ఐడియా

చిక్కుకు చిట్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*పిల్లలకు ఆటల్లో, ఇంటివద్ద చిన్న చిన్న దెబ్బలు తగిలితే వాపు వస్తుంది. టీ కాచుకున్నాక ఆ టీ పొడిని మెత్తటి క్లాత్‌లో పెట్టి మూడు పూటలా వత్తితే వాపు, నొప్పి తగ్గుతుంది.
* దురదగా వున్న చర్మానికి చెంచె దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి రాస్తుంటే ఫలితం కనిపిస్తుంది.
*ఇంటి పనులతో ఇల్లాలు ఎప్పుడు బిజీగా వుంటుంది. కాళ్లు, చేతులు ఎల్లవేళలా నీటితో తడుస్తుంటాయి. గోరుచుట్టు, అక్కడ గోరు వద్ద పొట్టవాపు వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ముందుజాగ్రత్తగా అప్పుడప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి. దీనివల్ల కాళ్ళకు, చేతికి అందం వస్తుంది కూడా.
*నిత్యం ఇంట్లో లేదా నీడ పట్టులో వున్నవారికి విటమిన్ డి అవసరమైనంతగా దొరకదు. దీనివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం వుంది. కనీసం మూడు రోజులకు ఒకసారైనా ఎండలో నడవాలి.
*ఉల్లి తర్వాత తల్లి నిమ్మకాయ.పిండేసిన నిమ్మకాయ తొక్కల్ని తొక్కే కదా అని పారేయకండి. కుక్కర్‌లోపల మరకలు పట్టకుండా ఉండాలంటే ఈ తొక్కల్ని అడుగున పడేసి వండుకోండి.

- కె. నిర్మల