Others

చిత్తశాంతి కలిగించినవారే అవధూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిదూత
శ్రీబి.వి.నరసింహస్వామి
రచన: రావినూతల శ్రీరాములు
10/228, వనస్థలిపురికాలనీ,
మల్కాజిగిరి, హైదరాబాదు -47
సెల్: 8885653924

ఏ సాధుపురుషుని దగ్గర కు వెళ్లినపుడు మనస్సు శాంతిస్తుందో, ఏ పూర్ణపురుషుని దర్శనంతో చిత్తం నిశ్చలత్వాన్ని పొందుతుందో అతడే పూర్ణయోగిగా మన పెద్దలు చెబుతారు.
చాలామంది యోగులు, సాధుపురుషులు మొదట్లో చాలా సామాన్యంగా ఉంటారు. కాని వారు వయస్సుతోపాటుగా వారి జ్ఞానం పెరుగుతుంది. యుక్తవయస్సులోనే లేక చిరుప్రాయంలోనోవారు జ్ఞానులుగా అందరికీ పరిచయం అవుతుంటారు. అట్లాంటి కోవకు చెందినవారు శ్రీ. బి.వి. నరసింహస్వామి వారు వీరు సాయిదూతగా అందరికీ పరిచయస్థులు.వీరి పుట్టుక కూడా ఒక అసాధారణంగా జరిగింది. వీరి తల్లిదండ్రులకు పుత్రసంతానం కోసం తిరగని ఊరు ఉండేది కాదు. అట్లా పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తున్నా వీరికి సంతానం లభ్యమవలేదు. ఒకనాడు వీరింటికి అనుకోని అతిథిగా ఒక సాధువు విచ్చేసారు. ఆయన మీరు షోలింగర్ తీర్థయాత్ర చేసిరండి. మీ కోరిక నెరవేరుతుంది అన్నాడు.
ఆయన చెప్పినట్లుగా నే వారి కోరిక తీరింది. అంగచ్చియమ్మాళ్ గర్భవతి యై గోధూళి వేళ గోశాల వైపు వెళుతుండగా అనాయాసంగా ఎవరి సాయం లేకండా అదే ప్రాంగణంలోనే ప్రసవం జరిగిపోయింది. నరసింహస్వామికి అదేనాందీ వాచకం. ఇక అప్పటినుంచి పూలు వికసిస్తున్నట్టుగానే నరసింహం దినదినాభివృద్ధి చెందుతూ అలౌకిక సంఘటనలు చేస్తుండేవారు. అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేవారు. రమణాశ్రమానికి వెళ్లారు. అక్కడ రమణుల గురించి పూర్తి గా అవగాహన తెచ్చుకున్నారు. శ్రీరమణులతోమాట్లాడేవారు. సెల్ఫ్ రియలైజేషన్ అనే ఆంగ్ల గ్రంథాన్ని నరసింహస్వామి కూర్చారు.
అయాచితంగా వచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తూ పాదయాత్ర చేస్తుండేవారు. ఆయన్ను చూసిన వారు ఎవరైనా తమ వాహనంలో రమ్మంటే వెళ్లేవారు. లేదంటే నడుచుకుంటూ తన దారిన తాను వెళ్లుతూ ఉండేవారు. అనుకొన్న పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించి వచ్చేవారు. సిద్ధరూఢాశ్రమం కూడా వెళ్లారు. సిద్ధరూఢాస్వామి వారి అనుగ్రహంతో సంస్కృత విద్యపై పట్టు సాధించారు. ఆ పండరి పురం వెళ్లారు. అక్కడ ఒక అవధూతను దర్శనం చేసుకున్నాడు. ఆమె వెనుకనే నరసింహుడు కూడా అడుగులు వేయసాగాడు. అప్పుడు ఆ యోగిని నీవు నాతో ఎక్కడకు వస్తావు అని అడిగితే భగవంతుని దర్శనం చేయించండి అని నరసింహస్వామి అడిగాడు. అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి ఓ పురుషుడు వచ్చి పళ్లెంలో విందుభోజనం తెచ్చి నరసింహునికి ఇచ్చాడు. అతడిని తినమని ఆ యోగిని చెప్పింది. నరసింహుడు ఆ భోజనం స్వీకరించిన తరువాత కూడా మళ్లీ భగవంతుని దర్శనం కోసం అడిగితే ఇప్పుడు నీకు ఆహారాన్ని పండరీ నాథుడే తెచ్చాడు. కాని నీవు గుర్తించలేకపోయావు. నీకింకా పరిపక్వత రాలేదు అన్నదామె. ఖేదపడుతున్న నరసింహుని యోగినియే ఓదార్చింది. నీవు సదా భగవంతుని నామాన్ని వదలక జపిస్తూ ఉండూ స్వామి త్వరలో నిన్ను కరుణిస్తాడని అభయం చెప్పి మరీ కదిలింది. ఆ యోగిని ఆదేశంతో స్వామి నామాన్ని వదలక నరసింహుడు జపించేవాడు. ఇలా నరసింహస్వామి ని గూర్చి చిన్న చిన్న శీర్షికలతో విషయాన్నంతావివరంగా రావినూతలశ్రీరాములు సేకరించి గ్రంథస్తం చేశారు. సులభంగా చదవడానికి వీలుగా ఉన్నశైలితో ఏకబిగిన చదివించే గుణంతో ఉన్న ఈ చిరుపొత్తం అందరినీ ఆకర్షిస్తుంది చదివిస్తుందీ ‘‘సాయిదూత శ్రీబి.వి. నరసింహస్వామి.

- చరణశ్రీ