్రస్తుత తరుణంలో ప్రధానోపాధ్యాయులకు దిక్కుతోచడం లేదు. జిల్లాలో పాఠశాలలకు స్కూల్ గ్రాంటు కింద 1.94 కోట్ల రూ.లు, పాఠశాలల నిర్వాహణ నిధుల కింద 2.18 కోట్ల రూ.లు అవసరం కాగా, ఆ మొత్తాన్ని కూడా వెనక్కు మళ్లించి సర్వశిక్ష అభియాన్ పి.వో. ఖాతాలో జమ చేశారు. ఈ మొత్తం కలిపి 4.12 కోట్ల రూ.లు పోను మిగతా సొమ్ము పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుపొడ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించినది. అన్నీ కలిపి ఆ ఖాతాలో జమయ్యాయి.
2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్‌ఎస్‌ఏ ద్వారా పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలతోపాటు శ్రీకాకుళం జిల్లాకు కూడా నిధులు విడుదల చేశారు. మిగిలిన పది జిల్లాలకు నిధులు విడుదల కాకపోవడం, ఇప్పటివరకు విడుదలైన వాటి వినియోగంపై గణాంకాలను సేకరించేందుకు ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. జిల్లాకు సంబంధించిన ఎస్‌ఎస్‌ఏ నిధుల్లో కొంత సొమ్ము వినియోగానికి మాత్రం ఏస్‌ఎస్‌ఏ రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పనుల నిర్వహణ కోసం ఆరు కోట్లు, గుత్తేదారులకు బకాయి సొమ్ము చెల్లింపు కోసం రెండు కోట్లను వినియోగించేందుకు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. 2013 సంవత్సరంలో కూడా ఎస్‌ఎస్‌ఏ నిధులు వెనక్కి మళ్ళినట్టు వారు చెబుతున్నారు. ఈ నిధులు వినియోగం తీరును పరిశీలించి, ఆడిట్ పూరె్తైన తర్వాత మరల నిధులు విడుదల చేస్తారని, ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు మారినప్పుడు మాకు ఎదురవుతాయంటూ ఎస్‌ఎస్‌ఏ అధికారులు తేలికగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూలు గ్రాంట్లు, పాఠశాలల నిర్వహణ నిధుల కోసం ఆందోళన చెందనవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నా, స్కూల్ గ్రాంట్లు, పాఠశాలల నిర్వాహణ ఖర్చులకు ప్రస్తుతం పెట్టుబడులు ఏ ఉపాధ్యాయుడు భరించాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటి వరకూ మరుగుదొడ్ల నిర్మాణాలను ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో చేపట్టేవారు. ఆ విధానాన్ని మారుస్తూ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం సెర్ప్‌కు అప్పగించింది. ఆ విధంగా జిల్లాలో 1274 మరుగుదొడ్ల నిర్మాణాల బాధ్యతను సెర్ప్‌కు అప్పగించాల్సివచ్చింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ ద్వారా జిల్లాలో టెక్కలి నియోజకవర్గంతోపాటు, మరికొన్ని నియోజకవర్గాలలో మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతను డిఆర్‌డిఎకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

.

దంత వైద్య కళాశాల కార్మికుల నిరసన
కాకుళం, నవంబర్ 27: మండలంలోని పాత్రునివలస సమీపంలో ఉన్న శ్రీసాయి దంతవైద్య కళాశాల కార్మికులు శుక్రవారం పెన్‌డౌన్ చేస్తూ నిరసనను తెలిపారు.
సామరస్యపూర్వకంగా జీతాలు పెంచాలంటూ నిరసనను యాజమాన్యానికి తెలియజేస్తుంటే యాజమాన్యం ఉద్యోగాలు తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేసిందంని కార్మిక సంఘం నాయకుడు కెఎల్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం నోటీసులు జారీ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వరుసగా మూడురోజులువిధులకు హాజరు కానిచో ఉద్యోగం నుండి తొలగించి కొత్తవారిని వేసుకుంటామని నోటీసులో పేర్కొన్నట్టు వారు తెలిపారు. కార్మికులకు సమ్మెచేసే హక్కు ఉందని పోరాటం ద్వారానే సమస్యను పరిష్కరించుకుంటామని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తమ కోర్కెలు నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్ 7వతేదీనుండి విధులను పూర్తిగా బహిష్కరించనున్నట్టు వారు పేర్కొన్నారు.
జిల్లాస్థాయి అధికారులు కూడా దీనిపై స్పందించి దంతవైద్య కళాశాల కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు.
లారీ ఢీకొని
యువకుడి మృతి
ఆమదాలవలస, నవంబర్ 27: పట్టణంలోగల మేదరవీధి సమీపంలో శుక్రవారం రాత్రి లారీ ఢీకొని రావికంటిపేటకు చెందిన పి.సంతోష్(కృష్ణంరాజు)(19) అనే యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు.
మృతుడు తండ్రి టైలరింగ్ వృత్తి చేస్తున్నాడు. తండ్రికి సహాయకారిగా ఉంటూ సైకిల్‌పై మార్కెట్ వెళ్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. లారీ పరారీ అయింది. అయితే, గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ గోవిందరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
కార్మికులను తగ్గించాలనే ఆలోచనను విరమించుకోవాలి
శ్రీకాకుళం, నవంబర్ 27: ఆర్టీసీలో అధికంగా ఉన్న అధికారుల జీతభత్యాలతో సంస్థ నష్టాల పాలవుతోందని ఎపిఎస్ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాత్రీపగలు అనకుండా కష్టపడుతున్న ఆర్టీసీ కార్మికులతోనే సంస్థ నష్టాలపాలవుతుందని యాజమాన్యం పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. రోజుకు సుమారు 13.40 కోట్ల రూపాయలు ఆదాయం సంస్థకు చేకూరుస్తున్న కార్మికులకు పెంచిన జీతాలతో 650 కోట్ల రూపాయలు భారం పడుతుందని, అందుకే కార్మికులను కుదించి నష్టాలను తగ్గిస్తామని యాజమాన్యం ప్రకటించడం శోచనీయమని పేర్కొన్నారు. నెలకు లక్షలాది రూపాయలు జీతాలు పొందుతున్న అధికారులు 427 మంది ఉన్నారని, ఒక అధికారిని తగ్గిస్తే ఆ వేతనంతో 15 మంది కార్మికులకు ఉపాధి దొరుకుందన్నారు. పైగా కండక్టర్లు, డ్రైవర్లు అవినీతికి పాల్పడుతున్నట్టు అధికారులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, సంస్థలో కార్మికులు నిజాయితీగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇందుకు తనిఖీ అధికారులు ఎన్ని పర్యాయాలు తనిఖీలు నిర్వహించినా ఒక్క కేసు నమోదు కాకపోవడమే నిదర్శనమన్నారు.
కార్మికులను తగ్గించాలనే ఆలోచనను యాజమాన్యం విరమించుకోవాలని లేకపోతే రాష్టవ్య్రాప్త ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. సమావేశంలో యూనియన్ శ్రీకాకుళం డివిజనల్ కార్యదర్శి కె.శంకరరావు(సుమన్), ఎ.వి.ఆర్.మూర్తి, పి.వి. ఆర్.యల్.కుమారి, బి.ఎ.రావు, కె.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్య భారతావని లక్ష్యం కావాలి
కొత్తూరు, నవంబర్ 27: నైపుణ్యమైన భారతావనిగా విద్యార్థుల లక్ష్యం కావాలని అంబేద్కర్ యూనివర్శిటీ విసి లజపతిరాయ్ అన్నారు.
స్థానిక శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణలో జాతీయ సేవా పథకం జిల్లా యువజనోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విసి మాట్లాడుతూ మంచి నైపుణ్యం కలిగిన విద్యనభ్యసించటంతోపాటు సేవా దృక్పథాన్ని కూడా విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. విద్యలో ప్రావీణ్యత సాధించినప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని తెలిపారు. జాతీయ సేవా పథకంలో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, విద్యా సంస్థలకు పేరు తీసుకురావాలని కోరారు. మంచి పనిని చేసే లక్ష్యంతో విద్యార్థులు ముందుకు సాగాలని ఆయన కోరారు.
అనంతరం 20 కళాశాలల విద్యార్థులు పలు పోటీ పరీక్షలు, నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ సంజీవయ్య, డిటివో నర్సింహమూర్తి, డివిజనల్ పిఆర్‌వో లక్ష్మీకాంతం, పాతపట్నం మహేంద్ర కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ సలహదారు మధు, వేంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గేదెల కృష్ణారావు, కరస్పాండెంట్ సుధారాణి, అధిక సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

హైవే బ్రిడ్జి పైనుండి వ్యాన్ బోల్తా

ఆమదాలవలస, నవంబర్ 27: మండలంలోగల కొత్తరోడ్ సమీపం హైవే బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జైపూర్‌నుండి బరంపురం వెళ్తున్న స్కార్పియోవ్యాన్ అదుపుతప్పి బ్రిడ్జి పైనుండి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బహుదూర్ త్రిపాఠి(54) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా నర్శింగ్‌చౌదరి, బస్వంత్, గణేష్ విశ్వ అనే ముగ్గురుతోపాటు డ్రైవర్ బొనేరాజుకు తీవ్రగాయాలయ్యాయి. జైపూర్ ఎమ్మెల్యే బగినిపతి తారాప్రసాద్‌కు చెందిన ఈ వ్యాన్ ఆయన స్నేహితులు జైపూర్‌లో రాత్రి పదిగంటలకు బయలు దేరి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. స్థానిక ఎస్‌ఐ కె.గోవిందరావు నమోదు చేసి త్రిపాఠి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
కల్తీ నెయ్యి స్వాధీనం
నరసన్నపేట, నవంబర్ 27: మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక ప్రధాన మార్కెట్‌లో మూడు కిరాణా షాపుల్లో విశాఖపట్నంకు చెందిన కల్తీ నిరోధక రీజనల్ అధికారి హనుమంతరావు ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ.5వేలకు పైగా విలువ గలిగిన కల్తీ నెయ్యి నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. అంతే కాకుండా పొగాకు నిషేధ వస్తువులు కూడా ఈ దాడుల్లో బయటపడ్డాయని వీటి విలువ సుమారు పదివేలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆహార కల్తీలకు సంబంధించి వినియోగదారులు అప్రమత్తం అవ్వాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఆహార భద్రత అధికారులు ప్రభాకర్, కె.కూర్మినాయుడు, ఎస్.ఈశ్వరి, లక్ష్మణరావులు పాల్గొన్నారు.
మురపాక కస్తూరిబా పాఠశాల ఆకస్మిక తనిఖీ
లావేరు, నవంబర్ 27: మురపాక కస్తూరిబా విద్యాలయం, పి.బి నగర్ అంగన్వాడీ కేంద్రాలను మండల ప్రత్యేకాధికారిణి సుజాత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కె.జి.బి.వి, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మెనూ ఆమె పరిశీలించారు. రికార్డులు తనికీ చేసి ఈ కేంద్రాలలో లక్ష్యం నెరవేర్చేలా సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆమె సూచించారు. ఆమె వెంట కె.జి.బి.వి ప్రత్యేకాధికారి ఉన్నారు.
సందేశాత్మకంగా సాగిన నాటకాలు
శ్రీకాకుళం, నవంబర్ 27: మూడు రోజులుగా ప్రదర్శితమవుతున్న జాతీయ స్థాయి నాటికలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. ఒంగోలు పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్, శ్రీకాకుళం ముత్యాలమ్మ కళానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో గోవాడ లిఖిత సాయిశ్రీ క్రియేషన్ బృందంచే మాకంటూ ఒక రోజు నాటిక సమకాలిన సామాజిక సమస్యలను ప్రతిబించింది. అదే విధంగా ఛత్తీస్‌గఢ్(బిలాయి) కళాంజలి కళాకారులు ప్రదర్శించిన మిధునం నాటిక భార్యాభర్తల దాంపత్యంలో ఎదురయ్యే సమస్యలను అధిక మించే విధానానికి అద్దం పట్టింది. ఈ సందర్భంగా నాటికల దర్శకులు జయంతి సుబ్రహ్మణ్య సతీష్, కె.రాజు ఇతర కళాకారులను అరసవల్లి సూర్యనారాయణస్వామివారి దేవస్థానం ప్రధానార్చకుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అదే విధంగా రంగస్థల నటులు, పౌరాణిక కళాకారులు దర్శకులైన మెట్టపోలినాయుడు, పురుషోత్తం సూర్యనారాయణ, ఎం.సూర్యనారాయణలను ఆత్మీయపురస్కారాలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థల అధ్యక్షుడు బలివాడ శ్రీనువాసరావు, ఇతర ప్రతినిధులు కె.రాజేశ్వరి, ఎస్.వెంకట్, గణేష్‌లతోపాటు రెడ్‌క్రాస్ చైర్మన్ జి.జగన్మోహనరావు, నిక్కు అప్పన్న, బి.చిట్టిబాబులతోపాటు కళాభిమానులు పాల్గొన్నారు.