రాష్ట్రీయం

మహిళా వర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆమోదంతో కళాశాలను విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్ది వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. గురువారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన మంత్రి కాలేజీలోని వౌళిక వసతులు, విద్యాబోదన తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కాలేజీలో అందుతున్న విద్యాబోదన, సౌకర్యాల గురించి విద్యార్థునులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాలేజీకి విశ్వవిద్యాలయంగా మార్చేందుకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజనతో తెలంగాణకు ప్రత్యేకంగా మహిళా కాలేజీ లేకుండా పోయిందని, రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కోరినట్టు చెప్పారు. విశ్వవిద్యాలయ ప్రారంభానికి కావాల్సిన వౌలిక వసతులు, సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ప్రస్తుతం కాలేజీలో 42 యూజీ కోర్సులు, పీజీ కోర్సులు కొనసాగుతున్నాయని, పరిశోధన ఒక్కటే లేదని, విశ్వవిద్యాలయంగా మారితే పరిశోధన కూడా ప్రారంభం అవుతుందని తెలిపారు.

చిత్రం..కోఠిలోని మహిళా కళాశాలను సందర్శించిన కడియం శ్రీహరి