తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

మారిపోతున్న పాత్రికేయ విలువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడైనా సమస్య ఉంటే పత్రికల ద్వారా నలుగురికీ తెలుస్తుంది. కాని నలుగురి సమస్యను ఒక్క పత్రిక కూడా పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి గతంలో ఏనాడూ దాపురించలేదు. రాష్ట్ర విభజన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితి విచిత్రంగా ఉంది.
నిజానికి ఇది ప్రజల సమస్యా? పత్రికల సమస్యా? ఇప్పుడు పత్రికలు చాలానే ఉన్నాయి. కాని వాటి విధానం చాలావరకు ఒకేలా ఉంది. పాలకపక్షంపై ‘అక్షరం’ వాలడం లేదు. వారికి పనికివచ్చే విమర్శ కూడా జోలపాట పాడుకుంటోంది. ప్రతిపక్ష విమర్శ స్థాయి పడిపోవడం గమనించాలి. కేవలం ప్రెస్‌మీట్ల ద్వారా, ప్రెస్‌నోట్ల ద్వారా తిట్టుకోవడాలే తప్ప మరేమీ లేదు. ఇరువర్గాల మధ్య జరిగే అప్రస్తుత సంఘర్షణల వల్ల ప్రజలకేమీ పాలుపోవడం లేదు, ఏమీ అర్థం కావడం లేదు.
ఒకప్పుడు వార్తలకి కొదవ ఉండేది కాదు. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ ప్రముఖ వార్తలు చాలా తక్కువ వస్తున్నాయి. ఇందులో దేశ వార్తలు చాలావరకు ఒకవైపే. మరో సగం పేజీల వార్తలు కాని ‘ప్రత్యేక పేజీలు’. లోగడ దినపత్రికల్లో ఇలాంటి పేజీలు చాలా తక్కువ. ఆదివారం ప్రత్యేక సంచికల్లో మాత్రమే కనుపించే సమాచారం ఇపుడు దినపత్రికల్లో చోటుచేసుకుంటోంది. అందుకే వారపత్రికల ప్రాసంగికత తగ్గింది. అవి మాసపత్రికల లేదా ద్వైమాస పత్రికల స్థాయికి చేరాయి.
వార్తల ‘తాజాదనం’ చప్పబడి గత విషయాలపై చర్విత చరణత పెరిగింది. ఇప్పుడు పెద్దలకి సంబంధించిన మతం, ఆరోగ్యం, క్రీడలు, ఆధ్యాత్మికం, పర్యాటకం, అందం, శృంగారం, మహిళ, కంప్యూటర్, విద్యా వ్యాపారం వంటి రంగాలకు చెందిన అంశాలు రంగు రంగుల సమాచారమై అందుతోంది. ఉన్నత వర్గాలవారు ఈ రెండోశ్రేణి తెలుగు పత్రికలకు రెండో ప్రాధాన్యతే ఇస్తారు. వారు ఎక్కువగా ఆంగ్ల పత్రికలు చదువుతారు. ఐనా తెలిసి కూడా ఆ పెద్దల కోసం పేజీల, శీర్షికల శిరస్సులు అవనతం చేసి ప్రతిరోజూ ఉదయమే వారికి ‘గుడ్ మార్నింగ్’ చెబుతాయి. మధ్యతరగతి, దిగువ వర్గాలకు ఎలాంటి సమాచారం ఉండదు. వారి సమస్యలు, ప్రయోజనాలు ఈ పత్రికల్లో కానరావు. అపుడో ఇపుడో ఓసారి అలా ‘నామకః’ కనబడతాయి. ఒకప్పుడు ప్రధానంగా ప్రజాసమస్యలు కనిపించేవి, ఇప్పుడు అవి కనుమరుగయ్యాయి. ఒకప్పుడు మొదటి పేజీ నుండి చివరి అక్షరం వరకు అవి ప్రాధాన్యత వహించేవని ఇపుడు ఎవరికైనా చెబితే నమ్మరు. మొన్నటివరకు ఆ సంప్రదాయం నడిచింది. అలనాటి కృష్ణాపత్రిక, గోలకొండ పత్రిక, ఆంధ్ర పత్రిక, ఉదయం, వార్త వంటి పత్రికల్లో ఏదో ఒక సంచికను అలవోకగా తీసి చూడండి. ప్రజావర్గాల కోసం, సమూహాల కోసం పాత్రికేయ అక్షరాలు పడిన తపన, వేదన ఎలాంటిదో తెలుస్తుంది. వాటివెనుక పాత్రికేయులు, సంపాదకులు పడిన శ్రమని, స్వేదాన్ని గుర్తించవచ్చు. చివరకు ‘హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ’ అనబడే ప్రత్యేక కథనాలలో సామాన్యుడిని మాన్యునిగా చేసే తపన కనిపిస్తుంది.
ఇవ్వాళ ఏమైంది? అక్షరాలు ఆకాశం లోంచి క్షణాల్లో ప్రవహించి మరికొద్ది క్షణాలలో మనిషిని ప్రత్యక్షంగా చేరే సమయంలో అవి గతానితో అనుబంధించి పోవడాన్ని ఏమందాం? వార్తారచన, దృశ్యవార్త విషాదాన్ని చూపడానికే పరిమితం అవుతున్నాయి. ఆ విషాద హేతువులను విస్మరించడం విస్మయం. ప్రత్యక్ష ప్రసారాలలో సైతం పాలక పక్షాల ప్రయోజనాల లోతుపాతుల పరిశీలనానంతరమే ప్రసారం కావడం ఒక వినూత్న ధోరణి.
రాష్ట్రాలు గమ్మున ఉ న్నంతకాలం పాత్రికేయ రంగం ‘బోనులో సిం హం’. ఈ మధ్య కేం ద్రంతో ఢీకొట్టగానే తెలుగుపత్రికల జూలు విదుల్చుకుంది. అంతగా ‘కట్టుబడి’ పోవడాన్ని ఏమందాం? ప్రజలకు ఏమీ తెలియదు. గమనించడం లేదని కళ్ళు మూసుకునే కలాల్ని అదమడం ఎంతవరకు సమంజసం?
ఇలాంటి విషయాల గురించి ఒక సంపాదకుడితో చర్చిద్దామనుకుంటుండగానే పత్రికలకన్నింటికీ- ఇప్పుడు ఒక ‘చీఫ్ ఎడిటర్’ ఉన్నాడని ఆయన అన్నాడు. అక్కడున్న అందరికీ తెలిసిపోయింది. పత్రికా సం పాదకులు నిద్రలో ఉండగానే ఫోను మోగుతుం ది. ‘నాకీ రోజు నిద్రపట్టని రీతిలో వార్త పడింద’ని ఆ ‘చీఫ్ ఎడిటర్’ సంపాదకులకు ఫోన్లు చేస్తాడు. అతని ‘పేషీ’ సిబ్బంది ఫోనులో అదే నస. మాటిమాటికీ యాజమాన్యంపై వత్తిడి. ఇదొక నవీన విధానం. నకిలీ పాత్రికేయ ఆధిపత్యం. రాష్ట్ర అధినేతే ముఖ్య సంపాదకునిలా ఏ వార్త వేయాలి? ఏవి తీసివేయాలి? అని నిర్ణయిస్తాడు. ప్రతిపక్షాల వార్తలు రాసినందుకు కాదు. తమ హయంలో ఉద్యోగుల లంచగొండితనం గురించి రాస్తే కూడా, ఎక్కడ అవినీతి లేదండీ, అంతమాత్రానికే, మాకు బాధ కలిగించేలా రాయాలా? ఇదెక్కడి న్యాయం? అని అని అడిగే పరిస్థితి.
పాపం! పత్రికాధిపతులు ‘అయ్యో!’ అని వాపోవలసి వస్తోంది. ఇలాంటి పరిస్థితి నుండి ఎలా తిరిగి విశ్వసనీయతను సాధించుకునే వీలుందనేది ఆలోచన. ఈ పరిస్థితికి రాజకీయ శక్తుల కొత్త ప్రాబల్యం కారణమా? లేక యాజమాన్యాల విధానంలో వచ్చిన మార్పు కారణమా?
ప్రపంచ వ్యాప్తంగా ఈ ధోరణి కనిపించడం బాధాకరమైనా, అది ఒక వాస్తవం. వెనకట ‘వార్ రూం’లలో అధికార రాజకీయ మల్లగుల్లాలు, అసమ్మతులు ఇవాళ పత్రికల బరిలో తేలుతున్నాయి. అధికార పార్టీలోని ప్రాబల్య వ్యక్తులు, శక్తులు పత్రికలను అడ్డం పెట్టుకుని తమ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతిపక్షం, అధకార పక్షం మధ్య జరిగే సంఘర్షణలకి కూడా మీడియా వేదిక అవుతోంది. వీటిని తట్టుకుని నిలబడగలిగే తటస్థ విధానం, వైఖరి ఏమైనా ఉందా? అని ఆలోచిస్తే నీరసమే ఆవరిస్తోంది. రాజకీయాలలో ‘లీకు’లకు ఎక్కువ ప్రాధాన్యత లభించి, అసలు సమస్యలను పట్టించుకోవడం లేదు అనిపిస్తోంది. ఏనాడూ లేని విధంగా సిఎం పేషీల జోక్యం పెరిగిపోవడం, పాత్రికేయ విలువలు తరిగిపోవడం జరుగుతోంది. ఇవ్వాళ పరిశోధనాత్మక జర్నలిజానికి కాలం చెల్లిపోయింది. ఒక్కో పత్రికకు రాజకీయ పక్షులే సమాచారం అందిస్తున్నాయి. వాటినే పత్రికలు తమ కృషిగా భావించి అచ్చు వేస్తున్నాయి. ఐతే ఆ వార్తలు / అంశాలు పాఠకులు లేదా ప్రజలు ఎలా స్పందిస్తున్నారన్న ఆలోచన, స్పందనలను చూసే తీరిక, ఓపిక లేకుండా పోతున్నది. ప్రభుత్వం తనకు నచ్చిన, మెచ్చిన పత్రికా ప్రకటనలను అందించినపుడు ‘మహాప్రసాదం’గా భావించి లేని ప్రాధాన్యతను కల్పించి స్థానం కల్పించడం తరచూ చూస్తున్నాం. కాని ఆ సమాచారంలోని డొల్లతనం, అనుపయోగత గురించి యోచన లేదు.
ఎన్నికలే ప్రధానంగా సాగే ‘వార్తాప్రసారం’ చాలా దుష్టమైన సంప్రదాయం. లోగడ పత్రికలు కూడా ఏదో ఒక పార్టీకి తమ మద్దతును ఏదో ఓ రూపంలో ఇచ్చేవి. కాని, ఇపుడు ఆ పని తక్కువ చేస్తూ, గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీకి లోబడిపోవడం కొత్త సంప్రదాయమైంది. ప్రస్తుతం చాలా పత్రికలు ఈ నియమం పాటిస్తున్నాయి. చట్టపరమైన రాజకీయా లు (లెజిస్లేటివ్ పాలిటి క్స్), పాలనాపరమైన రా జకీయాలు (బ్యూరోక్రాటిక్ పాలిటిక్స్), న్యాయపరమైన రాజకీయాలు (జ్యుడీషియల్ పాలిటిక్స్), పార్టీ రాజకీయాలు (పార్టీ పాలిటిక్స్) వంటివి కాకుండా ఇపుడు కేవలం ‘్భరీ పథకాల రాజకీయం’ నడుస్తోంది. ఈ పథకాలను విమర్శించేవారిని లేవనీయకుండా చేయడమే రాజకీయం. విమర్శించేవారిని నోరు మెదపకుండా చేయడమే సరికొత్త పాత్రికేయం. ప్రత్యామ్నాయ ఆలోచన ఇవ్వకుండా, ఇచ్చినా బయటకు రాకుండా ఆపగలిగే రాజకీయ చాణక్యం పెరిగింది. పత్రికల ద్వారా ఈ పని పాలకులు చేయిస్తున్నారు.
ప్రస్తుతం అతి నవీన ధోరణి ఏమంటే- అధినాయకుల, పాలకుల తాబేదారులైన ‘పేషీ’ ఉద్యోగులు ఆయా మంత్రుల శాఖలను గురించి పొగడ్తలు కురిపించడం, వాటిని ప్రముఖంగా పత్రికలు ప్రచురించడం. ఒకవేళ వారు రాయని పక్షంలో- ఆయా పత్రికలలో పనిచేసే పాత్రికేయ విభాగాధిపతులే వ్యాసాలు రాయడం! దీనివల్ల సమాజంలో ఒక పెద్ద అనర్థం దాపురించింది.
ఎవరైతే ప్రజాదృక్పథం వెల్లడించే వాహకాలుగా ఉంటారో వారే వ్యతిరేక దిశగా పనిచేయడం. ఈ ధోరణికి చాలా తెలుగు పత్రికలు దాసోహం అనడం బాధాకరం. ఎమర్జెన్సీని వ్యతిరేకించి, పత్రికల పేజీలని నిరసనతో, నల్లరంగులో ఖాళీగా ఉంచిన విలువలకు ఇది పూర్తి వ్యతిరేకం! పాత్రికేయ విలువలు తగ్గాయి. జర్నలిస్టిక్ వాయిస్ అనేది లేకుండా పోవడం గమనార్హం.
పాలక వర్గాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు బానిసగా చేసుకుంటున్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్ వంటి సాంకేతికతలను తమకు అనుగుణంగా మార్చేసుకుంటున్నాయి. వాటి ద్వారా ప్రత్యక్షంగా తమ భావాలకు, పనులకు (మంచి చెడు) మద్దతు సాధిస్తున్నాయి. ప్రత్యక్ష సంబంధం నెరుపుతున్నాయి. సామాజిక మాథ్యమాలలో ఉచితంగా ఓటర్లను చేరుతున్నాయి. రేడియో ప్రకటనలు, టీవీ చానళ్లలో ప్రకటనలు లేకుండా పని కానిస్తున్నాయి. లేని సంచనాలను సృష్టించి, ‘షేర్’ మంత్రం జపిస్తున్నారు. మెస్సేజ్‌ల రూపంలో తమ భావాలను ప్రజల నెత్తిన రుద్దుతున్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ‘సగం దేశం’ ఇంకా ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదు. కాబట్టి మీడియాని తమకు అనువుగా వాడుకోవడం కోసం ‘్ధన ప్రయోగం’, ‘బలప్రయోగం’ చేస్తాయి పాలక వర్గాలు. పాపం ప్రజలు ఏం చేస్తారు? పత్రికలను ప్రతిరోజూ ఆశతో ఒకటో, రెండో కొంటారు. ఈ డబ్బు ‘అదనపు’ సంపదగా గుర్తించని పత్రికలు వారిని లెక్కచేయవు. కాని- మరోవైపు పాఠక చైతన్యం పెరిగిపోతున్నది కదా! మరి?
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242