చిత్తూరు

వైభవంగా కల్యాణ వేంకటేశ్వర స్వామి పుష్పయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, మార్చి 14: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వలన, అధికార అనధికారుల వలన, భక్తుల వలన ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వలన సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 5 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. చామంతి, రోజాలు, గనే్నరు, సంపంగి, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలిరేకులు, మానుసంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరవం, బిల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగ అలంకరణలో శ్రీవారి సేవకులు, ఉద్యానవన సిబ్బంది పాల్గొన్నారు. పుష్పయాగానికి 3 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు నుంచి ఒకటిన్నర టన్ను, కర్ణాటక నుంచి ఒక టన్ను, ఏపీ నుంచి 500 కేజీల పుష్పాలు విరాళంగా అందాయి. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ వెంకటయ్య, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఆలయ ఏఈఓ ఆర్.శ్రీనివాసులు, ఫార్మ్ మేనేజర్ కే.జనార్థన్ రెడ్డి, ఇతర అధికారులు, అర్చకులు, సిబ్బంది విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.