Others

ఉనికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకానొక కాలంలో ఓ గొర్రెలు మేపే వానికి వైరాగ్యం వచ్చింది. ఎంతకాలం చూసినా ఈ గొర్రెలను మేపడం, యజమాని ఇచ్చిన డబ్బుతీసుకోవడం, దానితో దిన వెచ్చాలుకొనుక్కొవడం, అవి తినడం అంతేనా బతుకు అంటే నేను పుట్టాను. పెరిగాను. రేపొద్దున చనిపోతాను. కాని నేను పుట్టినందుకు ఏం చేస్తున్నాను. నేను పోయేక ఎవరైనా నన్నుగుర్తుపెట్టుకుంటారా అనుకొన్నాడు.
అసలు నువ్వు ఇపుడు బతికి ఉన్నావుకదా. మరి నిన్ను ఎవరైనా గుర్తుపడుతారా అని అతని మనసు అడిగింది. ఆయనకూ అది నిజమే కదా అనిపించింది. వెంటనే ఆ వూరి కరణం దగ్గరకువెళ్లాడు.బాబూ నేను ఎవరో మీకు తెలుసా అని అడిగాడు. కరణం ‘నీవు ఎక్కడ ఉంటావు. ఏం చేస్తుంటావు’అని అడిగాడు. అంటే నన్ను అసలు ఇతనికి తెలియదన్నమాట అనుకొని వెళ్లిపోయాడు. అప్పటినుంచి బాగా ఆలోచించాడు. ఏదోపెద్ద దానాలుచేస్తే దానకర్త అని పేరురావచ్చు అనుకొన్నాడు. లేదు గొప్ప పారిశ్రామిక వేత్తనై ఎందరికో ఉద్యోగాలను కల్పిస్తే బోలెడంత మంది నన్ను ఉపాధి కల్పించిన వాడినని మెచ్చుకుంటారు అనుకొన్నాడు. లేదు గొప్ప నిర్మాణం ఏదైనా తలపెడితే అందరూ నన్ను మొదలుపెట్టిన నాటి నుంచి గొప్పగా చెబుతారు కదా. టీవీల్లో కూడా చూపిస్తారు అనుకున్నాడు.
కాని ఇవన్నీ చేయడానికి నీకు డబ్బు ఉందా అని అతని మనసు మళ్లీ అడిగింది. దాంతో మళ్లీ నిరాశ కలిగింది. నిట్టూర్పు విడిచాడు. అవునునిజమే. ఏ పని చేయాలన్నా డబ్బు ఉండాలి. అదే నా దగ్గర లేదుకదా. అయినా ఈ యజమాని ఇచ్చే డబ్బు నాకు తినడానికే సరిపోవడం లేదు. ఇంకా నేను పెళ్లిపెటాకులు చేసుకొంటే నా ఇల్లాలికి ఏం పెడతాను అనుకొన్నాడు.
అట్లా అనుకొంటూ నడుస్తూ వెళ్తున్నాడు. దారిలో పెద్ద లారీ మోత మోగిస్తూ వస్తోంది. ఎందుకింత మోత మోగిస్తోందో అని ఆ వంక చూశాడు. ఆ లారీకి ఎదురుగా ఓ చిన్న ఐదేళ్ల పాప పరుగెత్తి వెళ్తోంది.. వెంటనే గొర్రెల కాపరి పరుగెత్తి వెళ్లి ఆ పాపను పక్కకు తీశాడు. లారీ పెద్ద శబ్దంతో ఆగింది. ఆ డ్రైవర్ కిందికి దిగి ‘ఏమయ్యా! నీకు బుద్ధి లేదా పిల్లల్ని అలా రోడ్డుపైన వదల వచ్చా అని అడిగాడు.’
‘అయ్యో ఈ పాప నా పాప కాదండి.. నాకు తెలీదు నేను ముందుగా చూడలేదు’అని చెప్పాడు మేపరి.
అంతలోఅక్కడికి చర్చి లో ప్రార్థన చేసి వస్తున్న దంపతులు పరుగెత్తుకు వచ్చారు. ఆమె ‘పాపా ! పాపా ! అని ఏడుస్తూ దగ్గరకు తీసుకొని ముద్దులు పెడుతోంది.
అతను ‘మీకు శతకోటి దండాలు. మీవల్లే మాకీ రోజు గండం తప్పింది. మీరుగనుక లేకపోతే ఈ రోజు మేము ప్రాణాలు నిలుపుకోలేకపోయేవారిమి. మీ వల్లనే మా ఐదు ప్రాణాలు నిలిచాయి మేమెంతో ఋణ పడి ఉన్నాము’ అని అతని రెండు చేతులు పట్టుకొని కృతజ్ఞతలు చెబుతున్నాడు.
మేపరికి ఏమీ అర్థం కాలేదు. అతను తన కారులో ఈ గొర్రెల కాపరిని ఇంటికి తీసుకొని వెళ్లాడు. అక్కడ అతని తల్లిదండ్రులతో జరిగిన విషయం చెప్పాడు.
వాళ్లు ‘అయ్యా! నీవు ఏసుప్రభువలె వచ్చి మా బిడ్డను కాపాడావు.మేము పొద్దున నుంచి వెతుకుతున్నాము. మా బిడ్డ వాకిట్లో ఆడుతూ ఆడుతూ మా పని మనిషి చెంత నుంచి తప్పించుకొని ఎటో వెళ్లిపోయింది అప్పటి నుంచి వెతుకుతున్నాము. మాప్రాణాలు కాపాడావు బాబు. నీకు మేం ఏం చేయగలం ’అని అడిగారు.
కాపరికి ఏం చేయాలో అర్థం కాలేదు.
మళ్లీ కారులో తీసుకొని వెళ్లిన అతనే మీరు మా ఇంట్లోనే ఉండండి. మీ పిల్లలను మేము చదివిస్తాము. మీరు ఏదో ఒకపనిని చేయండి. మా పాపను మీరు పెంచడంలో సాయం చేయండి ’అని అడిగాడు.
గొర్రెల కాపరి తన సంగతి చెప్పాడు. వారు పరమ సంతోషంతో అతడికి ఇల్లు ఇచ్చారు. పెళ్లి చేశారు. వారింట్లో పనివారిమీద మేస్ర్తిగా పని కల్పించారు. అటు పని చేయించడం, ఇటు ఆ పాపను జాగ్రత్తగా బడికి తీసుకొని వెళ్లి ఇంటికి తీసుకొని రావడం అతని బాధ్యతలు.
ఒకరోజు దారిలో గొర్రెల కాపరి వెళ్లుతుంటే ‘అనంతయ్య! మీ యజమాని చాలా మంచివారట కదా. వారున్నారా నాకు వారితో కాస్త పని ఉందిమీరు వారితో మాట్లాడే అవకాశం ఇప్పిస్తారా. మీరు చెబితే వారు సాయం చేస్తారని విన్నాను’అన్నాడు. అలా అన్నది ఆ ఊరి కరణం.
‘బాబూగారు మీ దగ్గరకు నేను ఇంతకు ముందు వచ్చినపుడు నాగురించి తెలీదు అన్నారు కదా. ఇపుడేంటి నా గురించి మీరు ఇన్ని విషయాలు చెబుతున్నారు ’అని ఆశ్చర్యం గా అడిగాడు.
అపుడు కరణం. ‘ఏముంది బాబూ! నీ మంచితనం నీకు మంచి దారి చూపించింది. ఆ దారిలోనీవు వెళుతూ మంచి పనులు చేస్తూనే ఉన్నావు.నీవు చేసే మంచి పనులే నీకు పేరు తెచ్చి పెట్టాయి ’అని చెప్పాడు.
ఆరోజు నిద్ర పోయేముందు నా గురించి నలుగురికీ తెలిసిందికదా అనుకొన్నాడు. ‘నువ్వు మంచి పనులు చేస్తున్నంత కాలమూ నిన్ను నలుగురూ గుర్తిస్తారు. పొగుడుతారు. నీ ఉనికి నలుగురికీ నీవు వద్దన్నా తెలుస్తునే ఉంటుంది. మరి నీవు నిర్ణయించుకో నీవు ఏం చేయాలో’ అంది అతని మనసు.
నిజమే నేను సదా మంచి పనులే చేస్తాను.. గట్టిగా అనుకొన్నాడు.

- దాసరి రాణి