కడప

రుణ వసూళ్ల లక్ష్యం సాదిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేకహోదాకు జీవంపోసింది జగనే
* అవిశ్వాసానికి టీడీపీ మద్ధతు ఇవ్వడం సంతోషకరం
* విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి, మార్చి 15: రాష్ట్రంలో ప్రత్యేక హోదాకు జీవంపోసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎస్‌ఎన్ కాలనీలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ మొట్టమొదటి నుండి ఎక్కడైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా లేక ప్రత్యామ్నాయం లేదని జగన్ చెప్పడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా కొరకు దీక్షలుచేస్తే వాటికి అనుమతులు ఇవ్వకుండా పోలీసులచే అడ్డుకోవడం బంద్‌లు జరగకుండా నిలిపివేయడం ఎంతవరకు సబబు అని అన్నారు. కానీ ఇప్పుడేమో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కావాలని మాటమార్చి ఇలా మాట్లాడటం మంచిపద్ధతి కాదన్నారు. ఇదే విధానం ముందు నుండి మాట్లాడి ఉంటే ఎంతో బాగుండేదన్నారు. 2016లో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్యాకేజీ ఇస్తామని ప్రకటించినపుడు అర్ధరాత్రి ప్రెస్ కాన్ఫరెన్సు ఏర్పాటుచేసి అప్పట్లో సీఎం అభినందింది చాలా బ్రహ్మాండమని కొనియాడటం జరిగిందన్నారు. అప్పట్లోనే జీఎస్టీపై గట్టిగా మాట్లాడితే తమకు అవకాశం ఇవ్వలేదని, కేవలం 30 సెకన్లు మాత్రమే ప్రతిపక్ష నాయకులకు అవకాశం కల్పించడం దారుణమన్నారు. లోటుబడ్జెట్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించడంపై అప్పట్లో జరిగిన బడ్జెట్ సమావేశాలలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని సీఎం అభినందిస్తూ తీర్మానం కూడా చేయడం జరిగిందన్నారు. కానీ 2018లో అదేమాటలు జైట్లీ మాట్లాడితే ఉన్నట్లుండి ప్రజల నుండి జగన్‌కు మద్ధతు వచ్చేది చూసి ఆందోళన చెంది సీఎం డ్రామాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీని విమర్శిస్తూ బలవంతంగా కన్నీళ్లను కారుస్తూ అద్భుత నటనను సీఎం చేస్తున్నారన్నారు. రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తూ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం ఎలా పూడుస్తారో అర్థం కావడం లేదన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ప్రజలకోసం మాట్లాడితే ప్రతి ఒక్కటీ హేళనచేసి మాట్లాడటం జరిగిందన్నారు. ఈరోజు అవిశ్వాస తీర్మానం వైకాపాయే ముందుకు రావడం జరిగిందని, ఈ తీర్మానికి టీడీపీ వారు కూడా సహకరిస్తామనడం సంతోషకరమన్నారు. డ్రామాగా కాకుండా ముఖ్యమంత్రి ఇప్పటి నుండైనా సరిగ్గా పనిచేయాలని సూచించారు. వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీపై గళం విప్పాలని, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కొరకు, గుంతకల్లులో రైల్వేజోన్ కొరకు సీఎం చేతిలో ఉన్న హైకోర్టుపై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తాము ముందుండి సహకరిస్తామని వివరించారు. రాజకీయ లబ్దికోసం సీఎం చేస్తున్న దిగజారుడు రాజకీయాలు రాష్ట్ర ప్రజలు కళ్లారా చూస్తున్నారని తెలిపారు. సీఎంకు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకేమాటపై నిలబడి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ఆశిస్తున్న తమ నాయకుడు జగన్‌కు అభినందనలు తెలుపుతున్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రశ్నించిన అవినీతిపై టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కడప, మార్చి 15: రుణవసూళ్లలో లక్ష్యాన్ని సాధించి మరింతమంది రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు సిబ్బంది సహకార సొసైటీల అధ్యక్షులు కృషిచేయాలని డీసీసీబీ ఛైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. కడపలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 99వ వార్షిక మహాజనసభ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రుణవసూళ్ల కార్యక్రమంలో యంత్రాంగమంతా గట్టిగా ప్రయత్నం చేయాలని, గత యేడాది నుంచి ఇప్పటివరకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు కింద రూ.1691కోట్లు రావాల్సివుందని, కేవలం 59.73శాతం మాత్రమే వసూళ్లుచేశారని పూర్తిస్థాయిలో వసూళ్లుచేస్తే ఆప్కాబ్ రుణంకోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని అన్నారు. ఏపి సహకార బ్యాంకు ద్వారా రూ.90కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరుచేస్తే ఇప్పటికీ రూ.32కోట్లు మాత్రమే రైతులకు అందించామన్నారు. జిల్లాలో 36 సహకార సంఘాల్లో 50శాతం రుణాల వసూళ్లులేకపోవడంతో మిగిలిన రైతాంగానికి రుణాలు అందించలేకపోయామన్నారు. 93మైక్రో ఏటిఎంలను 69 సహకార సంఘాల పరిధిలో 24బ్రాంచ్‌లలో ఏర్పాటుచేస్తున్నామని, 65వేల మంది సభ్యులకు సీకేసీసీ డెబిట్ కార్డులను అందజేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని మారుమూలగ్రామాల్లో సైతం రైతులకు మైక్రో ఏటిఎం అందుబాటులో ఉండేవిధంగా దృష్టిపెట్టామన్నారు. జాతీయ బ్యాంకుల స్థాయిలో మొబైల్ ఏటిఎంలు కూడా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా దృష్టిపెట్టామన్నారు. సీకేసీసీ పథకం ద్వారా రుణంపొందిన ప్రతిరైతు వ్యక్తిగత బీమా లక్షరూపాయలు అందించే విధంగా ప్రీమియం ఏర్పాటుచేస్తున్నామని, దీన్నిప్రైవేట్ కంపెనీలకు అప్పగించే యోచన కూడా చేస్తున్నామన్నారు. ఈస్కీమ్‌లో అనేక వెసులుబాటులు ఉన్నాయని వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ సంఘాలు రైతులకు ఎరువులు అందించేందుకు బ్యాంకు గ్యారంటీని రూ.5లక్షలు వరకు జిల్లాసహకార మార్కెటింగ్ సొసైటీకి పూర్తిస్వేచ్చ ఇచ్చినట్లు చెప్పారు. బ్యాంకు ఖాతాదారులందరికీ మొబైల్, ఇంటర్నెట్, బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామని, సహకార సంఘ సొసైటీలను కంప్యూటీకరించి సభ్యులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. కాగా డిపాల్టర్లుగామారి సస్పెండ్ అయిన ఆరుగురు డైరెక్టర్ల వ్యవహారంపై రిజిస్టర్, జిల్లాసహకారశాఖ అధికారికి నివేదించడమైనదన్నారు. వీరిస్థానంలో కో-ఆప్షన్స్‌ను ఎన్నుకునేందుకు తిరిగి జరగబోయే పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకుమునుపు బ్యాంకు మహాజన సమావేశం లో పాలకవర్గాన్ని మరో ఆరునెలలు పొడిగించినందుకు వీలుగా అనిల్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక కేక్‌ను కోసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

టెన్త్ పరీక్ష కేంద్రాలను తనిఖీచేసిన కలెక్టర్
కడప,మార్చి 15: టెన్త్‌పరీక్షా కేంద్రాలను గురువారం కలెక్టర్ టీ.బాబూరావునాయుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కడపలోని గాంధీనగర పాలనకోన్నత పాఠశాలను కలెక్టర్‌తోపాటు విద్యాశాఖ అధికారి శైలజతో కలిసి పరీక్షకేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, విద్యుత్ ఏర్పాట్లపై ఆరాతీశారు. ఈనెల 29వరకు పరీక్షలు సజావుగా నిర్వహించాలని, లేనిపక్షంలో సంబంధిత సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాల్సిందిగా ప్రధానోపాధ్యాయురాలు సత్యసుజాతమ్మను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద శుభ్రత ఉండేలా చూడాలన్నారు. అలాగే మారుతీనగర్‌లోని నాగార్జున ప్రైమరీస్కూల్‌లో కూడా తనిఖీ చేపట్టారు. ఈసందర్భంగా పరీక్ష కేంద్రంలో పనిచేస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ శంకరాచారికి కలెక్టర్ పలు సూచనలు జారీచేశారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి పుస్తకాలు ఉంచకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్‌సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
* స్పెషల్ డీప్యూటీ కలెక్టర్
రాజుపాలెం, మార్చి 15: కుందూ-పెన్నా వరదకాలువ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ముద్దనూరు జిఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన చిన్నచెట్టుపల్లెగ్రామ రైతులతో చర్చించారు. కుందు-పెన్నా భూసేకరణలో భాగంగా చిన్నచెట్టుపల్లె గ్రామరైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరిగిందని, ఇంకా రైతులకు ఏవైనా లబ్దిచేకూర్చేందుకు కలెక్టర్‌తో చర్చించి రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వర్షాకాలంలో వరద కాలువవల్ల వర్షం నీరంతా పొలాల్లో నిలచిపోతున్నాయని, పంటపొలాలకు వెళ్లేందుకు వంతెన నిర్మాణాలు చేపట్టాలని కోరారు. వరదకాలువకు రైతులకు ఇచ్చే నష్టపరిహారాన్ని మాకు కూడా అందించాలని ,కాలువకు భూములు కోల్పోయిన నిర్వాసితులు ఆయన్ను కోరారు. ఈసమస్యలపై స్పందించిన స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ మాట్లాడుతూ కుందు, పెన్న వరదకాలువకు 2008లో నష్టపరిహారం 80శాతం చెల్లించడం జరిగిందని , 20శాతం చెల్లించాల్సివుందన్నారు. నష్టపరిహారం పెంపుదల విషయం, కలెక్టర్, స్టేట్ కమిటీ నిబంధనల మేరకు ఉంటుందన్నారు. మిగిలిన భూమిని భూసేకరణకు తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఏ సమస్యవచ్చినా సంప్రదించాలన్నారు.