కడప

నటసార్వభౌములకు ప్రజలే అవార్డులు ఇచ్చే పరిస్థితి వచ్చింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 14: నటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధానమంత్రి మోదీ, ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడులు ఆరి తేరారని, వీరికి అవార్డులు ఇవ్వడానికి ప్రజలే త్వరలో ముందుకు రానున్నారని సీపీఎం రాష్టక్రార్యవర్గ సభ్యురాలు రమాదేవి ఎద్దేవా చేశారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆమె మాట్లాడుతూ ఇద్దరు నాయుడులు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రం విడదీసే సమయంలో వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ఏదో చేస్తున్నట్లు ఆర్భాటం సృష్టించి నాలుగేళ్లపాటు రాష్ట్రప్రభుత్వానికి అండగా నిలచినట్లు వ్యవహరించారని, చివరకు ఇదంతా అపద్ధమేనని తేలిపోయిందన్నారు. ప్రధానిమోదీ తిరుమలకు వచ్చిన ప్రతిసారీ చంద్రబాబునాయుడు పాదకాంతులై ఆయన సేవలో తరిస్తూ తమ ఇరువురిని ఆశ్వీర్వదించి కోట్లరూపాయలు దండుకునేందుకు అవకాశం కల్పించాలని వెంకటేశ్వరస్వామికే నామాలు దుద్దారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రం ప్రకటించినప్పటికీ బిజెపి పాలకులు దాన్ని పట్టించుకోకుండా ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తే ఇదే పెద్ద అవకాశమని చంద్రబాబునాయుడు నాలుగేళ్లపాటు నోరెత్తకుండా ఉండిపోయారని, ఈ నాటకాలు ఎంతోకాలం కొనసాగవని హెచ్చరించారు. రాష్ట్రంలో బాబు పాలన వస్తే జాబు వస్తుందని ప్రకటించారని చివరకు బాబు వచ్చారు.. కొడుకుకు ఉద్యోగం వచ్చింది, ఉన్న ఉద్యోగులకు కొలువులు ఊడిపోయాయని ఆమె ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అడుగడుగునా అవినీతి తాండవిస్తోందని, కడప జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ ఏర్పాటుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కేంద్రంపై వత్తిడి తేకుండా డ్రామాలాడుతున్నారన్నారు. అనంతరం రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ జిల్లా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చి ప్రభుత్వం మెడలు వంచి పనులు చేయించేందుకు సీపీఎం అన్నివిధాల ముందుందని ఈపరిస్థితిని పోలీసుశాఖ సైతం అర్థం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో గాలేరు-నగరి, తెలుగుగంగ వంటి పథకాలు ద్వారా 20లక్షల ఎకరాల సాగునీరు అందించాల్సివుండగా బడ్జెట్‌లో అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకున్న వైనం చంద్రబాబుకే దక్కిందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు మనోహర్, సావంత్‌సుధాకర్, దస్తగిరిరెడ్డి, పాపిరెడ్డి, సుబ్బమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.

హైకోర్టుపై సీఎం హామీని తక్షణం ప్రకటించాలి
* అఖిల భారత న్యాయవాదుల సమాఖ్య, జే ఏసీ డిమాండ్
రాయచోటి, మార్చి 14: రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని రాయలసీమ న్యాయవాదుల జే ఏసీ నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇచ్చిన హామీని అధికారికంగా తక్షణమే ప్రకటించాలని అఖిల భారత న్యాయవాదుల సమాఖ్య న్యాయవాదులు, రాయచోటి ప్రజా సంఘాల జే ఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గత 50 రోజులుగా రాయలసీమలో కోర్టు విధులను బహిష్కరించి న్యాయవాదులు, ప్రజాసంఘాలు చేసిన ఉద్యమానికి స్పందించిన ముఖ్యమంత్రి రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఈ నెల 7న జరిగిన చర్చల్లో ఒప్పుకోవడం జరిగిందన్నారు. అదే విషయాన్ని సీ ఎం స్వయంగా పత్రికాముఖంగా ప్రకటనతో రాయలసీమ వాసులకు నమ్మకం కలగడం లేదన్నారు. గతంలో శ్రీబాగ్ ఒడంబడిక, విభజన హామీలకే దిక్కు లేకుండా పోవడంతో రాయలసీమ ప్రజలకు హైకోర్టు హామీపై నమ్మకం కలగడం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీ ఎం జీవో ద్వారా కానీ, అధికారికంగా కానీ ఒక ప్రకటన చేసి హామీ నిలబెట్టుకోవాలని న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో కోకన్వీనర్ ఎస్ ఎండీ బాష, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు గిరిబాబుయాదవ్, ఓపీడీ ఆర్ సహాయ కార్యదర్శి తాతయ్య, ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు హరినాధ్, న్యాయవాది హుమయూన్‌బాష, జే ఏసీ నాయకులు శ్రీనివాసులు, చెన్నక్రిష్ణ, వెంకటేసు, రవి తదితరులు పాల్గొన్నారు.

రాజ్యసభకు సీఎం రమేష్ ఎంపిక పట్ల హర్షం
రాయచోటి, మార్చి 14: మరోమారు రాజ్యసభకు రాజ్యసభ సభ్యులుగా సిఎం రమేష్‌నాయుడు ఎంపిక కావడం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాయచోటి మండల సమావేశంలో టీడీపీ రూరల్ అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజ్యసభకు ఎంపికైనందున సిఎం రమేష్‌నాయుడుకు అభినందనలు తెలుపుతున్నామని తెలిపారు. అనంతరం అన్ని గ్రామ పంచాయతీల్లో నెలకొన్న నీటిసమస్యపై చర్చించారు. ఈ ఉగాదికి కొత్త రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు, కొత్త గృహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి చొరవతో మిగిలిన అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేటట్లు చూస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రమేష్‌రెడ్డి, జిల్లా కోశాధికారి సుబ్బయ్యనాయుడు, గొర్లముదివీడు సర్పంచ్ జిలానీబాష, వరిగ సర్పంచ్ సహదేవరెడ్డి, పెమ్మాడపల్లె సర్పంచ్ బసవయ్య, టీడీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, షబ్బీర్, శ్రీనివాసులరెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.