Others

భగవంతుడు - ధనవంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడైతే భగవంతుడుంటాడో, అక్కడ ధనానికి ప్రాధాన్యత ఉండదు. ఎక్కడైతే ధనవంతుడుంటాడో అక్కడ భగవతత్త్వం ఉండదు. భయంతో కూడిన భక్తి మాత్రమే ఉంటుంది. ఇది తరతరాలుగా, యుగయుగాలుగా చెప్పబడుతున్న వాస్తవం. సహజంగా మనిషికి సుఖలాలసలో భగవంతుడు జ్ఞప్తిలో ఉండడు. బాధ కలిగినపుడే దేవుడు గుర్తొస్తాడు. ఇది లోక సహజం.
సత్యసాయిబాబా చాలా తక్కువగా పర్యటనలు చేసేవారు. ఒకసారి బెంగుళూరులో ఒక ధనవంతుని అభ్యర్థనపైన అతడు కొత్తగా నిర్మించుకున్న ఒక ప్యాలస్ లాంటి అతడు విలాస భవనానికి వెళ్లారు బాబా. ఇది హాలు, ఇవి బెడ్‌రూమ్‌లు, ఇది వంటిల్లు, ఇది మీటింగ్ హాల్, ఇది పార్టీ హాల్, ఇది గార్డెన్, ఇది ఈతకొలను ఇలా అన్నీ చూపించి దర్పంగా తన వైభవాన్ని చాటుకున్నాడు గొప్పగా - ఆ ధనవంతుడు.
అంతా చూసిన తర్వాత భగవాన్ సత్యసాయి బాబా అడిగారు - ఇన్ని రూములు, హాళ్లు, ఉద్యానవనాలూ అన్నీ చూపించావు. మరి ‘్ధ్యన మందిరం’ ఏది అని అడిగాడు. తెల్లబోయాడు సంపన్నుడు. బాబా నవ్వుతూ ‘అన్ని ఏర్పాట్లూ చేసుకున్నావు. కాని భగవంతుడికి ఒక చిన్న రూమ్ కూడా కేటాయించలేకపోయావు. సరే మీ పనివాళ్ల రూములు చూపించు’ అన్నారు. పనివాళ్ల కోసం వెనక పక్క అతి చిన్న రూములు రెండున్నాయి, రెండు కుటుంబాల కోసం. రెంటికీ కలిసి ఒకే బాత్‌రూం ఉంది. దానే్న బయట వాళ్ల డ్రైవర్లు, నౌకర్లు వస్తే కూడా వాడతారు.
ఇదంతా గమనించిన బాబా చెప్పారు ధనవంతుడితో ‘అందుకేనయ్యా! ధనం అధికంగా ఉన్న చోట దేవుడుండడు’ -పోనీ మానవసేవే మాధవ సేవ అని అనుకుందామా - నీ పనిమనుషుల గదులు చూస్తుంటే నీ హృదయ సంకుచితత్వం తెలుస్తోంది’ అని ఆపైన ఒక్క నిమిషం కూడా ఆ ధనవంతుడి ఇంట్లో బాగా ఉండలేక వెళ్లిపోయారు.
అందరూ ఇలాగే ఉంటారని కాదు. ప్రపంచం అలా ఉంటుంది. ఒక మిత్రుడు షేర్లు కొని అమ్మేవాడు. రోజులో 16 గంటలు అదే పనిలో మునిగి తేలేవాడు. 16 గంటల్లో పధ్నాలుగు గంటలు మొబైల్‌లోనే ఉంటుంది అతడి జీవనం. ఆహారం తినేది తక్కువ. కాఫీ, టీ, సిగరెట్లు ఎక్కువ. నిద్ర తక్కువ. మందు మత్తు ఎక్కువ. ఇదీ వరస. ఒకసారి అతనికి షేర్లలో పదిహేను లక్షలు ఒకే వారంలో లాభం వచ్చింది. పార్టీ ఇచ్చి పిలిచాడు. వెళ్లడానికి ఇష్టం లేకపోయినా, మిత్రుడు పదేపదే కోరితే కాదనలేక వెళ్లడం జరిగింది. గొప్పగా చెప్పాడు అందరికీ - 15 లక్షలు అంత సులభంగా వచ్చాయా? ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో! ఎన్ని ఫోన్లలో ఎంతమంది ఎకనమిస్ట్‌లతో, స్పెషలిస్ట్‌లతో, ఎనలైజర్స్‌తో సంప్రదించవలసి వచ్చిందో! అని అంతా తన ప్రతిభేనన్నట్లుగా కాలర్ ఎగరేశాడు. నవ్వొచ్చింది.
ఒక నెల తర్వాత అతని భార్య ఫోన్ చేసింది. ‘అన్నయ్యా! ఈయన చాలా డిప్రెషన్‌లో వున్నారు అని! వెళితే, తల మీద ఐస్ పెడుతోంది, ఆయన భార్య. తీవ్ర జ్వరం నిన్నటి నుండి. విషయం ఏమిటి అని అడిగితే షేర్లలో పోయిన వారం పాతిక లక్షలు పోయాయి. అదీ కథ అంది.
ఏంటోయ్! మరీ అంత దిగులు పడ్డావు’ అని అడిగితే ‘ఏం చెయ్యమంటావు మిత్రమా! ఒకే వారంలో పాతిక లక్షలు పోయాయి. భగవంతుడికి నాపైన దయ తప్పింది’ అని వాపోయాడు.
‘ఎందుకంత దిగులు! ఆ ముందు వారం పదిహేను లక్షలొచ్చాయి. పోయిన వారం పాతిక లక్షలు పోయాయి. తేడా పది లక్షలే కదా! దాని కోసం నువ్వు ఇంతగా మధనపడ్డావు. శరీరాన్ని బాధపెట్టావు. అది సరే! ఒకటి చెప్పు! పదిహేను లక్షలొచ్చినపుడు నీ గొప్ప చెప్పుకున్నావు. ఇప్పుడేమో పాతిక లక్షలు పోతే దేవుడి దయ తప్పింది అన్నావు. ఇదేంటి’ అంటే బిక్కముఖం వేశాడు మిత్రుడు. ఇలా ఉంటుంది మనుషుల మాయా జీవితం.
శాశ్వతమైన సంపన్నతకానీ, శాశ్వతమైన దారిద్య్రం ఆనీ ఉండదు. తరాలు మారుతూ, గతులూ మారుతుంటాయి. ఎవరి వ్రాత వాళ్లే వ్రాసుకుంటారు. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అంటారు ‘సేత్’ అనే మహాజ్ఞాని. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు అంటారు బ్రహ్మర్షి పత్రీజీ.
ఒక థియరీ ప్రకారం కుటుంబాల్లో ప్రతి మూడు తరాలకూ సంపదలు తారుమారు అవుతుంటాయి - అరుదుగా ఏడు తరాలకు ఒకసారి సంపదలు తారుమారవుతుంటాయి అంటారు. ఏది ఏమైనా సంపదలు క్రిందా మీదా అయినా, ఓడలు బళ్లయినా, బళ్లు ఓడలయినా, కొంతమంది చలించరు. స్థిరంగా ఉంటారు. తొణకరు బెణకరు. చక్కగా ప్రతిరోజూ ధ్యానం చేస్తారు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతారు. వింటారు. బోధిస్తారు. తమతో తాముంటారు. వారినే స్థితప్రజ్ఞులు అంటారు. వారినే రాజయోగులు అని కూడా అంటారు. వారు తమలోనూ ఎదుటి వారిలోనూ కూడా భగవంతుడినే చూస్తారు.
ఇలాంటి స్థితప్రజ్ఞులకు జేబులోనో, ఇంట్లోనో, బ్యాంకుల్లోనో డబ్బుండవచ్చు. కాని భావనలో డబ్బు ఉండదు. అలాగే ఇలాంటి కొందరికి కుచేలుని లాగా దారిద్య్రం ఉంటుంది. కాని భావనల్లోకి ఆ దారిద్య్రం రాదు. వారికి భావనల్లో కూడా భగవతత్త్వమే ఉంటుంది. ఇదే నిజమైన రాజయోగం.

-మారం శివప్రసాద్.. 9618306173