తెలంగాణ

వైద్యం, ఆరోగ్యానికి రూ. 7375 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: వైద్య, ఆరోగ్య రంగానికి 2018-19 సంవత్సరంలో 7375 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి రూపొందించిన సమగ్ర ప్రణాళిక వల్ల ప్రజారోగ్య వ్యవస్థ చాలా మెరుగైందని ప్రకటించారు. గతంలో సర్కారు దవాఖానాలపై ప్రజలకు నమ్మకం ఉండేదికాదని, ఇప్పుడు వీటిపై నమ్మకం పెరిగిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. శాసనసభకు బుధవారం సమర్పించిన వార్షిక బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య రంగంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాల గురించి వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకుని సూపర్ స్పెషాలిటీ దవాఖానాల వరకు నేరుగా నిధులు ఇస్తున్నారు. మందుల కొనుగోలుకు నిధులను రెట్టింపు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 దవాఖానాల్లో డయాలసిస్ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. 22 దవాఖానాల్లో ఐసియు కేంద్రాలను, 12 చోట్ల క్యాన్సర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటిపరీక్షలు నిర్వహించి, ఉచితంగాకళ్లద్దాలను అందించాలని నిర్ణయించారు. అమ్మఒడి పథకం పేరుతో గర్బిణీ స్ర్తిలను ప్రసవం కోసం ఇంటి నుండి దవాఖానాలకు తీసుకువెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పా టు చేశా రు. 102 నెంబర్‌కు ఫోన్ చేస్తే ఈ వాహనం వస్తుందని వెల్లడించారు. ఈ పథకానికి బడ్జెట్‌లో 561 కోట్ల రూపాయలు కేటాయించారు. కేసీఆర్ కిట్లను కొనసాగించేందు కు నిర్ణయించారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం తర్వాత శిశువుకు మూడు నెలలు వచ్చే వరకు మూడువిడతల్లో 12 వేల రూపాయలు ఇస్తున్నారు. ఆడప్లిల పుడితే మరో వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ పథకం వల్ల సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది.