కడప

రాములోరి కల్యాణానికి ముఖ్యమంత్రి పర్యటన ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 14: ఏకశిలనగర నీలమేఘశ్యాముని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 30వ తేది శుక్రవారం రాత్రి జరిగే కల్యాణోత్సవానికి సీఎం ఎన్.చంద్రబాబునాయుడు విచ్చేస్తున్న సమాచారం దాదాపు ఖరారైంది. ఇందుకు సంబంధించి బుధవారం ఓఎస్డీ నహీం అసీమ్, ట్రైనీ ఎస్పీ అశోక్ జిందాల్ నేతృత్వంలో పోలీస్ బలగాలు ఒంటిమిట్టలోని ముఖ్య ప్రదేశాలను పరిశీలించారు. ట్రాఫిక్ విషయంలో వాహనాల మళ్లింపు, సీఎం కాన్వాయ్ ప్రదేశాలు, బసచేసే హరిత రెస్టారెంట్, కల్యాణవేదిక, ఆలయ ప్రాంగణాలు తదితర ప్రదేశాలను వారు పరిశీలించారు. ఏయే ప్రాంతాలగుండా వాహనాలు మళ్లించాలి, భక్తుల రద్దీనిదృష్టిలో ఉంచుకోవడమే కాకుండా సుమారు 2 గంటల పాటు సీఎం ఉంటున్న నేపథ్యంలో బందోబస్తు చర్యలపై వారు క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో హైవేలోవెళ్లే వాహనాలు మళ్లించేందుకు ముమ్మడిగుంటపేట నుండి ఇబ్రహీంపేట, సాలాబాద్ మీదుగా చెరువుకట్ట నుండి మళ్లించేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు గత నెలలో కలెక్టర్ బాబూరావునాయుడు, ఎస్పీ బాపూజీ అట్టాడ పేర్కొన్నారు. ఇదేవిషయమై ఓఎస్టీ సిబ్బందితో చర్చించారు. ఆలయ ప్రాంగణం, సీఎం బందోబస్తుపై వారు పరిశీలన జరిపారు. కల్యాణం తిలకించేందుకు ఎంతమంది భక్తులు వస్తారన్న అంచనాను టీటీడీ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ కల్యాణానికి సిఎం రాక సందర్భంగా తాము పరిశీలన జరిపామని, పరిశీలించిన అంశాలను వివరించారు. మొత్తం మీద మూడవ సారి ముచ్చటగా సిఎం సీతారాముల కల్యాణోత్సవానికి రానున్నట్లు స్పష్టంగా ఖరారైనట్లు తెలుస్తుంది.

వ్యవసాయేతర భూమి మార్పులపై
ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
రాజంపేట, మార్చి 14:వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేయడంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ నియమ, నిబంధనలను క్షుణ్ణంగా పాటించాలని సీసీఎల్‌ఓ కార్యాలయం సీఎంఆర్‌ఓ పీడీ తేజ్‌భరత్ పేర్కొన్నారు. బుధవారం విజయవాడ కార్యాలయం నుండి భూ మార్పులు, రెవెన్యూ అంశాలపై ఆర్డీఓ, తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులతో పీడీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయభూమిని వ్యవసాయేత భూమిగా మార్పు అంశంపై రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఇచ్చిన అంశాలను జాగ్రత్తగా పాటించి, సంబంధిత ప్రదేశానికెళ్లి మార్పులకు చర్యలు తీసుకోవాలన్నారు. భూమి స్వభావ వివరాలు, వెబ్‌ల్యాండ్ ఆన్‌లైన్‌లో మార్పులు చేయటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్పుకు జిఓ 98 ప్రకారం అనే్నగజర్-ఏలో దరఖాస్తును సంబంధిత ఆర్డీఓకు సమర్పించాల్సి ఉంటుందని, ఇందుకు నిర్ధేశించిన పైకం చలానా రూపేణా చెల్లించాల్సి ఉంటుందని, అందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అసైన్డ్భూమి, కోర్టువాజ్యంలో ఉన్న, ఆక్రమణలో ఉన్న, చెరువు పోరంబోకు భూములు కాకుండా చూడాలన్నారు. దరఖాస్తు చేసుకున్న భూమిని సంబంధిత తహశీల్దార్ పరిశీలించి అనుమతి కొరకు ఆర్డీఓకు ప్రతిపాదనలు పంపాలని, తదుపరి ఆర్డీఓ పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్న ఆర్డీఓ వీరబ్రహ్మం, డివిజన్‌లోని తహశీల్దార్‌లు, రెవెన్యూ అధికారులు పీడీ సూచనలు, ఆదేశాలను నోట్ చేసుకుని తు.చ తప్పకకుండా పాటిస్తామని నివేదించారు.