తెలంగాణ

సేద్యం, మార్కెటింగ్‌కు రూ.15,780 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: పంటల పెట్టుబడికి ఎకరానికి నాలుగువేల రూపాయల చొప్పున ఇస్తామంటూ తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు వీలుగా 2018-19 సంవత్సరం బడ్జెట్‌లో 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యవసాయ రంగానికి మొత్తం 15,780 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇందులో దాదాపు 75 శాతం నిధులు ‘రైతుల పెట్టుబడి పథకం’ (4 వేల పథకం) కోసం కేటాయించినట్టయింది. 2018 వానాకాలం పంట నుండి పెట్టుబడి పథకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రకటించింది. వానాకాలం పంటకోసం ఏప్రిల్ నుండి ఎకరాకు నాలుగువేల రూపాయలు ఇస్తామని, యాసంగి పంటకోసం నవంబర్ నుండి ఎకరాకు నాలుగువేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గురువారం శాసనసభలో ప్రకటించారు. ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ, ఒక్కో ఎకరానికి నాలుగువేల రూపాయల చొప్పున లెక్కించి చెల్లిస్తారు. రెండు పంటలకు కలిపి రైతులకు ఇవ్వాల్సిన పంటల పెట్టుబడి పథకం కోసం బడ్జెట్‌లో 12 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. రాష్ట్ర అభివృద్ధిలో సేద్యం రంగమే కీలకమైందని, అందుకే మొదట రైతుల రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. భవిష్యత్తులో రైతులు పంటల పెట్టుబడి కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, కలుపుతీయడం తదితర పనులకోసం ఎకరాకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ తరహా పథకం దేశంలో మొట్టమొదటి సారి చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 10,823 గ్రామాల్లో సమగ్ర భూసర్వే జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. 1507 బృందాలు వంద రోజుల పాటు శ్రమించి 72,13,111 ఖాతాలను పరిశీలించి మార్పులు, చేర్పులు చేశారని వెల్లడించారు. రైతులు తమ హకులను సాధించుకునేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,61,000 మంది రైతులు సమన్వయ సమితుల్లో సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వానికి-రైతులకు మధ్య అనుసంధానంగా రైతు సమన్వయ సమితులు పనిచేస్తాయని స్పష్టం చేశారు. రైతు భీమా పథకం కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకు 522 కోట్ల రూపాయలు కేటాయించారు. బిందు, తుంపర సేద్యానికి (మైక్రో ఇరిగేషన్) కు పరికరాల కొనుగోలుకు ఎస్‌సి, ఎస్‌టిలకు వందశాతం సబ్సిడీ ఇస్తుండగా, బిసిలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.