తెలంగాణ

ఎన్నికలు, ఓట్ల కోణం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: సాధారణ ఎన్నికలకు ముందటి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో ఎన్నికలు, ఓట్ల కోణంలో బడ్జెట్ ప్రజారంజకంగా ఉండవచ్చన్న అంచనాల మేరకు కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతానికి శాశ్వత పునాదులు పడే విధంగా రూపొందించినట్టు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్, ఆర్థికశాఖ ప్రభుత్వ సలహాదారు జిఆర్ రెడ్డితో కలిసి మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌ను ఆషామాషిగా రూపొందించలేదని, కేంద్రం, ఇతర రాష్ట్రాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను అధ్యయనం చేసాకే తయారు చేసామన్నారు. దీంతో దేశంలోనే అత్యుత్తమ బడ్జెట్‌గా రూపొందించగలిగామన్నారు. జిఎస్‌టి వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ రాష్ట్రంలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజు ఆదాయ పెరగడం వల్ల ఆ నష్టాన్ని భర్తీ చేయగలిగిందని మంత్రి ఈటల వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకాలను సమన్వయం చేస్తూ ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట పరిధిలో ఉండే విధంగా బడ్జెట్‌కు రూపకల్పన చేయడానికి రెండు నెలల పాటు కసరత్తు చేసామన్నారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లపై ప్రజలకే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా అవగాహన ఉండేది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చాకే బడ్జెట్‌ను క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా చేసామన్నారు. ఆపద వస్తే ప్రభుత్వం తండ్రిలా ఆదుకుంటుందనే భరోసాను తమ ప్రభుత్వం కల్పించగలిగిందన్నారు. ఏ ధిక్కులేని వారిని ఆదుకోవడానికి తాము ప్రవేశ పెట్టిన ఆసరా పథకానికి దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా రూ. 5300 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గత కాంగ్రెస్ హయాంలో ఫించన్ల కోసం కేవలం రూ. 840 కోట్లు మాత్రమే కేటాయించే వారని మంత్రి గుర్తు చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు జాతీయ జిఎస్‌డిపి 5.9 శాతం ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఇది 4.2 శాతం మాత్రమే ఉండేదన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమే 2014-15లో రాష్ట్ర జిడిపి 6.6 శాతంగా నమోదు అయిందని గుర్తు చేసారు. సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి, సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఆ దిశగానే నిధుల కేటాయింపు జరిగిందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను నీతి అయోగ్ ప్రశించడంతో పాటు వీటిని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించిందన్నారు. అలాగే వీటికి ఆర్థిక సాయాన్ని అందించాలని నీతి అయోగ్ కేంద్రానికి సూచించినా నయా పైసా ఇవ్వలేదని మంత్రి ఈటల అసంతృప్తి వ్యక్తం చేసారు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు హక్కుగా వచ్చేవే తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో కాదని మంత్రి అన్నారు.