Others

దత్తోహం దత్తోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తావతారుడు భక్తుల కోసం ఎన్నో అవతారాలను దాల్చాడు. వారికోరికలను ఈడేర్చాడు. ఆ దత్తావతారాల్లో మరికొన్ని ....
కాలాగ్ని శమనుడు: మార్గశిర పూర్ణి మ నాడు మృగశిరా నక్షత్రంలో పుట్టిన దత్తాత్రేయుడు కాలాగ్ని శమనుడుగా పేర్గాంచాడు.
యోగి జన వల్లభుడు: అత్రిఅనసూయల బిడ్డడైన దత్తాత్రేయుడిని సిద్ధ గంధర్వాదులు యోగిపుంగవులు కలసి దర్శనం చేసుకొని యోగి జనవల్లభునిగా కీర్తించారు.
శ్రీలీలా విశ్వంభరుడు: బాలదత్తుడు ఆశ్రమజీవులకు అనేకానేక లీలలను ప్రదర్శిస్తూ వారికి ఆనందానిచ్చేవాడు. వారికి ఒకసారి 100 ఏళ్లు సరస్సులో మునిగి ఉండి తర్వాత బాలదత్తునిగా దర్శనిమివ్వగా వారు శ్రీ లీలా విశ్వంభరునిగా ఆరాధించారు.
సిద్ధరాజు : సిద్ధులు ఒకసారి తమ శక్తియుక్తులను చూసుకొని గర్వాన్ని పొందారు.వారి గర్వాన్ని అణచడానికి అత్రి కుమారుడు వారి దగ్గరకు సిద్ధరాజుగా వచ్చి వారిలో నిజజ్ఞానాగ్ని ని మేల్కొపాడు. దాని వల్ల సిద్ధులంతా అత్రికుమారుడిని సిద్ధరాజుగా ఆరాధించారు.
జ్ఞాన సాగరుడు: అజ్ఞానం వల్లనే జీవులంతా నాశనవౌదున్నారని వారి అజ్ఞానాన్ని రూపుమాపాలని అనసూయ కుమారుడు తలిచాడు. అందుకే ఫాల్గుణ శుద్ధ దశమి నాడు జ్ఞానసాగరుడుగా అవతరించి జ్ఞాన బోధ చేశాడు.
విశ్వంభరావదూత: ఒకసారి సిద్ధులకుకూడా వ్యాపకాలు ఎక్కువై వారికి మనోనిశ్చలత కలుగకుండా ఉన్నప్పుడు వారంతా దత్తాత్రేయులను రక్షించమనికోరితే వారి కోరిక తీర్చడానికి విశ్వంభరావధూతగా దర్శనమిచ్చారు.
మాయా యుక్తావధూత: వైశాఖ శుద్ధ చతుర్దశినాడు భిక్షుకవేషంలో దత్తుడు దర్శనం ఇచ్చాడు. దీన్ని గుర్తించలేనివారికి జ్ఞానోదయం కలిగించడానికై కుక్కల చేత వేదాలను షట్చాస్త్రాలను వల్లె వేయించాడు.
ముక్తావధూత : ఒకసారి కార్తవీర్యార్జుని చేత మాయాముక్తావధూతగా పూజలందుకుని కార్తవీర్యార్జునునికి జ్ఞానబోధ కలిగించాడు.
ఆదిగురువు: ఒకసారి అల్కరునికి ఆషాఢపూర్ణిమ నాడు ఆది గురువుగా దర్శనం ఇచ్చాడు. అల్కరుని తల్లి మదాలస మాట ప్రకారం ముముక్షువుగా ఉన్న అల్కరునికి ఆదిగురువుగా దర్శనమిచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.
శివస్వరూపుడు: పింగళనాగుడనే విప్రుడు దత్తుడిని శివస్వరూపంగా దర్శనమివ్వమని అడిగినందున శ్రావణ శుద్ధ అష్టమినాడు శివస్వరూపుడై దత్తుడు దర్శనమిచ్చాడు.
శ్రీ దేవదేవ: అమలక వృక్షం కింద ధ్యానస్థుడైన దత్తునికే శంఖచక్రగదాహస్తుడైన దత్త ప్రభువు దర్శనమిచ్చాడు.
దిగంబరుడు:సోమవంశజుడైన యదుమహారాజు కోరిక ప్రకారం దత్తుడే దిగంబరుడై దర్శనమిచ్చి జ్ఞానం కోరే ఆ మహారాజు తాను 24 మంది గురువు ల దగ్గర నుంచి జ్ఞానామృతాన్ని గ్రోలానని చెప్పారు.
శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు : దత్తుని భక్తులంతా గురు దర్శనం కోరినప్పుడు దత్తుడు కృష్ణ శ్యామలవర్ణంతో కమలనయనములతో జ్ఞాన తల్పంమీద విశ్రమించి మరీ దర్శనం ఇచ్చాడు. ఇలా దత్తస్వామి 16 అవతారాల్లో భక్తుల కోరికలను తీర్చేవానిగా కీర్తించబడుతున్నాడు.