రాశిఫలం 03/14/2017

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ ద్వాదశి మ.2.52, కలియుగం - 5119 శాలివాహన శకం - 1939
నక్షత్రం: 
నక్షత్రం: శ్రవణం మ.2.27
వర్జ్యం: 
వర్జ్యం: సా.6.47 నుండి 8.31 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం: 
మ.12.00 నుండి 1.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలన మేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు,మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభ ముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణ విముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుట మంచిది.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు,మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయత్నం మేరకు స్వల్ప లాభముంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగ ముంటుంది.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
Date: 
Wednesday, March 14, 2018
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి