ఐడియా

అతి దాహానికి ఉపశమన చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇహ ఎండాకాలం వచ్చేసింది. ఎండా ఉక్కపోత ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎండల్లో తిరిగేవారికే కాక నీడపట్టున ఉన్నవారు కూడా దాహానికి గురవుతుంటారు. దాహం అనేది అసలు శరీరంలో నీటి శాతం తగ్గినపుడు జరుగుతుంది. అదీకాక ఒక్కోసారి శరీరంలోని పైత్యరసాలు ప్రకోపించినపుడు అధిక దాహం వేస్తుంది అంటారు.
మామూలుగా నీరు తాగడం అందరూ చేస్తుంటారు. ఎండల్లో తిరిగి వచ్చినవారికి దాహం వేయడం సహజమే. ఇలా కాకుండాఒక్కోసారి అతి దాహం కూడా వేస్తుంటుంది. అట్లాంటపుడు వైద్యులను సంప్రదించడం మంచిదే. అంతేకాక మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొంటే ఈ అతి దాహానికి ఉపశమనం కలిగించవచ్చు. ఒక్కోసారి పూర్తిగా అధిక దాహం తగ్గిపోతుంది కూడా. అవేంటోచూడండి
ఇపుడు అందరూ కుక్కర్స్‌లో అన్నం వండుతున్నారు. కాని అన్నం విడిగా వండేటపుడు వచ్చే గంజిని ప్రతిరోజు తీసుకొంటే కడుపులో మంటను, దాహాన్ని అరికట్టవచ్చు.
అన్నం వండినపుడు వచ్చే గంజిలో తెలకపిండిని కలిపి శరీరానికి రాస్తే ఆ అతి దాహం తగ్గిపోతుంది. ఇది బాగా ఎండల్లో తిరిగి వచ్చే అతిదాహానికి మందుగా చెప్పుకోవచ్చు.
దానిమ్మపండ్ల రసానికి సమంగా చక్కెర కలిపి పాకం పట్టాలి. ఈ పాకం లేత పాకంగా ఉన్నపుడు దించేసి ఈ పాకాన్ని రోజులు మూడుసార్లు తీసుకొంటే అతిదాహం అనేది తగ్గుతుంది.
ధనియాల కషాయం లో తేనె, చక్కెర కలిపి సేవించినా దాహం తగ్గుతుం.
అసలు ఎండాకాలంలో ముందునుంచే చల్లటి నీటిలో అరచెంచాడు ఉప్పును, ఒక టీస్పూన్ చక్కెర కలుపుకుని అప్పుడప్పుడు కనీసం రోజుకు ఒకసారి తాగుతూ ఉంటే అతి దాహం అనేది దగ్గరకు రాదు.
రోజు దోసెలు, ఇడ్లీల్లాంటి ఉపాహారాలు కాకుండా పొద్దున పూట పెరుగు లేక మజ్జిగ అన్నం తింటూ మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తింటే అసలు రోజంతా అతిదాహం అనిపించదు. వడదెబ్బకూడా తగలదు.
మిరియాలు, అల్లం, నిమ్మరసం కలిపిన చెరుకు రసం తాగితే త్వరగా దాహం తగ్గిపోతుంది.
పలుచని మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే దాహాన్ని అదుపు చేస్తుంది. ఈ పానీయాన్ని ఏ కాలంలోనైనా ప్రతిరోజూ తీసుకొంటే జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. వేడి శరీరం ఉన్నవారికి ఉపశమనంగా కూడా ఉంటుంది. ముఖం మీద పొక్కులు చిన్న చిన్న కురుపుల్లాంటివి కూడా రాకుండా ఉంటాయి. చర్మనిగారింపుకూడా వస్తుంది. సాయంత్రం వేళ బాగా దాహం వేస్తూ వాంతులు వస్తున్నట్టుగా అనిపిస్తే ఒక గ్లాసు మంచినీళ్లల్లో ఒక నిమ్మదబ్బరసం పిండి ఒక టీస్పూన్ చక్కెర చిటికె డు ఉప్పు కలిపి తీసుకొంటే పదినిముషాల్లోనే వారికి స్వస్థత వస్తుంది.

- జంగం శ్రీనివాసులు