ఐడియా

బరువు తగ్గాలనుకుంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బరువు తగ్గాలనుకుంటే రోజూ రెండు సపోటాలు తినడం మంచిది. యోగా, వ్యాయామం చేశాక సపోటా తింటే అలసట మరచిపోయి మానసికోల్లాసం కలుగుతుంది.
* సపోటాలో పుష్కలంగా లభించే విటమిన్-ఎ వల్ల నేత్ర సంబంధ సమస్యలు దూరమవుతాయి. నీరసంగా ఉన్నపుడు వీటిని తింటే వెంటనే శరీరం ఉత్తేజాన్ని పుంజుకుంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచేందుకు, మలబద్ధకం సమస్యను అధిగమించేందుకు వీటిని తినడం ఉత్తమం.
* నోటికి తియ్యదనాన్ని అందించడమే కాదు, మన ఆరోగ్యానికి కూడా సపోటా ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో సమృద్ధిగా లభించే కార్బోహైడ్రేట్లు, ఇతర పోషకాలు గర్భిణులకు ఉపయోగపడతాయి. తల్లిపాలను వృద్ధి చేస్తాయి.
* సపోటాలోని పీచు పదార్థాలు, ఇతర పోషకాలు కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. నరాల బలహీనతలున్న వారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది.
* వీటిలోని ఇనుము, ఫాస్పరస్, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకల్లో దృఢత్వాన్ని పెంచుతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయేలా సపోటా దోహదపడుతుంది. వీటి విత్తనాలను ఎండబెట్టి చూర్ణంలా చేసి నీటిలో వేసుకుని తాగితే మూత్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

*