రాష్ట్రీయం

జీడీపీ హైస్పీడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అవతరించిన నాలుగేళ్లలోపలే జిడిపిలో 14.1 శాతం వృద్ధిరేటును సాధించింది. 2016-17లో రాష్ట్ర జిడిపి రూ. 6,41,985 కోట్లు ఉంటే, 2017-18లో ఈ మొత్తం రూ.7,32,657 కోట్లకు చేరుకుంది. జాతీయ జిడిపిలో తెలంగాణ రాష్ట్ర జిడిపి వాటా 2013-14లో 4.02 శాతం ఉంటే, 2017-18లో రాష్ట్ర వాటా 4.37 శాతానికి పెరిగింది. ఈ వివరాలను రాష్ట్రప్రణాళిక శాఖ 2018 సంవత్సరానిక ప్రచురించిన సామాజిక ఆర్థిక అవుట్‌లుక్ సర్వేలో వెల్లడించింది. రాష్ట్ర తలసరి ఆదాయం 2017-18లో 1,75,534 ఉంటే, 2016-17లో రూ. 1,54,734 నమోదైంది. తలసరి ఆదాయం 13.4 శాతం పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం 2017-18లో రూ.1,12,764 నమోదైంది. జాతీయ తలసరి ఆదాయంపై తెలంగాణ ఆదాయం 8.6 శాతం ఎక్కువ. దీని ద్వారా రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధి, జాతీయ తలసరి ఆదాయ వృద్ధి కంటే ఎక్కువు వేగంగా పెరుగుతోంది. దేశం మొత్తం మీద ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ఆర్థిక రంగంలో స్థిర ధరలో సగటున 9 శాతం వృద్ధిరేటు నమోదైంది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను ప్రవేశపెట్టడం వంటి కారణాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు మందగించింది. కాని ఆర్థికాభివృద్థిలో జాతీయ రేటు 2015-16లో 8.2 శాతం, 2016-17లో 7.1 శాతం, 2017లో 6.6 శాతంగా నమోదైంది. ఆర్థికాభివృద్ధిలో జాతీయ మందగమనానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధిరేటు నిలకడగా ముందుకు సాగుతోంది. 2015-16లో వృద్ధిరేటు 8.6 శాతం, 2016-17లో 10.1 శాతం, 2017-18లో 10.4 శాతం నమోదైంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు 9.8 శాతం, పారశ్రామిక రంగంలో 8.6 శాతం నమోదైంది. ఈ ఏడాది పత్తి పంట దిగుబడి 43.32 లక్షల బేళ్లు ఉంటుందని అంచనా. గత సంవత్సరం 34.44 లక్షల బేళ్ల పత్తి దిగుబడి అయింది. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా, సాగునీటి రంగాల్లో ప్రగతి, వ్యవసాయ రుణాల మాఫీ, వ్యవసాయ రంగ యాంత్రీకరణ, సూక్ష్మ నీటిపారుదల విధానాల వల్ల భవిష్యత్తులో దిగుబడి పెరుగుతుందని అంచనా వేశారు. రాష్ట్ర జనాభాలో 11 శాతం మందికి అంటే దాదాపు 38.87 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ధి చేకూరుతుందని సామాజిక, ఆర్థిక అవుట్‌లుక్‌లో పేర్కొన్నారు.